iDreamPost

హాలీవుడ్ హీరోయిన్​తో యువరాజ్.. ఎన్ని షాట్స్ ఇస్తావంటూ షాకింగ్ పోస్ట్!

  • Author singhj Updated - 06:08 PM, Wed - 19 July 23
  • Author singhj Updated - 06:08 PM, Wed - 19 July 23
హాలీవుడ్ హీరోయిన్​తో యువరాజ్.. ఎన్ని షాట్స్ ఇస్తావంటూ షాకింగ్ పోస్ట్!

భారత క్రికెట్​పై తమదైన ముద్రవేసిన క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకరు. లెఫ్టాండర్​గా టీమ్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ పుత్తర్.. ఆ తర్వాత తన స్పిన్ బౌలింగ్​తోనూ జట్టుకు ఎన్నో విజయాలు కట్టబెట్టాడు. 2007 టీ20 వరల్డ్ కప్​తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్​ను టీమిండియా అందుకోవడంలో ఆల్​రౌండర్ యువరాజ్​ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఈ రెండు టోర్నీల్లోనూ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్​ల్లో అతడు అదరగొట్టాడు. యువీ క్రికెట్ ఆడే టైమ్​లో గ్రౌండ్​లో బ్యాట్, బాల్​తో రాణిస్తూ వార్తల్లో నిలిచేవాడు. అదే సమయంలో స్టేడియం బయట లవ్ ఎఫైర్స్​తోనూ నిత్యం న్యూస్​లో అతడి పేరు వినిపించేది. ఫలానా హీరోయిన్​తో యువీ డేటింగ్ చేస్తున్నాడని బోలెడ్ వార్తలు వచ్చేవి.

బాలీవుడ్ స్టార్ హాజెల్ కీచ్​ను మ్యారేజ్ చేసుకున్న యువరాజ్.. పెళ్లికి ముందు కిమ్ శర్మ, దీపికా పదుకొణె, రియా సేన్, ప్రీతి జింటా లాంటి హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. అయితే హాజెల్​తో మ్యారేజ్ తర్వాత భార్యా పిల్లలతో అతడు సంతోషంగా గడుపుతున్నాడు. అలాంటి యువీ తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్యాథరిన్ న్యూటన్​తో కలసి దిగిన ఫొటోను ఇన్​స్టా స్టేటస్​లో పెట్టిన యువీ.. ‘ఈ రోజు నువ్వు నాకు ఎన్ని షాట్స్ ఇవ్వబోతున్నావ్’ అంటూ ఆమె అకౌంట్​ను ట్యాగ్ చేశాడు. ‘ది ఓపెన్’ గోల్ఫ్ టోర్నీ కోసం స్కాట్లాండ్​కు వెళ్లిన యువరాజ్.. అక్కడ ఆమెతో దిగిన ఫొటోలను ఫ్యాన్స్​తో పంచుకున్నాడు. అయితే అతడు ‘ఎన్ని షాట్స్ ఇస్తావ్’ అనే వ్యాక్యాన్ని ఏ ఉద్దేశంలో వాడాడో తెలియక అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

యువీ బూతు అర్థం వచ్చేలా షాట్స్ అనే పదాన్ని వాడాడని కొందరు నెటిజన్స్ అంటున్నారు. మరికొందరేమో క్యాథరిన్ నటించిన ‘యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్’ మూవీలో ఓ సీన్ గురించి యువీ ఇలా కామెంట్స్ చేశాడని చెబుతున్నారు. ఈ సినిమాలో కొత్త భాషలు నేర్చుకునేందుకు ఒక రకమైన ద్రవణాన్ని షాట్స్​గా ఇస్తారు. దాన్ని తాగాక చీమలు, కీటకాల భాష కూడా అర్థమైపోతుంది. యువీ దీన్ని ఉద్దేశించే షాట్స్ అనే పదం వాడి ఉండొచ్చని అంటున్నారు అతడి అభిమానులు. ఇకపోతే, యువీతో ఫొటో దిగిన హీరోయిన్ క్యాథరిన్ న్యూటన్​కు మంచి పాపులారిటీ ఉంది. ‘బ్యాడ్ టీచర్’, ‘లేడీ బర్డ్’, ‘ది మార్షల్ ఆర్ట్స్ కిడ్’తో పాటు ‘పారానార్మల్ యాక్టివిటీ-4’, ‘యాంట్​మ్యాన్ అండ్ ది వాస్ప్’ లాంటి మూవీస్​తో ఆమె స్టార్​ స్టేటస్ సంపాదించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి