iDreamPost

కొత్త సర్వీసుకు జొమాటో శ్రీకారం.. వారి కోసం ఆ సేవల్లోకి!

కొత్త సర్వీసుకు జొమాటో శ్రీకారం.. వారి కోసం ఆ సేవల్లోకి!

ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవనవిధానంలో ఎక్కువ మంది ఫుడ్ ను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఫుడ్ డెలివరీలు చేస్తూ లక్షలాది మంది కస్టమర్లను కలిగి ఉన్నది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలో దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే జొమాటో మరో సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. వ్యాపారుల కోసం లాజిస్టిక్ సేవలను ప్రారంభించింది. ఇందుకు డెలివరీ పార్ట్‌నర్లను వినియోగించుకోనుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జొమాటో ఎక్స్ ట్రీమ్ పేరిట పార్శిల్‌ సర్వీసుల్లోకి ఎంట్రీ ఇస్తోంది. వ్యాపారుల కోసం ఈ సర్వీసును తీసుకొచ్చినట్లు తెలిపింది. చిన్న చిన్న పార్శిళ్లను కస్టమర్లకు పంపించడం లేదా స్వీకరించడం కోసం డెలివరీ పార్ట్‌నర్ల సేవలను జొమాటో వినియోగించుకోనుంది. చిన్న వ్యాపారులు మొదలు, పెద్ద రిటైలర్ల వరకు ఎవరైనా ఈ పార్శిల్‌ డెలివరీ సేవలను వినియోగించుకోవచ్చని జొమాటో ఎక్స్‌ట్రీమ్‌ పేర్కొంది. వ్యాపారులు తమ విలువైన కస్టమర్లకు పార్శిల్లను పంపేందుకు ఈ ఎక్స్ ట్రీమ్ సర్వీస్ ఎంతగానో ఉపయోగ పడుతుందని జొమాటో తెలిపింది.

ఇప్పటికే 3 లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్లు ఎక్స్‌ట్రీమ్‌ యాప్ లో నమోదు చేసుకున్నట్లు తెలిపింది. కాగా నగరాల పరిధిలో 10 కిలోమీటర్ల వరకు ప్యాకేజీలను పంపించుకోవచ్చని తెలిపింది. ప్యాకేజీ ధర రూ.35 నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయని జొమాటో ప్రకటించింది. అయితే ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రస్తుతం జొమాటో ఎక్స్ ట్రీమ్ యాప్‌ అందుబాటులో ఉంది. యాపిల్‌ యూజర్లకు మాత్రం యాప్‌ అందుబాటులో లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి