iDreamPost

బాబుకి నిద్ర లేకుండా చేస్తున్న నెల్లూరు పెద్దారెడ్డి! వారంలో టీడీపీని తొక్కేశాడు!

Chandrababu, Nellore: నెల్లూరు చేపల పులులు ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే విధంగా నెల్లూరు పెద్దారెడ్లు కూడా అంతే ఫేమస్. రాష్ట్ర రాజకీయాల్లో వీరు కీలక పాత్ర పోషిస్తారు. తాజాగా చంద్రబాబుకు ఓ వైసీిపీకి చెందిన పెద్దారెడ్డి చుక్కలు చూపిస్తున్నారు.

Chandrababu, Nellore: నెల్లూరు చేపల పులులు ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే విధంగా నెల్లూరు పెద్దారెడ్లు కూడా అంతే ఫేమస్. రాష్ట్ర రాజకీయాల్లో వీరు కీలక పాత్ర పోషిస్తారు. తాజాగా చంద్రబాబుకు ఓ వైసీిపీకి చెందిన పెద్దారెడ్డి చుక్కలు చూపిస్తున్నారు.

బాబుకి నిద్ర లేకుండా చేస్తున్న నెల్లూరు పెద్దారెడ్డి! వారంలో టీడీపీని తొక్కేశాడు!

మనుమసిద్ధి రాజు పాలించిన ప్రాంతం, మహాభారతాన్ని రచించిన తిక్కన జన్మస్థలం, వడ్లకు ప్రఖ్యాతి, రెడ్లకు ప్రసిద్ధి, రాజకీయ చైతన్యానికి ప్రతిరూపం నెల్లూరు జిల్లా. పూర్వం సింహపురిగా పిలవడబడే ఈ ప్రాంతం నేడు నెల్లూరుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ జిల్లా రాజకీయాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ ఉండే తగువులు తగాదాలు మరెక్కడా కనిపించవనే చెప్పాలి. రంజైన రాజకీయం చూడాలన్నా, స్వపక్షంలోనే విపక్షం చూడాలన్న నెల్లూరునే ఆశ్రయించాలి. ఇక్కడి రాజకీయం మొత్తం నెల్లూరు పెద్దారెడ్డి చుట్టూనే తిరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. తాజాగా ఓ వైసీపీ పెద్దారెడ్డి.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్నాడు. మరి.. ఆయన ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి ఎంతో మంది నేతలు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. నెల్లూరు జిల్లా రాజకీయంలో పెద్దారెడ్లదే ఆధిపత్యం. అధికార పక్షం, విపక్షం అన్నిట్లోనూ వీరే కనిపిస్తుంటారు. రాజకీయాలకు పెట్టింది పేరు నెల్లూరు పెద్దారెడ్లు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యమే కొనసాగుతుంది. వారే నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తుంటారు. స్వపక్షంలోనే విపక్షంగా మారాలంటే కూడా ఇక్కడి నేతలకు మాత్రమే సాధ్యం. ఇంతేకాక రాజకీయ సమస్యలను వ్యూహాత్మకంగా పరిష్కరించ కలిగే సత్తా నెల్లూరు పెద్దా రెడ్ల సొంతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతుంటారు.

తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కూడా ఓ నెల్లూరు పెద్దారెడ్డి నిద్ర లేకుండా చేస్తున్నాడు. 2014, 2019లో నెల్లూరు జిల్లానూ వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఇక అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా ఈ జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి రెబల్స్ గా మారారు. అనంతరం ఏకంగా పార్టీని వీడి టీడీపీలో చేరారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లు టీడీపీలో చేరారు. దీంతో వైసీపీకి గట్టి షాక్ తగిలిందనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే వెంటనే సీఎం జగన్ చర్యలు తీసుకుని మొత్తం మార్చేశాడు.

అదే విధంగా ఇటీవలే వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పార్టీని వీడటంతో.. ఇప్పటి వరకు వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరులో ఈ సారి ఎదురు దెబ్బ తప్పదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలానే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు లోలోపల తెగ సంతోష పడిపోయారంట. ఇలాంటి సమయంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. ఎంపీ విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులయ్యారు. వచ్చి రావడంతోనే ప్రక్షాళన మొదలు పెట్టారు. అసంతృప్త నేతలను స్వయంగా వారి ఇంటికి వెళ్లి కలుస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు.

ఇలా నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో.. ప్రత్యేక దృష్టి సారించి.. సమస్యలను పరిష్కరిస్తున్నారు. మానుగుంట మహీందర్ రెడ్డిని కలవడమే అందుకు ఉదాహరణ. ఇక నెల్లూరులో ఈజీగా గెలవచ్చు అని చంద్రబాబు ఊహించుకుంటున్న సమయంలో ఆయనకు ఈ పెద్దారెడ్డి నిద్రలేకుండా చేస్తున్నారు. గతంలోనూ విశాఖపట్నం జిల్లా రాజకీయాల్లో విజయసాయిరెడ్డి తనదైన రాజకీయ చాతుర్యం ప్రదర్శించి అసంతృప్తులను చల్లార్చారు. మొత్తంగా నాడు విశాఖలో నేడు నెల్లూరులో చంద్రబాబుకు ఈ వైసీపీ పెద్దారెడ్డి చుక్కలు చూపిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి