iDreamPost

అరుదైన మొక్కకు YSRపేరు పెట్టిన శాస్త్రవేత్తలు!

సాధారణంగా ప్రదేశాలు, స్టేడియాలు, మొక్కలు వంటి వాటికి ప్రముఖల పేర్లు పెడుతుంటారు. ఆయా రంగాల్లో వారు అందిచిన సేవలకు గుర్తుగా ఇలా నామకరణాలు చేసి వారికి గౌరవం అందిస్తుంటారు. తాజాగా దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అలాంటి అరుదైన గుర్తింపు లభించింది.

సాధారణంగా ప్రదేశాలు, స్టేడియాలు, మొక్కలు వంటి వాటికి ప్రముఖల పేర్లు పెడుతుంటారు. ఆయా రంగాల్లో వారు అందిచిన సేవలకు గుర్తుగా ఇలా నామకరణాలు చేసి వారికి గౌరవం అందిస్తుంటారు. తాజాగా దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అలాంటి అరుదైన గుర్తింపు లభించింది.

అరుదైన మొక్కకు YSRపేరు పెట్టిన శాస్త్రవేత్తలు!

సాధారణంగా ప్రదేశాలు, స్టేడియాలు, మొక్కలు వంటి వాటికి ప్రముఖల పేర్లు పెడుతుంటారు. ఆయా రంగాల్లో వారు అందిచిన సేవలకు గుర్తుగా ఇలా నామకరణాలు చేసి వారికి గౌరవం అందిస్తుంటారు. ఇప్పటికే పలు రకాల మొక్కలకు, ప్రదేశాలకు, సంస్థలకి ప్రముఖుల పేర్లను పెట్టారు. అదే విధంగా తాజాగా ఓ అరుదైన మొక్కకు దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పెట్టారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు యోగి వేమన యూనివర్సిటీ గౌరవించింది. వివరాల్లోకి వెళ్తే..

యోగి వేమన విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.మధుసూదన్‌రెడ్డి, ఢిల్లీలోని ఎస్‌వీ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.కె.ప్రసాద్‌ల బృందం 2020లో వైఎస్సార్‌ కడప జిల్లా బాలుపల్లి అటవీ ప్రాంతంలోని మొగిలిపెంట ప్రాంతంలో ఓ మొక్కను గుర్తించింది. పలు శాస్త్రీయ పరిశోధనలు చేసిన అనంతరం ఆ మొక్క అరుదైనది గుర్తించారు. పూర్తి స్థాయి నిర్ధారణ కోసం లండన్‌లోని రాయల్‌ బొటానికల్‌ గార్డెన్ పంపింది. అలానే మన దేశంలోని పలు సంస్థలకు పంపింది.

ఆయా సంస్థలు ఆ మొక్క శాస్త్రీయతను నిర్ధారించి.. అరుదైన మొక్కగా గుర్తింపునిచ్చాయి. ప్రపంచం మొత్తం మీద శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే మొక్కగా నిర్ధారణ అవ్వడంతో.. ఈ ప్రాంతానికి సంబంధించిన పేరు పెట్టుకునే అవకాశం లభించింది. దీంతో వైవీయూ వ్యవస్థాపకుడు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించిన దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్సార్ పేరు పెట్టారు. విద్యా రంగానికి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తుగా ఓ అరుదైన మొక్కకు ఆయన పేరు పెట్టి యోగి వేమన యూనివర్సిటీ(వైవీయూ) గౌరవించింది.

దీనిని లండన్‌లోని రాయల్‌ బొటానికల్‌ గార్డెన్, కోల్‌కతాలోని బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాతో పాటు మరికొన్ని పరిశోధక సంస్థలు ధ్రువీకరించాయి. లెపిడోగాథిస్‌ జాతికి చెందిన ఈ మొక్కకు ప్రజాతిగా ‘రాజశేఖరే అనే పేరును కలిపి నామకరణం చేశారు. ఈ జాతి మొక్కలు భారత్‌లో 34 ఉండగా.. ఇది 35వది. ఏపీలో 8 మొక్కలు ఉండగా.. ఇది తొమ్మిదవది. ఈ జాతికి సంబంధించిన మొక్కలను స్థానిక భాషలో ముళ్లబంతి, సూర్యకాంతం తదితర పేర్లతో పిలుస్తారు. మరి.. అరుదైన మొక్కకు డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టి గౌరవించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి