iDreamPost

Bhatti Vikramarka: భట్టి విక్రమార్క పూజ గదిలో YSR ఫోటో! ప్రమాణ స్వీకారానికి వెళ్తూ పూజలు!

Mallu Bhatti Vikramarka on YSR: భట్టి విక్రమార్క.. రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన పూజ గదిలోని వైఎస్సార్ ఫోటోకు నమష్కరించి..కార్యక్రమానికి బయలు దేరారు.

Mallu Bhatti Vikramarka on YSR: భట్టి విక్రమార్క.. రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన పూజ గదిలోని వైఎస్సార్ ఫోటోకు నమష్కరించి..కార్యక్రమానికి బయలు దేరారు.

Bhatti Vikramarka: భట్టి విక్రమార్క పూజ గదిలో YSR ఫోటో! ప్రమాణ స్వీకారానికి వెళ్తూ పూజలు!

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో విజయ దుంధూబి మోగించింది. నేడు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈయనతో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారిలో మధిర ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ప్రమాణస్వీకారానికి బయలుదేరే ముందు ఆయన ఇంట్లో  పూజలు నిర్వహించారు. పూజ గదిలో వైఎస్సార్ ఫోటో ఉన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గురువారం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణా స్వీకార కార్యక్రమం జరగనుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి బయలు దేరే ముందు భట్టి విక్రమార్క పూజ గదిలో దేవుళ్లకు నమష్కారం చేసి బయలు దేరారు. అయితే ఆ పూజ గదిలో దేవుళ్లతో పాటు దివంగత నేత వైఎస్సార్ ఫోటో ఉంది. ఆయన నమష్కరించిన భట్టి ప్రమాణస్వీకార కార్యక్రమానికి బయలు దేరారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఆయన మాట్లాడుతూ..”నేను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నాకు రోల్ మోడల్ గా ఉన్నారు. ఆయన దగ్గర నేను చీఫ్ విప్ గా కూడా పని చేశాను. వైఎస్సాఆర్ గారు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పడిన తపన నేను దగ్గర నుంచి చూశాను. నిజంగా వైఎస్సార్ గారు మాకు దైవం, మా రోల్ మోడల్. అదే విధంగా మేము కూడా ప్రజల కోసం నిరంతరం ఆలోచించి.. వారి సమస్యలను పరిష్కరించే విధంగా పని చేస్తాము.

మేము అందరం ప్రేమతో గెలిపించుకున్న ముఖ్యమంత్రి వైఎస్సార్ చూపిన మార్గంలో, ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. ఆయన ఎప్పుడు మాకు గురువులాంటి వారే.. మా ఆలోచనల్లో ఆయన ఉంటారు. ఇందిరమ్మ రాజ్యం రావాలి, పేద ప్రజలకు మేలు జరగాలని ఆయన మాకు ఎప్పుడు చెబుతుండే వారు. సంపూర్ణంగా ప్రజల కోసం తపన పడే నాయకుడిగా రాజశేఖర్ రెడ్డిని మేము దగ్గర నుంచి చూశాం. రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ మా పూజగదిలోనే కాదు మా గుండెల్లో  ఉంటారు” అని ఆయన తెలిపారు.

ఇదే సమయంలో తమపై ఉన్న బాధ్యత గురించి భట్టి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు..నీళ్లు,నిధులు,నియామకాలు, ఆత్మగౌరవం వంటివి ఏమైతే ఉన్నాయో వాటిని నిరవేర్చుకునే సమయం వచ్చిందని తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వంగా నిలబడబోతుందని,ఈ పాలనంతా ప్రజల కోసమే, రాష్ట్ర సంపదతో వారి కోసం అనేక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు, మాపై ఉన్న బాధ్యతను క్షణ క్షణం భయం పెట్టుకుని వారికి జవాబుదారి తనంగా ఉంటూ పని చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.

సామాన్య ప్రజల నుంచి భట్టి విక్రమార్క వంటి ఎంతో మంది సీనియర్ నేతల వరకు ఎందరో ఇళ్లల్లో, గుండెల్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న చాలా మంది నేతలు ఆయనను ఎంతో అభిమానించే వారే.  నేడు వైఎస్సార్ భౌతికంగా లేకపోయినప్పటికీ ఇలాంటి నేతల గుండెల్లో పదిలంగా ఉంటారు. అంతేకాక ఆయన ఆలోచనలను వీరు ఆచరణలో పెట్టి.. ముందుకు సాగనున్నారు. మరి.. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో నేతల వైఎస్సాఆర్ అంటే ప్రాణంగా అభిమానిస్తారు. మరి.. భట్టి విక్రమార్క ఇంట్లో చోటుచేసుకున్న ఆసక్తిర ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి