iDreamPost

కేవలం రూ. 15 వేల పెట్టుబడితో.. రూ. కోటి ఆదాయం!.. ఎలా అంటే?

కొన్ని సార్లు ఆలోచనలే పెట్టుబడిగా మారుతాయి. అలాంటి సమయాల్లో ఏదైనా పనిని ప్రారంభించడానికి దానికి కావాల్సిన ఇన్వెస్ట్ మెంట్ తక్కువ మొత్తంతోనే పూర్తవుతుంది. అంతే కాకుండా వినూత్న ఆలోచనలతో చేసే పనులు ఊహించని విజయాలను అందిస్తాయి.

కొన్ని సార్లు ఆలోచనలే పెట్టుబడిగా మారుతాయి. అలాంటి సమయాల్లో ఏదైనా పనిని ప్రారంభించడానికి దానికి కావాల్సిన ఇన్వెస్ట్ మెంట్ తక్కువ మొత్తంతోనే పూర్తవుతుంది. అంతే కాకుండా వినూత్న ఆలోచనలతో చేసే పనులు ఊహించని విజయాలను అందిస్తాయి.

కేవలం రూ. 15 వేల పెట్టుబడితో..  రూ. కోటి ఆదాయం!.. ఎలా అంటే?

కొన్ని సార్లు ఆలోచనలే పెట్టుబడిగా మారుతాయి. అలాంటి సమయాల్లో ఏదైనా పనిని ప్రారంభించడానికి దానికి కావాల్సిన ఇన్వెస్ట్ మెంట్ తక్కువ మొత్తంతోనే పూర్తవుతుంది. అంతే కాకుండా వినూత్న ఆలోచనలతో చేసే పనులు ఊహించని విజయాలను అందిస్తాయి. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టెక్నాలజీ ఎవడి సొత్తు కాదన్నట్టు అందుబాటులో ఉన్న సాంకేతికతను అందిపుచ్చుకుని వివిధ రకాల టూల్స్ ను రూపొందిస్తున్నారు. ఈ టూల్స్ ద్వారా కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. తాజాగా కృత్రిమ మేధ ఆధారిత చాట్‌జీపీటీని ఉపయోగించుకొని ఇద్దరు స్నేహితులు సాల్ ఐయెల్లో, మోనికా పవర్స్ ఓ ఏఐ టూల్‌ ను సృష్టించారు. కేవలం రూ.15,000 పెట్టుబడితో తయారు చేసిన డైమ్‌ఏడజన్‌ అనే ఏఐ టూల్‌ వారికి రూ.1.2 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.

ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో పెను మార్పులకు నాంది పలుకుతోంది. ఇటీవల మీడియా ఛానల్స్ ఏఐ యాంకర్ తో వార్తలు చదివించడం మనం చూశాం. ఈ క్రమంలో ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది.. అనే డైలాగ్ ను సాల్ ఐయెల్లో, మోనికా పవర్స్ నిజం చేసి చూపించారు. సాంకేతిక రంగంలో ఉన్న అనుభవంతో ఇద్దరు ఫ్రెండ్స్ సృష్టించిన డైమ్‌ఏడజన్‌ ఏఐ టూల్‌ వారికి తక్కువ పెట్టుబడితో భారీ ఆదాయాన్ని అందించింది. దీంతో ఒక్కసారిగ వారు ప్రపంచానికి పరిచయమయ్యారు. అయితే ఈ టూల్ ఓ ఆలోచనను అమలు చేసే ఆచరణాత్మక ప్రణాళికను అందిస్తుంది ఈ టూల్.

డైమ్‌ఏడజన్‌ ఉపయోగం ఏంటంటే?

డైమ్‌ఏడజన్‌ రూపుదిద్దుకోవడానికి గల కారణం ఏంటంటే.. చాట్‌జీపీటీ నుంచి విలువైన, ఆచరణాత్మకమైన సమాధానాలు రాబట్టడానికి కచ్చితమైన ప్రశ్నలు అవసరం అవుతాయి. ఆ ప్రశ్నలను సంధించడంలో సాల్ ఐయెల్లో, మోనికా పవర్స్ కు మంచి అనుభవం ఉంది.ఈఅనుభవమే ఈ ఏఐ టూల్‌కు ప్రధాన పెట్టుబడిగా మారింది. దీన్నే ఓ టూల్‌గా మారిస్తే రీసెర్చ్‌కి బాగా ఉపయోగపడుతుందని భావించిన వారు ఆలోచనలను ఆచరణలో పెట్టారు. ఈ క్రమంలోనే డైమ్‌ఏడజన్‌ ఆవిర్భవించింది. యూజర్లు తమ వద్ద ఉన్న వ్యాపార ఆలోచనలను ఒక ఫారం రూపంలో సమర్పిస్తే చాలు. డైమ్‌ఏడజన్‌ దాన్ని పూర్తి నివేదిక రూపంలో మనకు అందిస్తుంది. వ్యాపారాన్ని ఎక్కడ, ఎలా ప్రారంభించాలి? ఆసక్తిగల ఇన్వెస్టర్లు ఎవరు? ఏ సంస్థల నుంచి పోటీ ఎదురవుతుంది? కస్టమర్లు ఎవరు? వంటి వివరాలన్నీ చాలా వేగంగా అందిస్తుంది. కేవలం రూ.15,000 పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ టూల్‌ వారికి ఏడు నెలల్లో రూ.1.2 కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి