iDreamPost

వెజ్ ప్రియులకు Zomato గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నది ఇది

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వెజిటేరియన్స్ కు శుభవార్తను అందించింది. శాఖాహారులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న కోరిక నెరవేరబోతోంది. ఇకపై వారికి ఆ ఇబ్బంది ఉండదు.

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వెజిటేరియన్స్ కు శుభవార్తను అందించింది. శాఖాహారులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న కోరిక నెరవేరబోతోంది. ఇకపై వారికి ఆ ఇబ్బంది ఉండదు.

వెజ్ ప్రియులకు Zomato గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నది ఇది

కాలం మారింది.. ప్రజల జీవనశైలిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆహారం విషయంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో చాలామంది ఇంటి వంటకంటే బయటి ఫుడ్ కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే కూర్చున్నచోటుకే ఫుడ్ డెలివరీ అవుతుండడంతో ఆన్ లైన్ ఫుడ్ యాప్ లకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ ఇంకా ఇతర సంస్థలు ఫుడ్ డెలివరీలో వాటి హవా కొనసాగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్ అందించింది. శాఖాహారులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న వారి కోరికను జొమాటో తీర్చనున్నది. ఇంతకీ ఏం చేయబోతుందంటే?

ఆహారపు అలవాట్లు ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటాయి. కొందరు నాన్ వెజ్ ఇష్టపడితే.. మరికొందరు వెజ్ ఇష్టంగా తింటారు. నాన్ వెబ్ వాళ్లు వెజ్ తింటారామోగానీ.. వెజ్ వాళ్లు మాత్రం నాన్ వెజ్ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఇలాంటి వారికి జొమాటో గుడ్ న్యూస్ అందించింది. జొమాటో తాజాగా తన యాప్ లో రెండు అప్ డేట్స్ ను చేసింది. శాఖాహారం మాత్రమే తినేవారి కోసం ప్రత్యేకంగా ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ను జొమాటో ప్రారంభించింది. ఇందులో కేవలం ప్యూర్ వెజిటేరియన్ హోటల్స్ వివరాలు మాత్రమే ఉంటాయి. ఇక ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే వెజ్ తో నాన్ వెజ్ మిక్స్ అవుతుందేమోనన్న భయం లేకుండా శాఖాహారులు జోమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు.

Zomato good news for veg lovers

అంతేకాదండోయ్.. ప్యూర్ వెజ్ ను డెలివరీ చేసేందుకు ప్రత్యేకంగా డెలివరీ టీమ్ ను కూడా ఏర్పాటు చేసింది.వీరు వెజ్ ఆర్డర్స్ ను మాత్రమే డెలివరీ చేయనున్నారు. అందుకోసం వారికి ప్రత్యేకంగా గ్రీన్ కలర్ బ్యాగ్స్ ను ఏర్పాటు చేసింది జొమాటో. శాఖాహారుల కోసం త్వరలోనే దేశవ్యాప్తంగా ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలను అందించనున్నట్లు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జొమాటో తీసుకున్న ఈ నిర్ణయంతో శాఖాహారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు కొన్ని సందర్భాల్లో వెజ్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే అందులో నాన్ వెజ్ మిక్స్ అయి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇకపై శాఖాహారులకు ఈ ఇబ్బందులు తప్పనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి