iDreamPost

T20 World Cup: ఐర్లాండ్‌తో టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు!

  • Published Jun 06, 2024 | 7:49 AMUpdated Jun 06, 2024 | 7:49 AM

India vs Ireland, T20 World Cup 2024: ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయంతో టీమిండియా వరల్డ్‌ కప్‌ వేటను సాలిడ్‌గా మొదలుపెట్టింది. అయితే.. మరి ఈ విజయానికి దోహదం చేసిన ఐదు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

India vs Ireland, T20 World Cup 2024: ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయంతో టీమిండియా వరల్డ్‌ కప్‌ వేటను సాలిడ్‌గా మొదలుపెట్టింది. అయితే.. మరి ఈ విజయానికి దోహదం చేసిన ఐదు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 06, 2024 | 7:49 AMUpdated Jun 06, 2024 | 7:49 AM
T20 World Cup: ఐర్లాండ్‌తో టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు!

టీ20 వరల్డ్‌ కప్‌ వేటలో భాగంగా టీమిండియా తమ తొలి అడుగును చాలా సాలిడ్‌గా వేసింది. బుధవారం పసికూన ఐర్లాండ్‌ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో పాటు టీమిండియా స్పీడ్‌ బౌలింగ్‌ ఎటాక్‌ మొత్తం సూపర్‌ బౌలింగ్‌తో అదరగొట్టడంతో భారత్‌ సులువైన విజయాన్ని అందుకుని.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను విజయంతో ప్రారంభించింది. అయితే.. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి దోహద పడిన ఐదు ప్రధాన అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. బౌలింగ్‌

ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్‌లో కాస్త ప్రయోగాలు చేసేందుకు ప్రయత్నించింది. స్టార్‌ బౌలర్‌ బుమ్రాను కాదని అర్షదీప్‌ సింగ్‌కు కొత్త బంతి అందించాడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. అది అద్భుత ఫలితాన్ని అందించింది. అర్షదీప్‌ సింగ్‌తో పాటు, సిరాజ్‌, హార్ధిక్‌ పాండ్యాలకు ఈ మ్యాచ్‌తో టెస్ట్‌ పెట్టాడు రోహిత్‌. ఈ టెస్టులో అంతా పాస్‌ అయ్యారు. సిరాజ్‌, పాండ్యా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. వీరికి తోడు బుమ్రా సైతం తన మార్క్‌ చూపించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ మొత్తం తమ సత్తా చాటింది. కేవలం రెండు ఓవర్లు మాత్రమే స్పిన్‌ చేయించిన రోహిత్‌.. మిగతా ఓవర్లని పేసర్లతోనే వేయించాడు. వీరిలో అర్షదీప్ సింగ్‌ 2, హార్ధిక్‌ పాండ్యా 3, బుమ్రా 2, సిరాజ్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. బుమ్రా, సిరాజ్‌ చాలా తక్కువ పరుగులు ఇచ్చారు.

5 reasons for Team India's success!

2. పిచ్‌ కండీషన్‌
నసావు పిచ్‌పై ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. తెచ్చిపెట్టిన ఈ పిచ్‌ ఎలా బిహేవ్‌ చేస్తుందో అని చాలా మంది భయపడ్డారు. వారు భయపడినట్లే.. పిచ్‌లో కొంత ఆస్మిక బౌన్స్‌తో బ్యాటర్లు ఇబ్బంది పడ్డాడు. అయితే.. ఐర్లాండ్‌ బౌలింగ్‌లో అంత సత్తా లేకపోవడంతో టీమిండియా ఈజీగా గెలిచింది. కానీ, ఆసీస్‌ లాంటి పేస్‌ బౌలింగ్‌ ఎదురుగా ఉంటే టీమిండియాకు కూడా కష్టాలు తప్పేవి కాదు. అయితే.. టీమిండియా క్వాలిటీ పేస్‌ ముందు ఐర్లాండ్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. 16 ఓవర్లలో కేవలం 96 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యారు.

3. రోహిత్‌ ఫామ్‌లోకి రావడం
ఐపీఎల్‌ 2024లో బ్యాడ్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ.. టీమిండియా జెర్సీలో వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగిన వెంటనే తన మార్క్‌ బ్యాటింగ్‌తో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే.. రోహిత్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లీ 5 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. కానీ, రోహిత్‌-కోహ్లీ ఓపెనింగ్‌ జోడీ మాత్రం ప్రత్యర్థులకు వణుకు పుట్టించేలా ఉంది.

4. బ్యాటింగ్‌
ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌ ఐర్లాండ్‌ బ్యాటర్లను ఎంత ఇబ్బంది పెట్టిందో.. టీమిండియా బ్యాటర్లు.. ఐర్లాండ్‌ బౌలర్లను అంతా ఆడుకున్నారు. ఒక్క విరాట్‌ కోహ్లీ తప్పింతే.. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, వన్‌డౌన్‌లో వచ్చిన రిషభ్‌ పంత్‌ అద్భుతంగా ఆడారు. అలాగే సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం ఈ మ్యాచ్‌లో నిరాశపర్చాడు. కానీ, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ చేసిన మార్పులు బాగున్నాయని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు.

5. కెప్టెన్సీ
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడుకోవాలి. ఒకే ఒక వామప్‌ మ్యాచ్‌లో అవకాశం రాని వారికి ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పించాడు. ముఖ్యంగా మన పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను గాడిలో పెట్టేందుకు నలుగురు పేసర్లు అర్షదీప్‌ సింగ్‌, సిరాజ్‌, బుమ్రా, హర్ధిక్‌ పాండ్యాలను అద్భుతంగా వినియోగించాడు. వారితోనే ఎక్కువ ఓవర్లు వేయించి.. వారికి మంచి ప్రాక్టీస్‌తో పాటు ఆత్మవిశ్వాసం కలిగేలా చేశాడు. ఒక కెప్టెన్‌గా టీమ్‌కు ప్రస్తుతం ఏం అవసరమో అదే చేశాడు. అది మంచి ఫలితం కూడా ఇచ్చింది. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీతో పాటు.. టీమిండియా విజయానికి దోహదం చేసిన ఈ ఐదు కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి