iDreamPost

ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నారు.. ఇది స్పోర్ట్స్ స్పిరిట్ అంటే..!

  • Published Mar 18, 2024 | 2:27 PMUpdated Mar 18, 2024 | 2:27 PM

ఆర్సీబీతో జరిగిన డబ్ల్యూపీఎల్-2024 ఫైనల్​లో ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఓడినా స్పోర్ట్స్ స్పిరిట్ అంటే ఏంటో చూపించింది క్యాపిటల్స్ టీమ్.

ఆర్సీబీతో జరిగిన డబ్ల్యూపీఎల్-2024 ఫైనల్​లో ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఓడినా స్పోర్ట్స్ స్పిరిట్ అంటే ఏంటో చూపించింది క్యాపిటల్స్ టీమ్.

  • Published Mar 18, 2024 | 2:27 PMUpdated Mar 18, 2024 | 2:27 PM
ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నారు.. ఇది స్పోర్ట్స్ స్పిరిట్ అంటే..!

ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్. నెగ్గితే టైటిల్ తమది అవుతుంది. లీగ్ దశ నుంచి ఫైనల్ ఫైట్ వరకు తిరుగులేని విజయాలతో ప్రత్యర్థులను భయపెట్టింది. ఇంకొక్క విక్టరీ కొడితే టోర్నీని సాఫీగా ముగించేది. కానీ లక్ కలసి రాలేదు. కప్పు కోసం కసిగా ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు నిలవలేకపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఫైనల్​లో ఫేవరెట్​గా కనిపించిన ఢిల్లీ.. స్మృతి సేన జోరును తట్టుకోలేక చతికిలపడింది. ఈ రెండు టీమ్స్ మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ ఫైట్​లో విజయం బెంగళూరును వరించింది. డబ్ల్యూపీఎల్-2024 విజేతగా ఆర్సీబీ అవతరించింది. సీజన్ మొత్తం అద్భుతంగా ఆడుతూ వచ్చిన ఢిల్లీ టీమ్ ప్లేయర్లు ఫైనల్​ ఓటమితో ఒక్కసారిగా నిరాశలో కూరుకుపోయారు. అయితే వాళ్లు తమ స్పోర్ట్స్ స్పిరిట్​ను చాటుకున్నారు.

ఫైనల్ మ్యాచ్​లో ఓడిపోగానే ఢిల్లీ ప్లేయర్లు అంతా నిరాశలో మునిగిపోయారు. ఆటగాళ్లతో పాటు ఆ టీమ్ మేనేజ్​మెంట్ ముఖాల్లోనూ బాధ కనిపించింది. కెప్టెన్ మెక్ లాన్నింగ్ అయితే ఓటమి బాధను తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంత బాగా ఆడినా, టీమ్​ను అద్భుతంగా నడిపించినా ట్రోఫీ చేజారడంతో ఆమె కన్నీటి పర్యంతం అయింది. లాన్నింగ్​ను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. ఆ టీమ్​లోని చాలా మంది ప్లేయర్లు ఇలాగే బాధతో కనిపించారు. అయితే ఆ బాధను గ్రౌండ్​కే పరిమితం చేశారు. టైటిల్ మిస్సయ్యామనే ఫీలింగ్​ వెంటాడుతున్నా స్పోర్ట్స్ స్పిరిట్​ను చూపించారు. తమను ఇంతగా ఆదరించినందుకు అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ ముగిశాక డ్రెస్సింగ్​ రూమ్​కు వెళ్లి సెలబ్రేట్ చేసుకున్నారు.

డ్రెస్సింగ్ రూమ్​కు వెళ్లే దారిలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు, టీమ్ మేనేజ్​మెంట్ అంతా కూర్చుకున్నారు. దారి మొత్తం ఒకరి పక్కన ఒకరు కలసి కూర్చున్నారు. టోర్నీ మొత్తం తమ జర్నీ ఎలా సాగిందో మాట్లాడుకున్నారు. కూల్​డ్రింక్స్ తాగుతూ, స్నాక్స్ తింటూ కాసేపు చిల్ అయ్యారు. కొందరు ప్లేయర్లు ఆటబొమ్మల్ని పట్టుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. మరికొందరు తమ సన్నిహితులతో ఫోన్​లో మాట్లాడుతూ కనిపించారు. క్యాపిటల్స్ ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్​లో సెలబ్రేషన్స్​లో మునిగిపోయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్ వాళ్లను మెచ్చుకుంటున్నారు. ఇది నిజమైన స్పోర్ట్స్ స్పిరిట్ అని.. ఓటమిని, గెలుపును ఒకేలా తీసుకోవడం సూపర్బ్ అని ప్రశంసిస్తున్నారు. వీళ్ల నుంచి యంగ్​స్టర్స్ నేర్చుకోవాలని, ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుందని, ఓడినా మళ్లీ నిలబడాలనేది క్యాపిటల్స్ ఇచ్చిన మెసేజ్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఓటమిని సెలబ్రేట్ చేసుకోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి