iDreamPost

నా కెరీర్ ఇలా అవ్వడానికి ఆమెనే కారణం.. తన వల్లే ఆఫర్లు రాలేదు: హీరోయిన్

  • Author singhj Updated - 04:47 PM, Fri - 28 July 23
  • Author singhj Updated - 04:47 PM, Fri - 28 July 23
నా కెరీర్ ఇలా అవ్వడానికి ఆమెనే కారణం.. తన వల్లే ఆఫర్లు రాలేదు: హీరోయిన్

ఫిలిం ఇండస్ట్రీలో ఛాన్సులు రావడం ఒకెత్తయితే వాటిని సరిగ్గా వినియోగించుకొని నిలదొక్కుకోవడం మరో ఎత్తు అనే చెప్పాలి. ఒక్క సినిమాతో ఓవర్​నైట్ స్టార్ అయిపోయి.. తర్వాతి చిత్రంతో అడ్రస్ లేకుండా పోయినవాళ్లు పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. అందుకే సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా ఒకేలా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఏది పడితే ఆ సినిమా చేయకుండా మంచి ప్రాజెక్టులను జాగ్రత్తగా ఎంచుకుంటూ ముందుకు పోవాలి. సినిమా సినిమాకు నటనలో మరింత మెరుగుపడాలని విశ్లేషకులు అంటున్నారు. అప్పుడే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు.

హీరోయిన్ల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. యాక్టింగ్​లో మెరుగుపడటంతో పాటు గ్లామర్​ను కాపాడుకుంటే అవకాశాలు వరిస్తాయి. అదే టైమ్​లో కాసింత లక్​ కూడా కలసిరావాలి. టాలెంట్, గ్లామర్ ఉన్నా ఫేడవుట్ అయినవారు ఎందరో ఉన్నారు. ఇదిలా ఉంటే.. సినీ కెరీర్​లో తాను సక్సెస్ అవ్వకపోవడానికి స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కారణమని ఒక కథానాయిక అంటున్నారు. ఆమె ఎవరో కాదు.. జరీన్ ఖాన్. మహారాష్ట్రకు చెందిన ఈమె.. మోడల్​గా తన కెరీర్​ను మొదలుపెట్టారు. ఆ తర్వాత హిందీ, తెలుగు, తమిళం, పంజాబీ భాషల్లో పలు మూవీస్​లో యాక్ట్ చేశారు. తెలుగులో ‘చాణక్య’ చిత్రంలో ఏజెంట్ జుబేదా​ పాత్రలో నటించి మెప్పించారు జరీన్ ఖాన్. ఆ సినిమా హిట్ అయ్యుంటే ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చి ఉండేవేమో!

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పుష్కర కాలమైనా జరీన్ ఖాన్ ఇంకా ఛాన్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఆమె నటించిన కొన్ని సినిమాలు హిట్ అయినా ఎందుకో సరైన ఆఫర్లు మాత్రం రాలేదు. దీనికి కత్రినా కైఫ్ కారణమని ఈ అమ్మడు చెబుతున్నారు. ‘కత్రినాతో నన్ను పోల్చడం వల్లే నా కెరీర్ దెబ్బతింది. నా ప్రతిభను నిరూపించుకునేందుకు అదో పెద్ద అడ్డంకిగా మారింది. ఆమెలాగే ఉన్నావ్ అంటూ నన్ను ఎవరైనా పొగిడితే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అదే కారణం వల్ల నేను ఇండస్ట్రీలో విజయవంతం కాలేకపోవడం విచారం కలిగిస్తోంది. నా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నా. మంచి క్యారెక్టర్ల కోసం ఎదురు చూస్తున్నా’ అని జరీన్ ఖాన్ చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి