iDreamPost

Hero Xtreme 125R: లీటర్​కు 66 కి.మీ.ల మైలేజ్.. ఈ సూపర్ బైక్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • Published Feb 04, 2024 | 6:31 PMUpdated Feb 05, 2024 | 5:55 PM

యూత్ ఎక్కువగా స్టైలిష్ టూవీలర్స్​ను కోరుకుంటారు. అయితే ఇవి లుక్స్​, స్పీడ్ పరంగా బాగానే ఉన్నా మైలేజ్ మాత్రం సరిగ్గా ఇవ్వవు. అందుకే ఈ లోటును భర్తీ చేసేందుకు ఓ స్టైలిష్ సూపర్ బైక్ మార్కెట్​లోకి వచ్చేసింది.

యూత్ ఎక్కువగా స్టైలిష్ టూవీలర్స్​ను కోరుకుంటారు. అయితే ఇవి లుక్స్​, స్పీడ్ పరంగా బాగానే ఉన్నా మైలేజ్ మాత్రం సరిగ్గా ఇవ్వవు. అందుకే ఈ లోటును భర్తీ చేసేందుకు ఓ స్టైలిష్ సూపర్ బైక్ మార్కెట్​లోకి వచ్చేసింది.

  • Published Feb 04, 2024 | 6:31 PMUpdated Feb 05, 2024 | 5:55 PM
Hero Xtreme 125R: లీటర్​కు 66 కి.మీ.ల మైలేజ్.. ఈ సూపర్ బైక్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

యూత్ ఎక్కువగా స్టైలిష్ టూవీలర్స్​ను కోరుకుంటారు. రయ్యున దూసుకుపోయే మంచి లుక్స్ ఉండే వాహనాలను వాళ్లు ఇష్టపడతారు. అందుకే కాలేజ్​కు వెళ్లే స్టూడెంట్స్​ను టార్గెట్ చేసుకొని 125 సీసీ, 150 సీసీ సెగ్మెంట్​లో ప్రీమియం బైక్స్​ను ఆటోమొబైల్ సంస్థలు తయారు చేస్తుంటాయి. అయితే ధరలో తగ్గేదేలే అనే రేంజ్​లో ఉండే ఈ వెహికల్స్ లుక్స్, స్పీడ్ పరంగా తోపు అనేలా ఉంటాయి. కానీ మైలేజ్​లో మాత్రం తుస్సుమంటాయి. అందుకే వీళ్లను ఆకర్షించేలా బజాజ్ కంపెనీ పల్సర్ మోడల్​ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. స్టైల్​కు స్టైల్, మంచి మైలేజ్, లో మెయింటెనెన్స్​ పల్సర్ బైక్ స్పెషాలిటీ. భారత టువీలర్ మార్కెట్​లో వీటిదే హవా. అయితే పల్సర్ బైక్స్​కు పోటీగా హీరో కంపెనీ ఓ స్టైలిష్ 125 సీసీ బైక్​ను తీసుకొచ్చింది. లుక్స్ పరంగా సూపర్బ్​గా ఉన్న ఈ టూవీలర్​.. లీటర్​కు ఏకంగా 66 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

హీరో కొత్తగా రిలీజ్ చేసిన ఆ బైక్ మోడలే ఎక్స్​ట్రీమ్ 125ఆర్. చాన్నాళ్ల తర్వాత ఈ సెగ్మెంట్​లో హీరో సంస్థ తీసుకొచ్చిన బైక్ ఇదే కావడం గమనార్హం. లుక్స్, ధర, ఫీచర్స్ ఇలా ఏ రకంగా చూసుకున్నా పల్సర్ 150కి మించిన రేంజ్​లో ఈ బైక్ ఉంది. ఈ బైక్​ను చూడగానే అట్రాక్ట్ చేసే మొదటి అంశం ప్రొజెక్టర్ హెడ్​లైట్, దాని స్లిమ్ ఎల్​ఈడీ టర్న్ ఇండికేటర్స్. మామూలుగా ఎక్స్​ట్రీమ్ బైక్​లో డీఆర్ఎల్ బైక్ హెడ్​లైట్ యూనిట్​తో లభిస్తుంది. అయితే కొత్త ఎక్స్​ట్రీమ్ 125ఆర్​లో మాత్రం డీఆర్​ఎల్ హెడ్​లైట్ మీద స్టైలిష్ డిజైన్​తో వచ్చింది. ఫ్యుయల్ ట్యాంక్​ను కూడా అందంగా తీర్చిదిద్దారు. ఇతర 125 సీసీ బైక్స్​తో పోలిస్తే ఇది పెద్దదిగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. హీరో ఎక్స్​ట్రీమ్ కొత్త మోడల్ టైర్లు కూడా చాలా బాగున్నాయి. వెడల్పాటి టైర్లు బైక్​కు పవర్​ఫుల్ లుక్​ను ఇస్తున్నాయి.

హీరో ఎక్స్​ట్రీమ్ 125 సీసీ పవర్​ట్రెయిన్ గురించి మాట్లాడితే.. దీన్ని కొత్తగా డెవలప్ చేసిన 125 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్​తో అమర్చారు. ఈ బైక్ 11.5 హార్స్​పవర్ శక్తి, 10.5 న్యూటన్ మీటర్ టార్క్​ను ప్రొడ్యూస్ చేస్తుంది. 125 సీసీ బైక్​లో ఈ పవర్ ఔట్​పుట్ సూపర్బ్ అనే చెప్పొచ్చు. అయితే బజాజ్ పల్సర్ 125 సీసీ బైక్​తో పోలిస్తే పవర్ పరంగా కాస్త వెనుకంజలో ఉంది. కానీ మైలేజీలో మాత్రం ఇది మంచి ఇంప్రెషన్ తీసుకుంటుంది. ఈ బైక్ 66 కేఎంపీఎల్ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. కొత్త హీరో ఎక్స్​ట్రీమ్ 125 సీసీ బైక్ 5.9 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఇందులో ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్, ఎల్ఈడీ బ్లింకర్స్, సిగ్నేచర్ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్ లాంటి ఫీచర్లను హీరో అందించింది. అలాగే కాల్, ఎస్​ఎంఎస్ అలర్ట్, గేర్ పొజిషన్ ఇండికేటర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను కూడా అమర్చారు. ఈ బైక్ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ.95,000, ఏబీఎస్​తో దీని ధర రూ.99,500గా ఉంది. మరి.. 125 సీసీ విభాగంలో హీరో ఎక్స్​ట్రీమ్ నంబర్ వన్ కాగలదని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి