SNP
Gautam Gambhir, BCCI, Cricket News: టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టకముందే.. గౌతమ్ గంభీర్ తన పని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. టీమిండియాలో భారీ ప్రక్షాళన చేయనున్నాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Gautam Gambhir, BCCI, Cricket News: టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టకముందే.. గౌతమ్ గంభీర్ తన పని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. టీమిండియాలో భారీ ప్రక్షాళన చేయనున్నాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. ఆ కొత్త కోచ్ కూడా గౌతమ్ గంభీర్ అని ఇప్పటికే అనధికారికంగా అంతా ఫిక్స్ అయిపోయారు. నేడో, రేపో ముంబైలోని బీసీసీఐ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి.. నామమాత్రపు ఇంటర్వ్యూ ఇచ్చి.. అధికారికంగా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే.. ఇంకా బాధ్యతలు తీసుకోకముందే.. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా తన పని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తాను టీమిండియా హెడ్ కోచ్‌గా ఉండాలంటే.. తన డిమాండ్లు నెరవేర్చాలని గంభీర్ ముందే బీసీసీఐ ముందు కొన్ని డిమాండ్లు ఉంచాడు.
వాటికి బీసీసీఐ పెద్దలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అవి ఏదో సాదాసీదా డిమాండ్స్ కావు.. టీమిండియాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పూర్తి స్థాయిలో సమూల మార్పులకు గంభీర్ పట్టుబట్టాడు. అందులో అతి ముఖ్యమైంది మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు జట్లు. బీసీసీఐ ముందు గంభీర్ పెట్టిన డిమాండ్స్‌లో ఇదే చాలా ముఖ్యమైంది. ఇప్పటి వరకు టీమిండియా ఎప్పుడూ వేర్వేరు టీమ్స్‌తో వేరే వేరు ఫార్మాట్లు ఆడలేదు. చిన్న దేశాలతో సిరీస్‌లకు సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చి జూనియర్లతో పంపించారు తప్పితే.. టీ20లకు ఈ జట్టు, వన్డేలకు ఈ జట్టు, టెస్టులకు ఈ టీమ్ అంటూ వేర్వేరుగా ఆడించలేదు.
కానీ, గంభీర్ మాత్రం ఇప్పుడు ఆ ఫార్ములాను భారత క్రికెట్‌లో ప్రవేశపెట్టున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. అలాగే.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండే అవకాశం ఉంది. వీటితో పాటే ప్రస్తుతం ఉన్న కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని తొలగించి కొత్త స్టాఫ్‌ను తీసుకోనున్నారు. ఇది కూడా గంభీర్ కోరిక మేరకే జరుగుతోంది. తాను హెడ్ కోచ్‌గా ఉంటే.. తనతో పాటు తన టీమ్ కూడా కొత్త టీమ్ అయి ఉండాలని గంభీర్ బీసీసీఐకి సూచించాడు. గంభీర్ చెప్పిన ఈ విషయాలకు బీసీసీఐ ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BCCI accepts ‘next India coach’ Gautam Gambhir’s demand on separate teams for different formats: Report pic.twitter.com/DEmBSE9tfd
— Sayyad Nag Pasha (@nag_pasha) June 18, 2024