iDreamPost

మహరాష్ట్రలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు.. భారీగా పాల్గొన్న యువత!

మహరాష్ట్రలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు.. భారీగా పాల్గొన్న యువత!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివగంత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. మరణించి ఏళ్లు గడుస్తున్నా..ప్రజలు మాత్రం ఆ విషాదాన్ని మరువలేదు. మనస్సున మహారాజు రాజన్న  అంటూ ఇప్పటికి ఎంతో మంది ప్రజలు ఆయనను తలచుకుంటున్నారు. ఎంతో మంది ప్రాణాలను నిలిపి..దేవుడిగా మారాడు. చాలా మంది ఇళ్లలో దేవుడి విగ్రహాలతో పాటు రాజన్న విగ్రహం కూడా ఉంటుంది. ఇక సెప్టెంబర్ 2న తెలుగు ప్రజలకు చీకటి రోజు.. రాజశేఖరెడ్డి మరణించిన రోజు. ఆ మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా  రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్సార్ అభిమానులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అలానే పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు జరిగాయి.

మహారాష్ట్రలో వైఎస్సార్ కు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. మారాఠీలు జగన్ మోహన్ రెడ్డిని ముద్దుగా దాదా అని పిలుచుకుంటారు. వైఎస్సాఆర్ ఫ్యాన్స్   ఏర్పాటు చేసిన ఎన్ జీవో దాదాశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. పలు రకాల ఆటపోటీలు నిర్వహించారు. ఖో-ఖోను ఫౌండేషన్ వారు నిర్వహించారు. ఇందులో మొత్తం 23 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ప్రైజ్ మనీతో  అందజేశారు.

అలానే ఆటల్లో పాల్గొన్న క్రీడాకారులకు మొక్కలనూ బహుకరించింది దాదాశ్రీ ఫౌండేషన్. ఈ ఆటల పోటీల కార్యక్రమాలు రెండు రోజుల పాటు కొనసాగాయి. సాల్సే పాఠశాలలో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. అక్కడ విద్యార్థులతో కలిసి ఫౌండేషన్ వాళ్లు 501 మొక్కలు నాటారు. వీట్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి.. 73 మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి హెల్మెట్ లు అందజేశారు. మరి. మహారాష్ట్రలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: APలోని ఆ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ రెండు శుభవార్తలు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి