iDreamPost

Naga Chaitanya : యూత్ హీరోలకు ఈ వేగం చాలా అవసరం

Naga Chaitanya : యూత్ హీరోలకు ఈ వేగం చాలా అవసరం

పైకి కనిపించడం లేదు కానీ నాగ చైతన్యనే అందరికంటే ఎక్కువగా సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు. సైలెంట్ గా పూర్తి చేసుకుంటూ ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ ఏడాది మొత్తం పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సాగుతున్నాడు. ఆల్రెడీ సంక్రాంతికి నాన్నతో కలిసి చేసిన బంగార్రాజు హిట్టు బోణీ కొట్టేసింది. చైతుదే లీడ్ రోల్ కాబట్టి ఈ విజయాన్ని తన ఖాతాలో వేయొచ్చు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న థాంక్ యు ఫైనల్ స్టేజి కి వస్తోంది. త్వరలోనే గుమ్మడి కాయ కొట్టేస్తారు. నిర్మాత దిల్ రాజు విడుదల తేదీ ఫిక్స్ చేయలేదు. అమీర్ ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న లాల్ సింగ్ చద్దా ఏప్రిల్ 14న రాబోతోంది. తెలుగు డబ్బింగ్ కూడా చేస్తున్నారు.

ఇవి కాకుండా విక్రమ్ కుమార్ తోనే చేసిన హారర్ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. షూట్ పూర్తి చేశారు. ఎప్పుడు వస్తుందనేది తెలియదు కానీ చైతు డిజిటల్ డెబ్యూ కావడంతో అభిమనులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే తమిళంలో మానాడుతో పెద్ద హిట్టు కొట్టిన వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేయొచ్చని లేటెస్ట్ అప్ డేట్. మొత్తంగా కౌంట్ చూస్తే ఈ ఏడాది తొలి సగంలోనే మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ వచ్చేస్తాయి. ఇంకా పదకొండు నెలల టైం ఉంది. ఈజీగా మరో రెండు ఫినిష్ చేయొచ్చు. అదేమంత కష్టం కాదు. అదే జరిగితే మొత్తం అయిదు సినిమాలతో చైతు అభిమానులకు పండగే.

నితిన్, నాని, చైతులు మాత్రమే ఈ టైపు స్పీడ్ చూపిస్తున్నారు. ఏడాదికి ఒకటి చేయడమే స్టార్ హీరోలకు గగనమవుతున్న తరుణంలో ఈ వేగం ఇప్పుడు చాలా అవసరం. అసలే బాక్సాఫీస్ రెండేళ్లుగా సంక్షోభాన్ని ఎదురుకుంటోంది. అల వైకుంఠపురములో తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ పుష్ప, అఖండ లాంటి సక్సెస్ లు వచ్చాయి. మళ్ళీ మునుపటి కళ రావాలంటే హీరోలు వరసగా సినిమాలు చేయాలి. కాంబినేషన్ల మోజులో పడి కథలు నచ్చడం లేదనే కారణాలు చూపి లేట్ చేయడం సబబు కాదు. మరీ సంవత్సరానికి ఐదారేసి కష్టం కానీ కనీసం రెండు మూడు ఉంటే డెఫిషిట్ లేని శుక్రవారాలను చూసుకోవచ్చు.

Also Read : Radhe Shyam : పాన్ ఇండియా సినిమా తొందరపడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి