iDreamPost

షాకింగ్ న్యూస్ : ఒకే కుటుంబంలొ 25 మందికి కరోనా

షాకింగ్ న్యూస్ : ఒకే కుటుంబంలొ 25 మందికి కరోనా

మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఒకే కేటుంబంలోని 25 మందికి కరోనా వైరస్ సోకిన విషయం బయటపడటం సంచలనంగా మారింది. ఇప్పటి వరకూ దేశం మొత్తం మీద వెలుగు చూసిన కేసుల్లో ఒకే కుటుంబం నుండి ఇంతమందికి వైరస్ సోకటం అంటే మామూలు విషయం కాదు. సౌదీ అరేబియాకు వెళ్ళిన వచ్చిన నలుగురు నుండి కుటుంబంలోని మిగిలిన వారికి అంటుకుందని స్పష్టమవ్వటంతో ప్రభుత్వం అప్రమత్తమై అందరినీ క్వారంటౌన్ సెంటర్లకు తరలించింది.

సౌదీ అరేబియాకు వెళ్ళి తిరిగొచ్చిన నలుగురు దేశంలోకి రావటమే వైరస్ తో వచ్చారు. నాలుగైదు కుటుంబాలు కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండటం అందులోను చాలా చిన్ని ఇంట్లో 25 మంది ఉండటంతో వైరస్ ఒక్కసారిగా విజృంభించింది. దాంతో కుటుంబంలోని అందరికీ చాలా తొందరగా వైరస్ వచ్చేసింది. బాధాకరమైన విషయం ఏమిటంటే వైరస్ సోకిన వాళ్ళల్లో రెండేళ్ళ పిల్లాడు కూడా ఉండటం 
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన వారిని ప్రభుత్వం ఏ విధమైన పరీక్షలు చేయకుండా ఎలా వదిలేసింది ? దాదాపు అన్నీ విమానాశ్రయాల్లోను విదేశాల నుండి వచ్చే వాళ్ళకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు కదా ? మరి సౌదీ అరేబియా నుండి వచ్చిన వాళ్ళకు ఎందుకని టెస్టులు చేయలేదో అర్ధం కావటం లేదు. ప్రభుత్వం వీళ్ళ విషయంలో అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఉంటే కుటుంబంలోని మిగిలిన 21 మందికి వైరస్ సోకి ఉండేది కాదన్నది వాస్తవం.

ప్రభుత్వం అజాగ్రత్త వల్లే కుటుంబంలోని మిగిలిన వాళ్ళందరికీ సోకిందన్నది నిజం. సౌదీ నుండి తిరిగి వచ్చిన నలుగురు కేవలం తమ ఇంట్లోనే ఉండరు కదా ? ఎక్కడెక్కడ తిరిగారో ? ఎవరెవరిని కలిశారో తెలీదు. పైగా వీళ్ళలో ఏ ఇద్దరు కలిసినా ముందుగా హత్తుకుంటారు. దాంతో ఎన్ని వందల మందికి వైరస్ సోకిందో అర్ధంకాక ఇపుడు మహారాష్ట్ర ప్రభుత్వం టెన్షన్ పడిపోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి