iDreamPost

48 ఏళ్ల వయసులో పెళ్లికావాలంటున్న సీనియర్ హీరోయిన్.. ఎవరంటే?

Actress Comments On Late Marriage Wish: సీనియర్ నటి లేటు వయసులో ఘాటు వ్యాఖ్యలు చేసింది. 48 ఏళ్ల వయసులో ఆమెకు పెళ్లి చేసుకోవాలి అని ఉందంట. అదే విషయాన్ని చాలా ఓపెన్ గా కామెంట్స్ చేసింది.

Actress Comments On Late Marriage Wish: సీనియర్ నటి లేటు వయసులో ఘాటు వ్యాఖ్యలు చేసింది. 48 ఏళ్ల వయసులో ఆమెకు పెళ్లి చేసుకోవాలి అని ఉందంట. అదే విషయాన్ని చాలా ఓపెన్ గా కామెంట్స్ చేసింది.

48 ఏళ్ల వయసులో పెళ్లికావాలంటున్న సీనియర్ హీరోయిన్.. ఎవరంటే?

మనకు తెలుగులో చాలానే సామెతలు ఉన్నాయి. నిజానికి సామెతలు ఊరికే పుట్టుకు రాలేదు. వాటి వెనుక పెద్ద కథే ఉంది. ఇప్పుడు అలాంటి ఒక సామెత ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక సీనియర్ హీరోయిన్ కి బాగా నప్పుతోంది. ఆ సామెత ఏంటంటే ‘ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి’. అంటే మీకు ఇప్పటికే విషయం అర్థమైపోయి ఉంటుంది. ఈ సీనియర్ నటి ఇప్పుడు లేటు వయసులో ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. తనకి పెళ్లి చేసుకోవాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. అయితే తప్పేంటి అని డౌటనుమానాలు అడగకండి. ఎందుకంటే ఆమెకు పెళ్లి వయసు దాటి పుష్కరం కావొస్తోంది. 48 ఏళ్లు వచ్చిన తర్వాత పెళ్లి గాలి మల్లిందని చెబుతోంది.

ఈ సీనియర్ నటికి దేశవ్యాప్తంగా ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది. బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన నటి ఈవిడ. 18 ఏళ్లకే ఫెమినా మిస్ ఇండియా అవార్డు గెలుచుకుంది. 1994లో విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత అరంగేట్రం చేసిన తొలి సినిమాతోనే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది. ఆ తర్వాత ఆమె కెరీర్ పరుగులు పెట్టింది. దేశం మొత్తం ఆమె పేరు జపించడం ప్రారంభించారు. హిందీ, తమిళ్, బెంగాలీలో చిత్రాలు చేసింది. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇంకా గుర్తు పట్టలేదా? ఆ సీనియర్ నటి మరెవరో కాదు.. సుశ్మితా సేన్. అవునండి ఇప్పుడు సుశ్మితా సేన్ కి పెళ్లి కోరిక కలిగింది. ఈ వయసులో పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ మనసులో మాట బయట పెట్టింది.

“నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. కాకపోతో ఈ వయసులో పెళ్లి అంటే కాస్త కఠినంగానే కాకుండా.. గందరగోళంగా కూడా అనిపిస్తోంది. సరైన వ్యక్తి దొరికినప్పుడు, నేను కోరుకున్న లక్షణాలు అతనిలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అంటూ సుశ్మితా సేన్ ఓపెన్ కామెంట్స్ చేసింది. అలాగే మాజీ బాయ్ ఫ్రెండ్స్ గురించి కూడా సుశ్మితా సేన్ కామెంట్స్ చేసింది. తన మాజీ ప్రియులు అందరూ ఇప్పటికీ తనతో స్నేహితులుగానే మెలుగుతున్నారని చెప్పుకొచ్చింది. వాళ్లు అలా ఉడటం తనకు పెద్ద గిఫ్ట్ అని తెలిపింది. ఎవరితో ఎంత వరకు ఉండాలి అనే విషయంపై మనకు క్లారిటీ ఉంటే జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుందంటూ సుశ్మితా సేన్ కామెంట్స్ చేయడం గమనార్హం.

సుశ్మితా సేన్ మాజీ బాయ్ ఫ్రెండ్స్ ఎవరంటే.. అప్పట్లో రణదీప్ హుడాతో సుశ్మితా సేన్ డేటింగ్ చేసింది. అయితే కొన్నాళ్లకు వాళ్లు విడిపోయారు. తర్వాత రోహమన్ షాల్ కు సుశ్మితా సేన్ దగ్గరైంది. వీళ్ల రిలేషన్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. తర్వాత కొన్నాళ్లు ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోదీతో కూడా సుశ్మితా సేన్ పలు సందర్భాల్లో కనిపించింది. కానీ, అప్పట్లో ఎప్పుడూ పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ, 48 ఏళ్ల వయసులో మాత్రం సుశ్మితా మనసు పెళ్లిపైకి మళ్లింది. మరి.. ఆమె కోరుకున్న లక్షణాలు ఉన్న వరుడు ఎప్పటికి దొరుకుతాడో చూడాలి. లేటు వయసులో సుశ్మితా సేన్ పెళ్లికి రెడీ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి