iDreamPost

యూట్యూబ్ కీలక నిర్ణయం.. ఇక అలాంటి వారికి చిక్కులు!

YouTube:యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో కనిపించే  యాప్స్ లో యూట్యూబ్ ఒకటి. దీని ద్వారా ఎంతో మంది తమకు నచ్చిన వీడియోలను చూస్తే ఎంటర్ టైన్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది.

YouTube:యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో కనిపించే  యాప్స్ లో యూట్యూబ్ ఒకటి. దీని ద్వారా ఎంతో మంది తమకు నచ్చిన వీడియోలను చూస్తే ఎంటర్ టైన్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది.

యూట్యూబ్ కీలక నిర్ణయం.. ఇక అలాంటి వారికి చిక్కులు!

ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ యుగంలో ఎన్నో రకాల అప్లికేషన్లు దర్శనమిస్తుంటాయి.  అనేక రకాల యాప్స్ ను ఇతర డిజిటిల్ ఫిచర్లను, అకౌంట్స్ ను వినియోగిస్తుంటారు. అలానే ఎక్కువ మంది ఉపయోగిస్తున్న వాటిల్లో యూట్యూబ్ ఒకటి. చాలా మంది వినియోగదారులకు ఎంటర్ టైన్మెంట్ అందించే వాటిల్లో ఇది  ఒకటి. అనేక రకాల వీడియోలు, వివిధ సమాచారం యూట్యూబ్ లో దర్శనమిస్తుంటుంది. ఇక యూట్యూబ్ సైతం వినియోదారులను ఆకట్టుకునేందుకు తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా యూట్యూబ్ తీసుకున్న ఓ నిర్ణయంతో కొందరికి ఇబ్బందులు తప్పవు. మరి.. ఆ నిర్ణయం ఏమిటి?. ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో కనిపించే  యాప్స్ లో యూట్యూబ్ ఒకటి. దీని ద్వారా ఎంతో మంది తమకు నచ్చిన వీడియోలను చూస్తే ఎంటర్ టైన్ అవుతుంటారు. అంతేకాక ఈ యూట్యూబ్ ను చూసే వారి సంఖ్య భారీగా ఉంది. ఇక దీనికి ఉన్న డిమాండ్ ను పసిగట్టి చాలా మంది యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లుగా మారారు. అంతేకాక వివిధ రకాల కంటెంట్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ భారీగా ఆదాయం పొందుతున్నారు. ఇక ఈ యాప్ కి కూడా ప్రకటనల ద్వారానే ఎక్కువగా ఆదాయం వస్తుంది. అలా వచ్చిన ఆదాయంతోనే కంటెంట్ క్రియేటర్స్ కు డబ్బులు చెల్లిస్తుంది.

YouTube is a key decision

యూట్యూబ్ కి ప్రధాన ఆదాయం వచ్చే యాడ్స్ ను యాడ్ బ్లాకర్లు అడ్డుకుంటాయి. వీటి కారణంగా యూజర్లు చూసే వీడియోలపై యాడ్స్ ప్లే కాకుండా ఆపుతాయి. దీనివల్ల కంపెనీకి  చాలా నష్టం జరుగుతుందని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. అలా యాడ్ బ్లాకర్లు ఉపయోగించడం వల్ల క్రియేటర్స్ కు లభించే ఆదాయం కూడా తగ్గుతుంది.  ఈ కారణంతోనే గత సంవత్సరం వెబ్‌లో  యాడ్ బ్లాకర్లపై యూట్యూబ్‌ పోరాటం ప్రారంభించింది. తాజాగా ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్స్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది. యాడ్ బ్లాకర్ యాప్స్‌కు యూట్యూబ్ కళ్లెం వేయడం కారణంగా  వాటిని క్రియేట్ చేసే కంపెనీలకు చిక్కులు ఎదురవుతున్నాయి. బ్రౌజర్లలో యాడ్ బ్లాకర్లను యూట్యూబ్ నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది.

తాజాగా నిర్ణయంతో వేలాది మంది యూజర్లు ఈ యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. క్రోమ్ బ్రౌజర్‌ లో యూట్యూబ్ చూసే చాలా మంది యాడ్ బ్లాకర్లను తీసేస్తున్నట్లు తెలుస్తోంది. యాడ్‌-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి యూట్యూబ్ ప్రీమియం సర్వీస్‌కు డబ్బు చెల్లించాలని సూచిస్తుంది. యాడ్ బ్లాకర్లను అడ్డుకోవడానికి యూట్యూబ్ త్రి-స్ట్రైక్ అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానం ప్రకారం ఒక యూజర్ వీడియోలో యాడ్ బ్లాకర్ ఉన్నట్లు గుర్తిస్తే వారికి ఓ హెచ్చరిక మెసేజ్స్ ను యూట్యూబ్ పంపిస్తుంది. అంతేకాక యూట్యూబ్ ప్రీమియంకు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని తెలుపుతుంది.

ఇక యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయం కొందరిపై బాగా ప్రభావం చూపిస్తుంది.  చాలా మంది యాడ్స్ లేకుండా వీడియోలు చూసేందుకు థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగిస్తారు. ఈ యాప్స్‌పై నిషేధం వల్ల అలాంటి వారికి అసౌకర్యం కలుగుతుంది. థర్డ్ పార్టీ యాప్స్‌ నిషేధం అనేది యాడ్ బ్లాకర్ డెవలపర్లపై ఒత్తిడి తెస్తుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా యూట్యూబ్ ప్రీమియంకు ఆదాయం పెరుగుతుంది. యాడ్స్‌ను ఆపడానికి యూజర్లు ప్రీమియం సర్వీస్‌కు మరింత మంది డబ్బు చెల్లిస్తారు. మొత్తంగా యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయం యాడ్ బ్లాకర్ ను వినియోగించే వారికి చిక్కులు తప్పవని టెక్నికల్ నిపుణులు చెబుతున్నారు. మరి..యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి