iDreamPost

20 రోజుల్లో ఇద్దరమ్మాయిలతో దొరికిపోయాడు! అయినా.. లక్కీ ఫెలోనే!

ఈ రోజుల్లో ఒక్కసారే పెళ్లి కావడం లేదు. ఇదిగో ఈ ఫోటోలోని యువకుడు కనిపిస్తున్నాడు కదా.. ఏకంగా 20 రోజుల్లో ఇద్దర్నిపెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇంతకు ఆ లక్కీయెస్ట్ ఫెలోది ఎక్కడంటే..?

ఈ రోజుల్లో ఒక్కసారే పెళ్లి కావడం లేదు. ఇదిగో ఈ ఫోటోలోని యువకుడు కనిపిస్తున్నాడు కదా.. ఏకంగా 20 రోజుల్లో ఇద్దర్నిపెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇంతకు ఆ లక్కీయెస్ట్ ఫెలోది ఎక్కడంటే..?

20 రోజుల్లో ఇద్దరమ్మాయిలతో దొరికిపోయాడు! అయినా.. లక్కీ ఫెలోనే!

ఈ రోజుల్లో అబ్బాయిలకు ఒక్కసారి పెళ్లి కావడం చాలా కష్టంగా మారింది. అమ్మాయి, ఆమె తరుపు బంధువులు పెట్టే ఆంక్షలు, వారి కోరే కోరికలతో పెళ్లి కాక బ్రహ్మాచారుల్లా మిగిలిపోతున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయ్, సాఫ్ట్ వేర్ లేదంటే.. కోటీశ్వరుడు అయిన వాడినే భర్తగా కోరుకుంటున్నారు అమ్మాయిలు. దీంతో సామాన్యుడికి వివాహం కావడం కష్టమైంది. ఒక్కసారి పెళ్లి కావడమే వింత అనుకుంటున్న ఈ రోజుల్లో ఈ ఫోటోలోని వ్యక్తికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. అదీ కూడా 20 రోజుల తేడాతో.. ప్రేమించిన అమ్మాయిల్ని మనువాడటం ఇందులో విశేషం. పోనీ అతడేమన్న కోటీశ్వరుడా అనుకుంటా కాదు.. కేవలం అతడికి 19 సంవత్సరాలు. ఈ వయస్సులో ఇద్దరు మహిళల్ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు.

బీహార్‌లోని జముయ్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువకుడు.. 20 నెలల వ్యవధిలో ఇదర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరు మెడలో మూడు ముళ్లు వేయడం ఇక్కడ గమనార్హం. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. వీరిద్దరినీ రహస్యంగా కలిసేందుకు వెళ్లి పట్టుబడ్డాడు. పట్టుబడిన ప్రతిసారి అతడికి పెళ్లి జరిపించేశారు స్థానికులు. వివరాల్లోకి వెళితే.. జముయిలోని మలయ్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అక్షర గ్రామంలో నివసిస్తూ, డీజేగా పనిచేస్తున్నాడు వినోద్ కుమార్ అనే 19 ఏళ్ల యువకుడు. లక్ష్మీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్‌కాడిహ్ గ్రామానికి చెందిన ప్రీతి కుమారిని ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది. అది ప్రేమగా మారింది. ఆమెను కలిసేందుకు ఏప్రిల్ 22న ఆమె ఇంటికి వెళ్లాడు. గ్రామస్థులు అతడిని పట్టుకుని గుడికి తీసుకెళ్లి.. ప్రీతితో బలవంతంగా పెళ్లి చేశారు. ఇంతలో అతడి జీవితంలో మరో సంఘటన చోటుచేసుకుంది.

ప్రీతితో వివాహం కాకముందు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వినోద్. ఈ కొత్త పెళ్లి కొడుకు ఆ మహిళను కలిసేందుకు వెళ్లి ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. తనతో పాటు డీజేలో పనిచేసే సింగర్ గిరిజతో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది కొనసాగుతుండగానే.. ప్రీతిని ముగ్గులోకి దింపాడు. ఇద్దరికీ తెలియకుండా మెయిన్ టైన్ చేశాడు. ఇప్పుడు కూడా ప్రీతితో పెళ్లి అయిన విషయాన్ని దాచి పెట్టి.. మరో మహిళ దగ్గరకు వచ్చాడు. మరోసారి, అతను అక్కడి గ్రామస్తులకు దొరికిపోయాడు. ఈ ఇద్దర్ని గుడికి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేశారు. 20 రోజుల్లోనే ఇద్దరు మహిళలను వివాహాలు చేసుకున్నాడు ఈ లక్కీ ఫెలో వినోద్. తన భర్త రెండో పెళ్లి చేసుకోవడంపై అతని మొదటి భార్య ప్రీతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, రెండో భార్య గిరిజ అతనితో కలిసి ఉండేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొనడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి