iDreamPost

CRIME NEWS పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నాడని…

CRIME NEWS పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నాడని…

పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడని యాసిడ్ తాగి సూసైడ్ చేసుకుంది ఓ యువతి. ఆదిలాబాద్ తలమడుగు మండలంలోని రుయ్యడి గ్రామనికి చెందిన కుమ్మరి శ్రీనీల(19)ని అదే గ్రామానికి చెందిన చిన్నాల సాయి అనే ఓ యువకుడు కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. ఈ విషయం శ్రీనీల ఇంట్లో తెలిసి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.

అయితే సాయి శ్రీనీలకి వచ్చే సంబంధాలని చెడగొడుతున్నాడు. సాయి తనకి వచ్చే సంబంధాలన్నీ చెడగొడుతున్నాడని, ప్రేమిస్తున్నాను అంటూ వేధిస్తున్నాడు అని మనస్తాపంతో ఆ యువతి ఇంట్లోని యాసిడ్ తాగి ఆత్మహత్యకి ప్రయత్నించింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు.

ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ కి తరలించగా పరిస్థితి విషమించి చికిత్స పొందుతూనే మృతి చెందింది. శ్రీనీల తండ్రి శేఖర్‌ పోలీసులకి ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి