iDreamPost

అదిరిపోయే ఫీచర్స్ తో Chat GPT న్యూ వర్షన్.. ఈసారి అందరికీ ఉచితంగానే.. !

Open AI Chat GPT 4 Omni: ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిన ఆర్టీఫీషియల్ ఇంటిలెజెన్స్ చాట్ జీపీటీ నుంచి మరో కొత్త వర్షన్ రాబోతోంది. పైగా ఈ వర్షన్ అందరికీ ఫ్రీగానే అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు.

Open AI Chat GPT 4 Omni: ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిన ఆర్టీఫీషియల్ ఇంటిలెజెన్స్ చాట్ జీపీటీ నుంచి మరో కొత్త వర్షన్ రాబోతోంది. పైగా ఈ వర్షన్ అందరికీ ఫ్రీగానే అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు.

అదిరిపోయే ఫీచర్స్ తో Chat GPT న్యూ వర్షన్.. ఈసారి అందరికీ ఉచితంగానే.. !

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్… ఈ పేరు ఇప్పుడు తెలియని వాళ్లు లేరేమో? టెక్నాలజీ యుగంలో ఓపెన్ ఏఐ సంస్థ ఒక విప్లవాన్ని మొదలు పెట్టింది. చాట్ జీపీటీ పేరుతో ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటికే ఎంతో మంది ఈ చాట్ జీపీటీని వాడుతున్నారు. అందులో ఇప్పటివరకు చాలానే వర్షన్స్ వచ్చాయి. తాజాగా ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీలో మరో కొత్త వర్షన్ ని తీసుకురాబోతోంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు. అంతేకాకుండా.. ఆ వర్షన్ అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉంటుందని చెప్పడం విశేషం.

ఇప్పటికే ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన చాట్ జీపీటీ-4 టర్బో మార్కెట్ లో గేమ్ ఛేంజర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఓపెన్ ఏఐ సంస్థ మరో సరికొత్త చాట్ జీపీటీ వర్షన్ ను తీసుకురాబోతోంది. దాని పేరు జీపీటీ-4 ఓమ్నీ.. షార్ట్ గా జీపీటీ-4ఓ అని పిలుస్తున్నారు. ఈ కొత్త వర్షన్ జీపీటీ-4 టర్బోతో పోలిస్తే.. రెండింతలు ఫాస్ట్ గా పని చేస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ వర్షన్ ని ఫ్రీగా కూడా అందరికీ అందించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అయితే ఫ్రీ వర్షన్ లో మాత్రం కాస్త లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే ఉంటాయని వెల్లడించారు. అయితే పెయిడ్ వర్షన్ ని తీసుకున్నా కూడా చాలా తక్కువ సబ్ స్క్రిప్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. అంటే మీరు జీపీటీ-4 టర్బో తీసుకున్న దానికంటే చాలా తక్కువ ప్రీమియం ఉంటుందని సంస్థ చెప్తోంది.

ChatGPT

పెయిడ్ వర్షన్ కి మాత్రం అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. ఈ జీపీటీ-4 ఓమ్మీ ఏకంగా 50 భాషలను సపోర్ట్ చేయగలదు. ఇండియన్ యూజర్స్ కోసం తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ వంటి భాషలను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీకు వాయిస్ కమాండ్స్, విజువల్స్ వంటి రకారకాల కమాండ్స్ ఉంటాయి. మీకు వాయిస్ కమాండ్ లకు ఈ జీపీటీ 4 ఓమ్మీ కేవలం 232 మిల్లీ సెకన్లలోనే సమాధానం ఇస్తుంది. మీరు కోడింగ్, టెక్ట్స్, రీజనింగ్ లో ఈ జీపీటీ-4 ఓమ్మీ.. జీపీటీ-4 కంటే కూడా మెరుగ్గా సమాధానాలు ఇస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ జీపీటీ-4 ఓమ్మీకి సంబంధించి టెక్ నిపుణుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అందరూ కూడా ఈ జీపీటీ-4 ఓమ్మీ కూడా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్తున్నారు.

ఓపెన్ ఏఐ సంస్థ మరో కీలక ప్రకటన కూడా చేసింది. అందేంటంటే.. యాపిల్ మ్యాక్స్ ఓఎస్ యూజర్లకు త్వరలోనే డెస్క్ టాప్ యాప్ ని విడుదల చేయబోతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అలాగే అతి త్వరలోనే విండోస్ యూజర్స్ కోసం యాప్ ని తీసుకొస్తున్నాం అంటూ ప్రకటించారు. ఈ ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ప్రాచుర్యం సంపాదించుకుంది. ఇప్పటికే ఈ ఐపెన్ ఏఐ సంస్థలో మైక్రోసాఫ్ట్ 2019లోనే 8,345 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. ఆర్టీఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 2015లో ఈ ఓపెన్ ఏఐ సంస్థను స్థాపించారు. బ్రెట్ టెయిలర్, సామ్ ఆల్ట్ మన్, గ్రెగ్ బ్రాక్ మ్యాన్, జాకుబ్ పచోకీ, మిరా మారుతీ ఈ ఓపెన్ ఏఐని స్థాపించడమే కాకుండా.. కీలకంగా వ్యవహరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి