iDreamPost

10వ తరగతి ప్రేమ.. ఇంట్లో పెరేంట్స్‌కు చెప్పకుండా బస్సు ఎక్కి..

వారిది లేత ప్రేమ. పది పూర్తవ్వగానే.. విడిపోవాల్సి వస్తుందని భావించారు . అదే సమయంలో తమ ప్రేమను పెద్దలు అంగీకరిస్తారా లేదా అనే డౌట్ వచ్చింది. దీంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కానీ

వారిది లేత ప్రేమ. పది పూర్తవ్వగానే.. విడిపోవాల్సి వస్తుందని భావించారు . అదే సమయంలో తమ ప్రేమను పెద్దలు అంగీకరిస్తారా లేదా అనే డౌట్ వచ్చింది. దీంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కానీ

10వ తరగతి ప్రేమ.. ఇంట్లో పెరేంట్స్‌కు చెప్పకుండా బస్సు ఎక్కి..

‘మొదటిసారిగా నిన్ను చూడగా.. గుండెల్లో ఏదోదో జరిగింది’ అంటూ పాడుకున్నారు ఆ లేత జంట. వీరిది స్కూల్ ప్రేమ. సినిమా కొంత, సమాజ పోకడ కొంత వీరిపై ప్రభావితం చూపుతుంది. క్రష్, లవ్ కూడా తేడా తెలియని వయస్సులో ఈ పిల్లల్లో ప్రేమ కలిగింది. నిండా 15 ఏళ్లు కూడా నిండని అమ్మాయి.. అబ్బాయి ప్రేమించుకున్నారు. పదో తరగతి చదువుతున్న ఈ మైనర్లు.. పెద్దలకు పెద్ద ట్విస్ట్ ఇద్దామనుకున్నారు. భవిష్యత్తులో వీరి ప్రేమ ఎటు వెళుతుందో అని పిచ్చి ఆలోచన చేసి..ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. కానీ ఆ ట్విస్ట్ అప్లై చేసేసరికి వీరి ప్లాన్ బెడిసికొట్టింది. ఇంతకు ఆ కుర్ర ప్రేమికులు ఏం చేశారంటే..?

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి.. అబ్బాయి.. పదో తరగతి చదువుతున్నారు. వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే వీరికి భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. తమ ప్రేమ ఇంట్లో తెలిస్తే.. తల్లిదండ్రులు ఒప్పుకోరని, నిర్భంధిస్తారని, తనకు మరొకరితో వివాహం చేసేస్తారని ఆలోచన చేశారు ఈ మైనర్లు. దీంతో ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకొని, కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెప్పా పెట్టకుండా రాజమండ్రి నుండి ఒంగోలు దాకా బస్సులో వచ్చారు. వారి దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి. ఏం చేయాలో తోచక. ఒంగోలు రైల్వే స్టేషన్ కు చేరుకుని తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకుందాం లేకుంటే చనిపోదాం అని నిర్ణయించుకుని అక్కడే తచ్చాడుతున్నారు.

అంతలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు చేపడుతున్న ఒంగోలు రైల్వే సీఐ శ్రీకాంత్ బాబు కంటపడ్డారీ జంట. వారిని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లుగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే.. అది చెల్లదని, ఇంటికి వెళ్లిపోతే తల్లిదండ్రులు క్షమిస్తారని, వారు ఏమి అనకుండా తాను అండగా నిలుస్తానని ధైర్యం నూరిపోయడంతో వెంటనే పేరెంట్స్ వివరాలు వెల్లడించారు. వివరాలు తెలుసుకుని.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే.. అమ్మాయి మిస్సింగ్ అంటూ ఆమె పేరెంట్స్ మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చినట్లు తెలిసింది. పిల్లల సమాచారం అందగానే.. ఒంగోలుకు చేరుకున్నారు. తెలిసీ, తెలియక పిల్లలు చేసిన ఈ తప్పులకు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఏమీ అనొద్దని పోలీసులు హితవు కోరారు. సకాలంలో వీరిని గుర్తించి తమకు సురక్షితంగా అప్పగించిన రైల్వే సీఐ, ఇతర రైల్వే పోలీసుకు కృతజ్ఞతలు తెలిపారు మైనర్ల తల్లిదండ్రులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి