iDreamPost

పదోతరగతి ఫలితాల్లో 513 మార్కులు.. కానీ ఏం లాభం..?

పదోతరగతి విద్యార్థులు ఎంతగానో ఎదురు చూసిన ఫలితాలు వచ్చేశాయి. ఈ సారి కూడా ఏపీలో బాలికలే పై చేయి సాధించారు. మనస్వీని 599 మార్కులు సాధించింది. ఓ అబ్బాయి కూడా ప్రతిభ కనబర్చాడు. కానీ

పదోతరగతి విద్యార్థులు ఎంతగానో ఎదురు చూసిన ఫలితాలు వచ్చేశాయి. ఈ సారి కూడా ఏపీలో బాలికలే పై చేయి సాధించారు. మనస్వీని 599 మార్కులు సాధించింది. ఓ అబ్బాయి కూడా ప్రతిభ కనబర్చాడు. కానీ

పదోతరగతి ఫలితాల్లో  513 మార్కులు.. కానీ ఏం లాభం..?

ఆంధ్రప్రదేశ్ పదోతరగతి ఫలితాలు వచ్చాయి. పదోతరగతి విద్యార్థులు తమ ప్రతిభ కనబర్చారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలానికి చెందిన వెంకట నాగసాయి మనస్వీకి 600గాను 599 మార్కులు వచ్చిన సంగతి విదితమే. ఈ సారి కూడా ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. మొత్తం 86.69 శాతం మంది విద్యార్థలు ఉత్తీర్ణులవ్వగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 89.17 కావడం విశేషం. అలాగే బాలుర ఉత్తీర్ణత శాతం 84.32గా నమోదైంది. ఉత్తరాంద్ర జిల్లాల్లో ఒకటైన పార్వతీపురం మన్యం జిల్లా.. అత్యధిక శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ 96.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే కర్నూలు జిల్లాలో 62.47 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలించింది.

పదోతరగతి ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు విద్యార్థులు. అనుకున్నట్లే ఫలితాలు వచ్చాయి. మంచి మార్కులతో విద్యార్థులు సత్తా చాటారు. కానీ ఓ విద్యార్థి మాత్రం ఫలితాలు చూసుకోక ముందు తనువు చాలించాడు. పరీక్షల్లో గెలిచి.. విధి రాత ముందు ఓడిపోయాడు. ఇంతకు ఏం జరిగిందింటే.. తూర్పుగోదావరి జిల్లా తిరుగుడు మెట్టకు చెందిన చంద్రశేఖర్.. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలు రాశాడు. తొలి నుండి బాగా చదివే విద్యార్థి కావడంతో టీచర్లు కూడా అభిమానించేవారు. పరీక్షలు రాసిన అనంతరం బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రితో పాటు చంద్ర శేఖర్ మరణించాడు.

తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మంచి స్కోర్ సాధించాడు. అతడికి 513 మార్కులు వచ్చాయి. అతడి మార్కులు చూసి స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఉపాధ్యాయులు సైతం మంచి స్టూడెంట్‌ను కోల్పోయామని, అతడు బాగా చదువుతాడని,  ఆట పాటల్లో చురుగ్గా ఉంటాడని, తోటి విద్యార్థులతో సన్నిహితంగా మెలుగుతాడంటూ, ఉపాధ్యాయుల పట్ల వినయంగా ఉంటాడని అతడితో ఉన్న మెమెరీస్ గుర్తు చేసుకుంటున్నారు టీచర్స్. ఎంతో భవితవ్యం ఉన్న చంద్ర శేఖర్‌ను రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది విధి. భర్తతో పాటు కొడుకును పొగొట్టుకుంది ఆ ఇంటి ఇల్లాలు. ఈ మార్కులు గురించి తెలిసి బంధువులు సైతం కంటతడి పెడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి