iDreamPost

యూట్యూబ్‌ కోసం వీడియోలు చేసే వాళ్లకు శుభవార్త!

యూట్యూబ్‌ కోసం వీడియోలు చేసే వాళ్లకు శుభవార్త!

యూట్యూబ్‌ అన్నది నేడు ఓ నిత్యావసరంగా మారిపోయింది. అన్ని రకాలుగా యూట్యూబ్‌ జనాలకు ఉపయోగపడుతోంది. యూట్యూబ్‌ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఉండటంతో జనాలు యూట్యూబ్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. వీడియోలు చేసి యూట్యూబ్‌లో పెట్టడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా తమ ప్లాట్‌ఫాం కోసం వీడియోలు చేసే వారి కోసం యూట్యూబ్‌ ఎప్పుడూ.. ఏదో ఒక అప్‌డేట్‌ తెస్తూనే ఉంది. వీడియోలు చేసే వారి పనిని సులభతరం చేస్తోంది.

తాజాగా, యూట్యూబ్‌.. వీడియోలు చేసే వారికోసం ఓ కొత్త యాప్‌ ‘యూట్యూబ్‌ క్రియేట్‌’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ‘యూట్యూబ్‌ క్రియేట్‌’ యాప్‌ ద్వారా వీడియోలను చాలా సులభంగా ఎడిట్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ఏఐ టెక్నాలజీతో పని చేస్తుండటంతో మంచి మంచి ఫీచర్లను ఎడిటింగ్‌ కోసం వాడుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌లో ట్రిమ్మింగ్‌, ఆటో క్యాప్చన్‌, వాయిస్‌ ఓవర్‌, ట్రాన్స్‌ఫర్మేషన్లు, అప్లికేషన్‌ ఫిల్లర్లు, ఇంపాక్ట్‌ లైబ్రరీతో పాటు మరికొన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

అంతేకాదు! యూట్యూబ్‌లో వాడుకోవటానికి ఎలాంటి అభ్యంతరం లేని కాపీరైట్‌ ఫ్రీ మ్యూజిక్‌ కూడా అందుబాబులో ఉంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించింది షార్ట్‌ వీడియోల బ్యాక్‌ గ్రౌండ్‌ను కూడా మార్చుకోవచ్చు. డ్రీమ్‌ స్క్రీన్‌ను పెట్టుకోవచ్చు. యూట్యూబ్ క్రియెట్ బీటా వర్షన్ ప్రస్తుతం యూకే, యూఎస్‌, జర్మనీ, ఫ్రాన్స్, ఇండోనేషియా, భారత్, కొరియా, సింగపూర్‌తో పాటు మరికొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ యాప్‌ పూర్తిగా ఉచితం కావటం విశేషం. మరి, యూట్యూబ్‌ క్రియేట్‌ యాప్‌పై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి