iDreamPost

ఈ యేటి మేటి రాజకీయ బయోపిక్ చిత్రం “యాత్ర”

ఈ యేటి మేటి రాజకీయ బయోపిక్ చిత్రం “యాత్ర”

2019 సంవత్సరం తెలుగు చలన చిత్ర రంగంలో నాలుగు బయోపిక్ సినిమాలు రిలీజ్ అయినాయి.సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఎన్టీఆర్ నట జీవితమే ప్రధానాంశంగా తెరకెక్కిన “కథానాయకుడు” ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

నందమూరి తారక రామారావు నట జీవితంలో కుటుంబ కథా చిత్రాలతో పాటు,పౌరాణిక చిత్రాలలో రాముడు, కృష్ణుడు,కర్ణుడు,దుర్యోధనుడి వంటి పాత్రలో నటించినట్లు కాకుండా పరకాయ ప్రవేశం చేసి అశేష తెలుగు ప్రజానీకం మనసుల్లో స్థానం సంపాదించారు.కానీ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడైన బాలకృష్ణ పోషించి తండ్రి నటనా కౌశల్యంలో పావు వంతు భాగం కూడా ప్రదర్శించక పోవటంతో సినీ ప్రేక్షకులతోపాటు నందమూరి అభిమానులను కూడా ఆకర్షించలేకపోయింది.

ఫిబ్రవరి మాసంలో రిలీజ్ అయిన బయోపిక్ సినిమా “యాత్ర “.డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రను ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన యాత్ర సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల మన్ననలను కూడా పొందింది.

వైయస్సార్ పాత్రలో నటించిన మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఆయన కట్టుబొట్లతో పాటు హావ భావాలను చక్కగా ప్రదర్శించడంతో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది.
ఈ నెలలోనే ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఆధారంగా రూపుదిద్దుకొని విడుదలైన మరో చిత్రమే “మహా నాయకుడు”.ఇది కథానాయకుడు మూవీకి రెండవ భాగంగా రామారావు యొక్క రాజకీయ జీవితాన్ని తెరపై ఆవిష్కరించే క్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలగని రీతిలో అసంపూర్తిగా చిత్రీకరించడంతో ప్రేక్షకులు తిరస్కరించారు.

మార్చి నెలలో వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ యొక్క “లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదలై సగటు తెలుగు ప్రేక్షకులతోపాటు వైసీపీ అభిమానులను కూడా ఆకట్టుకోలేక బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.ఈ సంవత్సర చివరాంతంలో రిలీజ్ అయిన “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” వంటి రాజకీయ ఊహాత్మక కథనంతో కొనసాగి మరో డిజాస్టర్ సినిమాగా మారడంతో రాజకీయ నేపథ్యంగా నిర్మించిన చిత్రాలలో “యాత్ర” సినిమా తన ప్రత్యేకతను చాటుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి