iDreamPost

ఇండియాను అవమానించే కుట్ర! పాక్‌ ఫ్యాన్స్‌.. ఈ లెక్కలు చూడండ్రా బాబు!

  • Published Oct 06, 2023 | 1:02 PMUpdated Oct 06, 2023 | 1:02 PM
  • Published Oct 06, 2023 | 1:02 PMUpdated Oct 06, 2023 | 1:02 PM
ఇండియాను అవమానించే కుట్ర! పాక్‌ ఫ్యాన్స్‌.. ఈ లెక్కలు చూడండ్రా బాబు!

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వన్డే వరల్డ్‌ కప్‌ మెగా టోర్నీ ప్రారంభమైపోయింది. గురువారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌తో వరల్డ్‌ కప్‌ మహా సంగ్రామం మొదలైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ ఫేవరేట్స్‌గా ఉన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఏకంగా 9 వికెట్ల తేడాలో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ విషయం కాస్త పక్కనపెడితే.. తొలి మ్యాచ్‌ సందర్భంగా ఓ వివాదం రాజుకుంది. వరల్డ్ కప్‌ ఆరంభ మ్యాచ్‌కు క్రౌడ్‌ చాలా తక్కువగా వచ్చారంటూ సోషల్‌ మీడియాలో ఇండియాపై అలాగే బీసీసీఐపై ట్రోలింగ్‌ దిగారు క్రికెట్‌ అభిమానులు. ముఖ్యంగా పాకిస్థాన్‌ నుంచి ఈ ట్రోలింగ్‌ ఎక్కువ జరిగింది. ఇండియా అంటేనే ప్రతి విషయంలో ఏడ్చే పాకిస్థానీయులు.. నిన్నటి వరల్డ్‌ కప్‌ ఆరంభ మ్యాచ్‌లో ప్రేక్షకులు పల్చగా ఉండటంతో.. ఇదే సందు అనుకుని ట్రోలింగ్‌కు దిగారు. ఒక వరల్డ్‌ కప్‌ ఫస్ట్‌ మ్యాచ్‌కు ఇంత తక్కువ మంది క్రౌడా? అంటూ హేళనగా మాట్లాడారు.

అయితే.. ఈ ట్రోలింగ్స్‌కు ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు మాటలతో కాకుండా.. లెక్కలలో అద్భుతంగా కౌంటర్‌ ఇచ్చారు. ఓ వంద మంది రాగానే నిండిపోయి.. చుట్టూ జనం కనిపించేందుకు ఇది పాకిస్థాన్‌లోని చిన్నా చితకా స్టేడియం కాదని.. ఏకంగా ఒక లక్షా 32 వేల మంది కూర్చునే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం అని బదులిస్తున్నారు. పైగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ మొత్తం 47,518 మంది హాజరయ్యారు. ఇది చిన్న సంఖ్య కాదు. ఇంత మంది కూర్చునేందుకు పాకిస్థాన్‌లో ఒక్క స్టేడియం కూడా లేదు. స్టేడియం చాలా పెద్దది కావడంతో 47 వేల మందికి పైగా ప్రేక్షకులు వచ్చినా.. తక్కువగా కనిపిస్తున్నారు. పైగా ఆసియాలో గతంలో జరిగిన వరల్డ్‌ కప్స్‌ తొలి మ్యాచ్‌కు కూడా ఇంత మంది ఎప్పుడు హాజరు కాలేదు. 47 మందికి పైగా హాజరు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే.. మ్యాచ్‌ ఆరంభమైన సమయంలో తక్కువమందే వచ్చినా.. మ్యాచ్‌ సాగుతున్న కొద్ది ప్రేక్షకులు వస్తూనే ఉన్నారు. గురువారం వర్కింగ్‌ డే కావడంతో చాలా మంది ఆఫీసులు ముగిసిన తర్వాతనే స్టేడియానికి వచ్చినట్లు సమాచారం.

ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌కే 47 వేల మందికి పైగా వస్తే.. ఇక ఇండియా ఆడి ఉంటే.. ఎంత మంది వచ్చేవారో అంచనా వేసుకోవాలని ఇండియన్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. అయితే.. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఎంత పెద్దది అంటే.. పాకిస్థాన్‌లోని ప్రధాన స్టేడియాలన్ని కలిపినా.. నరేంద్ర మోదీ స్టేడియానికి సాటి రావు. కరాచీ స్టేడియం కేపాసిటీ 34,228. ముల్తాన్‌ స్టేడియం కేపాసిటీ 30 వేలు, లాహోర్‌ స్టేడియం కేపాసిటీ 27 వేలు, రావల్పిండి స్టేడియం కేపాసిటీ 15 వేలు మాత్రమే.. ఇలా ప్రధాన స్టేడియాల మొత్తం కేపాసిటి కలిపినా.. ఒక లక్షా 6 వేల 228 మాత్రమే. కానీ, అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్‌ క్రికెట్ స్టేడియం కేపాసిటీ ఒక లక్షా 32 వేలు. ఇంత పెద్ద స్టేడియం కాబట్టే.. దాదాపు 50 వేల మంది వచ్చి మ్యాచ్‌ చూసినా.. క్రౌడ్‌ సరిగా రాలేదంటూ పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులు పనిగట్టుకుని ఇండియాను అవమానపర్చేలా సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్ లో తిలక్ వర్మ థండర్ ఫిఫ్టీ! T-shirt పైకెత్తి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి