iDreamPost

ఏ కొత్త కారు మీదనైనా రూ.2 లక్షలు డిస్కౌంట్! ఎలా పొందాలంటే?

2 Lakhs Discount On Any New Car: కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీ కోసమే ఈ అదిరిపోయే గుడ్ న్యూస్. ఏ కంపెనీ కారు అయినా సరే మీరు దాని మీద రూ. 2 లక్షల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. 2 లక్షల తగ్గింపు అంటే పాత కారు అనో.. ఎవరో కొని వాడిందనో అనుకోకండి. షోరూం కారే. 

2 Lakhs Discount On Any New Car: కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీ కోసమే ఈ అదిరిపోయే గుడ్ న్యూస్. ఏ కంపెనీ కారు అయినా సరే మీరు దాని మీద రూ. 2 లక్షల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. 2 లక్షల తగ్గింపు అంటే పాత కారు అనో.. ఎవరో కొని వాడిందనో అనుకోకండి. షోరూం కారే. 

ఏ కొత్త కారు మీదనైనా రూ.2 లక్షలు డిస్కౌంట్! ఎలా పొందాలంటే?

కొత్త కారు అంటే కనీసం ఓ 5 లక్షలు ఉంటుంది. కంపెనీ, మోడల్, వేరియంట్స్ ని బట్టి ధరలు మారుతుంటాయి. కొంచెం హెవీగా ఉండాలని అనుకుంటే 12 నుంచి 15 లక్షల రేంజ్ లో ఉంటాయి. రిచ్ కిడ్స్ అయితే 15 లక్షల రేంజ్ కార్లు కొంటారు. అదే మిడిల్ క్లాస్ వారు అయితే 5 లక్షల రేంజ్ లో కొంటారు. అయితే కారు మీద ఒక 30, 40 వేలు డిస్కౌంట్ వస్తే అబ్బా సాయిరాం అని అనుకుంటారు. అలాంటిది ఒక లక్ష నుంచి 2 లక్షల డిస్కౌంట్ వస్తే? ఈ డిస్కౌంట్ కావాలంటే మీరు కారు షోరూంకి వెళ్లి ఈ పని చేయాల్సి ఉంటుంది.  

ఏ షోరూంలో అయినా సరే తమ కంపెనీ ప్రొడక్ట్ ని డెమో వస్తువుగా డిస్ప్లేలో పెట్టి.. మిగతా ప్రొడక్ట్స్ ని అమ్ముతుంటారు. ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్స్, బైక్స్, కార్స్ ఇలా ఏవైనా సరే డెమో చూపిస్తుంటారు. ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్స్ వంటి వాటినైతే ఎలా పనిచేస్తుందో అని టెస్ట్ చేస్తారు. అదే కారు, బైక్స్ వంటివి అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తుంటారు. అయితే ఈ టెస్ట్ డ్రైవ్ కార్లను అంటే డెమో కార్లను కొనుగోలు చేస్తే మీకు లక్ష నుంచి 2 లక్షల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే కొనే ముందు ఈ విషయం తెలుసుకోకపోతే మీరు నష్టపోతారు. ఎందుకంటే కొంతమంది షోరూం వాళ్ళు ఈ డెమో కార్లను కొత్త కార్లు అని చెప్పి మీకు అంటగట్టే అవకాశం ఉంది. కొంతమంది తక్కువ డిస్కౌంట్ ఇచ్చి మోసం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అసలు ఈ డెమో కారు మీద ఎంత డిస్కౌంట్ వస్తుందనే విషయం తెలుసుకోండి. 

ముందుగా టెస్ట్ డ్రైవ్ కారుని కొనే ముందు ఆ కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చెక్ చేసుకోవాలి. ఫైనాన్స్ రూల్స్ ప్రకారం ఏదైనా టెస్ట్ డ్రైవ్ కారు వెయ్యి కిలోమీటర్లు తిరిగితే దాని విలువ అనేది 2 శాతం తగ్గుతుంది. 5 వేల కిలోమీటర్లు తిరిగితే 10 శాతం తగ్గుతుంది. అదే 10 వేల కిలోమీటర్లు తిరిగితే ఆ కారు ధరలో 20 శాతం తగ్గుతుంది. ఉదాహరణకు మీరు కొనాలనుకున్న కారు విలువ రూ. 6 లక్షలు అనుకోండి. ఆ కారు 5 వేల కిలోమీటర్లు తిరిగితే 10 శాతం తగ్గుతుంది. అంటే రూ. 60,000 తగ్గుతుంది. అదే 10 వేల కిలోమీటర్లు తిరిగిందనుకుంటే.. దాని మీద లక్షా 20 వేలు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే రూ. 4,80,000కే కొత్త కారు సొంతం చేసుకోవచ్చు. అదే మీరు 10 వేల కిలోమీటర్లు తిరిగిన రూ. 12 లక్షల విలువ గల డెమో కారు కొనాలని అనుకుంటే.. దాని మీద రూ. 2,40,000 తగ్గుతుంది. అంటే మీకు కొత్త కారు రూ. 9,60,000 కే వస్తున్నట్టు. 

డెమో కారు అనగానే సెకండ్ హ్యాండ్ కారు అని అనుకోకండి. ఈ కారుకి మొదటి ఓనర్ కొన్నవారే అవుతారు. టెస్ట్ డ్రైవ్ కార్లు కాబట్టి షోరూం వారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారు. దాన్ని కొత్తగా ఉంచుతారు. చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉన్నా అవి సరి చేసిన తర్వాతే అమ్ముతారు. పైగా వారంటీ కూడా ఉంటుంది. కాబట్టి డెమో కార్లు కూడా కొత్త కార్ల కిందే లెక్క. అయితే కొంతమంది షోరూం వాళ్ళు టెస్ట్ డ్రైవ్ కార్ల ఓడోమీటర్ లో తిరిగిన మైలేజ్ ని జీరోకి పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మోసపోకుండా ఉండాలంటే.. ఓడోమీటర్ వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. అందుకోసం కారు విక్రయించే వారిని వాహన హిస్టరీ రిపోర్ట్ ని అడగాలి.

ఒకవేళ కారు అమ్మేవారు హిస్టరీ రిపోర్ట్ లేదంటే కనుక.. కారుకి వీఐఎన్ (వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్) అని ఒకటి ఉంటుంది. గూగుల్ లో వీఐఎన్ అని సెర్చ్ చేస్తే డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేషన్ అనే ప్రభుత్వ వెబ్ సైట్ కనబడుతుంది. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి కారు వీఐఎన్ నంబర్ ఎంటర్ చేస్తే.. కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది.. మైలేజ్ హిస్టరీ తెలుసుకోవచ్చు. కొనాలనుకున్న కారు ఓడోమీటర్ లో మైలేజ్ హిస్టరీ.. వెబ్ సైట్ లో హిస్టరీ తేడాగా కనిపిస్తే రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి ఫిర్యాదు చేయవచ్చు. అందరూ మోసం చేయకపోవచ్చు. కానీ కొందరు చేసే అవకాశం ఉంది. కాబట్టి తెలుసుకోవడం మంచిది. మరి షోరూంలలో ఈ డెమో కార్లని కొనుగోలు చేసి లక్ష నుంచి 2 లక్షల డిస్కౌంట్ పొందండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి