iDreamPost

వీడియో: చిరుతను బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడు!

వీడియో: చిరుతను బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడు!

క్రూరమృగాల పేరు వింటేనే అందరూ భయపడి పోతుంటారు. ఇక ఎదురు పడితే.. ప్రాణ భయంతో పరుగులు తీస్తుంటారు.  మరికొన్ని సందర్భాల్లో ప్రాణ రక్షణ కోసం  వాటిపై దాడి చేసి చంపేస్తుంటారు. ముఖ్యంగా చిరుత, పులి, ఎలుగుబంటి వంటి వాటి విషయంలో ప్రజలు చాలా భయపడతారు. అవి ఏదైనా జబ్బు చేసి తారసపడితే వాడి జోలికి కూడా ఎవ్వరూ వెళ్లరు.  అయితే వాటిని కూడా ప్రేమించే వారు కొందరు ఉంటారు. క్రూరమృగాలైన..వాటిది ప్రాణమే కదా అన్నట్లు.. వాటికి సాయం చేస్తుంటారు. అలాంటి కోవాకు చెందిన వ్యక్తే.. కర్ణాటక కు చెందిన వేణుగోపాల్.  అనారోగ్యంతో ఉన్న చిరుతను బైక్ పై ఆస్పత్రికి తీసుకెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా అర్సికెరె తాలూకా బాగివాలు గ్రామానికి చెందిన వేణుగోపాల్ అనే 25 ఏళ్ల యువకుడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిత్యం పొలంకి వెళ్లి.. పనులు చేయడం సాయంత్రానికి ఇంటికి చేరడం వేణుగోపాల్ దినచర్య. రోజూ మాదిరిగానే శుక్రవారం కూడ పని మీద పొలంకి వెళ్లాడు. అయితే అతడి పొలంకి సమీప ప్రాంతంలో ఓ చిరుత.. నిస్సాహాయ స్థితిలో వేణుకు కనిపించింది. అది నీరసంగా పొలంకి ఓ మూలన పడి ఉంది. కొంత సేపు ఆ క్రూరమృగాన్ని అలాగే చూస్తు ఉండిపోయాడు.

 చివరకు అది అనారోగ్యంతో బాధపడుతుందని  ఆ యువకుడు గమనించి.. రక్షించాలనుకున్నాడు. అయితే అది క్రూరమృగం కాబట్టి ఏమైనా హానీ చేస్తుందేమో అనే సందేహం.. తొలుత దూరం నుంచి దానిని కదిలించాడు. అయినా దాని నుంచి ఎటువంటి స్పందన లేకపోవడాన్ని  గమనించాడు. దానిని  ఎలాగైన హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందించాలని అనుకున్నాడు. ఒక తాడుతో బైక్ కు చిరుతను కట్టుకుని ఆస్పత్రికి బయలు దేరాడు. ఈ  వింత దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు షాకయ్యారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించారు.

మార్గమధ్యంలో వేణుగోపాల్ బైక్ పై చిరుతను కట్టేసి తీసుకువస్తుండటాన్నిఅధికారులు గమనించారు. అతడిని ఆపిన అధికారులు విచారించగా జరిగిన విషయాన్ని వేణుగోపాల్ తెలియజేశాడు. అనంతరం అధికారులు తమ వాహనంలో ఆ చిరుతను ప్రభుత్వ పశువైద్యశాలకు తరలించారు. అయితే పొలాల్లో సంచరిస్తున్న చిరుతను ఆ యువకుడే బంధించి.. అధికారులకు అప్పగించేందుకు వెళ్లాడని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఒక క్రూరమృగం దగ్గరు వెళ్లిన ఆ యువకుడ్ని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి