iDreamPost

ఎవరీ గురుమూర్తి.. ? తిరుపతి వైసీపీ టిక్కెట్‌ ఎలా దక్కింది..?

ఎవరీ గురుమూర్తి.. ? తిరుపతి వైసీపీ టిక్కెట్‌ ఎలా దక్కింది..?

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో విశ్వసనీయతకు ప్రాధాన్యతనిచ్చారు. కొత్త అభ్యర్థిని తెరమీదకు తెచ్చారు. గడిచిన కొన్నేళ్ళుగా తన వెంట నడిచిన నేతను అభ్యర్థిగా బరిలో దింపారు. ఇప్పటికే బాపట్ల ఎంపీ స్థానం నుంచి నందిగం సురేష్ కి అవకాశం ఇచ్చినట్టే ఈసారి తిరుపతి నుంచి గురుమూర్తికి ఛాన్స్ ఇచ్చారు.

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామానికి చెందిన ఎం.గురుమూర్తి నేపద్యాన్ని గమనిస్తే, వైఎస్ఆర్ హయాంలో ఫిజియోథెరపి స్టూడెంట్ గా ఉన్న గురుమూర్తి మెడికల్ కౌన్సిల్ తరహాలో ఫిజియోథెరపి కౌన్సిల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో తన నాయకత్వంలో కొందరు విద్యార్థులతో వైఎస్ ని పలుమార్లు కలిశారు . ఫిజియోథెరపి పూర్తయ్యిన తర్వాత మిగతా విద్యార్థులు ప్రాక్టీస్ లో స్థిరపడి దూరమైనా తను మాత్రం కౌన్సిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు . ఈ క్రమంలో వైఎస్ కుటుంబంతో అనుబంధం ఏర్పడింది . వైఎస్ మరణం తర్వాత తిరుపతిలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా వైఎస్ కుటుంబంతో టచ్ లో ఉంటూ వచ్చారు . రాజకీయంగా బహిరంగంగా గురుమూర్తి పేరు వినపడక పోయినప్పటికీ రాజకీయ సంబంధాలు బాగా మైంటైన్ చేసేవారు గురుమూర్తి.

Also Read:రాజీనామ చేస్తానని స్టాంప్ పేపర్ మీద రాసిచ్చిన ఆ బీజేపీ ఎంపీ ఇప్పుడేమి చేస్తారు?

జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి స్థానికంగా పార్టీ ఏర్పాటు చేసే కార్యక్రమల్లో ఒక సామాన్య కార్యకర్తగా పాల్గొంటూ వచ్చారు. 2013 లో వైఎస్ షర్మిళ పాదయాత్ర సమయంలో తెరవెనుక క్రియాశీలక పాత్ర పోషించిన గురుమూర్తి , పాదయాత్ర సందర్భంగా షర్మిళ కాలి గాయాలకు వైద్యుడిగా సేవలందించారు . దేశంలోనే ప్రథమంగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవటం కోసం ఓ మహిళగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా 116 నియోజకవర్గాల్లో పర్యటించి చరిత్ర సృష్టించిన వైఎస్ షర్మిళ పాదయాత్ర ఆసాంతం వైద్య సేవలందించి వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు గురుమూర్తి .

ఇక చారిత్రాత్మకమైన వైఎస్ జగన్ పాదయాత్ర ప్రజాప్రస్థానం సందర్భంగా పలుమార్లు వేళ్ళ గాయాలకు, కాలి నొప్పులకు గురికాగా పాదయాత్ర పూర్తయ్యేవరకూ దగ్గరుండి ఫిజియో సేవలు అందించి జగన్ పాదయాత్ర నిరాటంకంగా కొనసాగటానికి తోడ్పడ్డారు. 2019 లో వైసీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ICDS లో దివ్యంగుల , ట్రాన్సజెండర్ , సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్పెషల్ ఆఫీసర్ గా సేవలందించారు గురుమూర్తి.

Also Read:బెంగాల్లో జగన్ పథకాన్ని అమలు చేస్తామంటున్న మమత

తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణం తర్వాత పోటీకి వారి కుటుంబ సభ్యులకు కాకుండా అనివార్య కారణాల రీత్యా వేరేవారికి టికెట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు సరైన అభ్యర్థి ఎవరూ అన్న చర్చ వచ్చినప్పుడు తిరుపతిలోనే వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తూ స్థానిక రాజకీయాల పట్ల అవగాహన ఉన్న గురుమూర్తి పేరు ప్రస్తావనకు వచ్చింది . 2019 ఎన్నికల ముందు పార్లమెంట్ అభ్యర్థి అంటే భారీ స్థాయి వ్యాపారవేత్తలు అనే అపోహలకు తెర దించుతూ విద్యాధికులకు , యువకులకు అవకాశం కల్పించిన జగన్ నందిగం సురేష్ వంటి సామాన్యుణ్ణి సైతం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడం కోసం ఎంపిక చేసి సంచలనం సృష్టించారు . ఇప్పుడు అదే వరవడి కొనసాగిస్తూ ఆర్ధిక బలాబలాల గురించి ఆలోచించకుండా యువకుడు, విద్యాధికుడు అయిన గురుమూర్తిని తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.

తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి గడిచిన సాధారణ ఎన్నికల్లో బల్లి దుర్గా ప్రసాద్ ఘన విజయం సాధించారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సమీప ప్రత్యర్థి పనబాక లక్ష్మిని సుమారుగా 2.4లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. అయితే ఏడాదిన్నర గడిచిన తర్వాత ఆయన అనూహ్యంగా కరోనా సోకడం, అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. దాంతో ఈసారి ఆయన కుటుంబం నుంచి ఒకరికి పోటీ చేసే అవకాశం ఇస్తారని అంతా భావించారు. దానికి అనుగుణంగా బల్లి దుర్గా ప్రసాద్ తనయుడు చైతన్యకే ఛాన్స్ అంతా భావించారు. కానీ పోటీకి అతను ఆసక్తి చూపకపోవడంతో.. ఎమ్మెల్సీ పదవిని జగన్ కట్టబెట్టారు.

Also Read:ఏపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ : ఫ‌లితాల‌పై ఉత్కంఠ‌

తిరుపతి లోక్ సభ నుంచి తొలుత 2014 ఎన్నికల్లో వర ప్రసాద్ పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత బల్లి దుర్గా ప్రసాద్ గెలిచారు. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయం దిశగా సాగుతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గురుమూర్తి బరిలో నిలుస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి