iDreamPost

రామ్ సేతు రిపోర్ట్

రామ్ సేతు రిపోర్ట్

ఈ మధ్యకాలంలో స్పిరిచువల్ టచ్ ఉన్న సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ దక్కుతోంది. కన్విన్స్ చేయగలిగే కంటెంట్ ఉంటే చాలు హీరో ఎవరనేది పట్టించుకోకుండా కోట్ల రూపాయల వసూళ్లు వర్షంలా కురుస్తున్నాయి. దానికి మంచి ఉదాహరణగా కార్తికేయ 2, కాంతార లాంటి వాటిని చెప్పుకోవచ్చు.  స్టార్లు లేకపోయినా తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకున్నాయి. అలాంటిది అక్షయ్ కుమార్ లాంటి స్టార్ చేస్తే ఏ రేంజ్ లో ఉండాలి. అలాంటి అంచనాలు రేపిన మూవీనే రామ్ సేతు. ప్రైమ్ మొదటిసారి థియేట్రికల్ ప్రొడక్షన్ లో దిగిన మొదటి వెంచర్ ఇది. నిన్న విడుదలైన ఈ చిత్రం రిపోర్ట్ చూద్దాం.

భారతదేశం శ్రీలంకల మధ్య వారథిగా ఉన్న రామసేతు వంతెనను తన స్వార్థ వ్యాపార ప్రయోజనాల కోసం నాశనం చేయాలనే పధకంతో ఉంటాడు ఇంద్రకాంత్(నాజర్). అయితే దాన్ని కూలగొట్టాలంటే అది సహజంగా నిర్మితమయ్యిందా కాదా అని తెలుసుకునే బాధ్యత ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఆర్యన్(అక్షయ్ కుమార్)భుజాల మీద పడుతుంది.అంజనీపుత్ర(సత్యదేవ్), సాండ్రా(జాక్వలిన్ ఫెర్నాండేజ్)లతో కలిసి ఆ పనిని మొదలుపెడతాడు. ఈ ప్రయాణంలో ఊహించని సంఘటనలు, విస్తుపోయే నిజాలు బయటపడతాయి. రాముడి అస్థిత్వాన్ని ప్రపంచానికి చాటే కార్యం ఆర్యన్ తలకెత్తుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి

మంచి పాయింట్ ని తీసుకున్న దర్శకుడు అభిషేక్ శర్మ ప్రేక్షకులను కట్టిపడేసే స్క్రీన్ ప్లేని సెట్ చేసుకోవడంలో తడబాటు ప్రదర్శించడంతో మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ గా మిగలాల్సిన రామ్ సేతు చివరిగా అబ్బే అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా బడ్జెట్ లో రాజీ పడిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో సహజంగానే గ్రాండియర్ ఫీల్ తగ్గిపోయి బోరింగ్ డ్రామా ఇంకా బోర్ కొట్టేలా సాగుతుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ పర్లేదనిపించినప్పటికీ ఓవరాల్ గా చూస్తే కార్తికేయ 2 లాంటి హై మూమెంట్స్ ఉన్న సినిమాలు చూసిన కళ్ళకు ఈ రామ్ సేతు డల్ ఎఫైర్ గా నిలిచింది. అక్షయ్ నటన రొటీనే. ఉన్నంతలో సత్య దేవే ఫ్రెష్ గా అనిపించాడు. ఎలాగూ ప్రైమ్ వాళ్లదే కాబట్టి థియేటర్ డిమాండ్ చేసేంత మ్యాటర్ లేని ఈ బొమ్మ ఓటిటికే కరెక్ట్ ఫిట్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి