iDreamPost

ఏప్రిల్ నెలలో బ్యాంక్ లకు ఇన్ని సెలవులా..? వాటి లిస్ట్ ఇదే

  • Published Mar 29, 2024 | 5:30 PMUpdated Mar 29, 2024 | 5:30 PM

రానున్న ఏప్రిల్ నెలలో వరుసగా బ్యాంకులకు 14 రోజులు హాలిడేస్ ఉండనున్నాయి. అయితే అవి ఏఏ తేదీలో ఏ ప్రాంతాల్లో అనే జాబితాను తెలుకోకపోతే చాలా నష్టపోతారు.

రానున్న ఏప్రిల్ నెలలో వరుసగా బ్యాంకులకు 14 రోజులు హాలిడేస్ ఉండనున్నాయి. అయితే అవి ఏఏ తేదీలో ఏ ప్రాంతాల్లో అనే జాబితాను తెలుకోకపోతే చాలా నష్టపోతారు.

  • Published Mar 29, 2024 | 5:30 PMUpdated Mar 29, 2024 | 5:30 PM
ఏప్రిల్ నెలలో బ్యాంక్ లకు ఇన్ని సెలవులా..? వాటి లిస్ట్ ఇదే

సాధారణంగా బ్యాంకుల్లో ప్రతిఒక్కరికి ఎప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తరుచు ఎంతోమంది అకౌంట్లో డబ్బులు డిపాజిటట్ చేయడం, విత్‌డ్రా చేయడం.. లోన్ల కోసమని, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేందుకు.. ఇలా రకరకాల కారణాలతో బ్యాంకులకు వెళ్తుంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ప్రభుత్వ పథకాల్లో కూడా నగదును ఇన్వెస్ట్ చేసేందుకు బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. మరి, ఇలాంటి అత్యవసర పనులు ఉన్నప్పుడు బ్యాంకులు సెలవులు అయితే..మనం పూర్తి చేయాల్సిన పనులు ఆలస్యం అవుతాయి. కనుక ఎవరికైనా బ్యాంకుల్లో ఏదైనా పని ఉంటే.. ముందుగానే సెలవుల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇది అందరికి సాధ్యపడదు. అందుచేతనే.. అలాంటి వారి కోసం ఈ సంవత్సరం 2024 ఏప్రిల్ నెలలో బ్యాంకులకు ఏకంగా 14 రోజుల సెలవులు రానున్నాయి. అయితే ఇది రాష్ట్రల బట్టి మారుతుంటాయి. మరి, ఏ సందర్భాల్లో బ్యాంకులకు హాలిడేస్ ఇవ్వనున్నారో ఆ సమాచారం ఇప్పుడు తెలసుకుందాం.

దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. అయితే ఈ హాలిడేస్ అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయిస్తుంటుంది. కాగా, ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా.. ప్రాంతీయ సెలవులు కూడా ఉంటాయి. అందుకే కస్టమర్లు సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని.. వారి అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను షెడ్యూల్ ‌గా ప్లానింగ్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఆ తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా రానున్న ఏప్రిల్ నెలలో రంజాన్, శ్రీరామనవమి, అంబేడ్కర్ జయంతి వంటి పండగలతో పాటు నాలుగు ఆదివారాలు, రెండో శ‌నివారం, నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి. మరి, ఏఏ తేదీలో బ్యాంకులకు హాలిడేస్ ఉన్నాయో ఆ జాబితాను ఇప్పుడు చూద్దాం.

ఇక ఏప్రిల్ నెలలో బ్యాంక్ హాలిడేస్ జాబితా ఇదే..

ఏప్రిల్ 1, 2024: సోమవారం ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ కాబట్టి బ్యాంకులు మూసివేసి ఉంటాయి. కానీ, మిజోరాం, చండీగఢ్, సిక్కిం, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ వంటి ప్రాంతాల్లో మాత్రం ఏప్రిల్ 1న బ్యాంకులు తెరిచి ఉంటాయి.

ఏప్రిల్ 5, 2024: శుక్రవారం- బాబు జగ్జీవన్ రామ్ జయంతి, జుమత్-ఉల్-విదా అందుకోసం తెలంగాణ, జమ్మూ, శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ 7- ఆదివారం- దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే ఉంటుంది.

ఏప్రిల్ 9, 2024:మంగళవారం- ఉగాది పండుగ, గుడి పడ్వా, తెలుగు నూతన సంవత్సరం. అందువల్ల మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్మూ, శ్రీనగర్లలో బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ 10, 2024:బుధవారం- రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) బ్యాంకులకు సెలవు .

ఏప్రిల్ 13, 2024: రెండవ శనివారం- బిజూ పండుగ కనుక త్రిపుర, అస్సాం, మణిపూర్, జమ్మూ, శ్రీనగర్లో బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ 14- ఆదివారం- దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే ఉంటుంది.

ఏప్రిల్ 15, 2024: సోమవారం- అస్సాం, హిమాచల్ ప్రదేశ్లో బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ 17, 2024:బుధవారం- శ్రీరామనవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఏప్రిల్ 20, 2024: శనివారం- గరియా పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్21- 2024: ఆదివారం
ఏప్రిల్ 27-2024:  నాలుగో శనివారం
ఏప్రిల్ 28-2024: ఆదివారం

ఇన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. కనుక ఈ హాలిడేస్ ను దృష్టిలో పెట్టుకొని కస్టమర్లు ముందుగానే వారి లావాదేవీలను పూర్తి చేసుకుంటే ఎంతో మంచింది. మరి, ఏప్రిల్ నెలలో 14 రోజులు బ్యాంకులు సెలవుల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి