iDreamPost

కోహ్లీకి కొత్త పేరు పెట్టిన అనుష్క శర్మ.. ఇకపై ఆ పేరుతోనే..!

  • Author singhj Published - 09:05 PM, Mon - 23 October 23

వరల్డ్ కప్​లో సెన్సేషనల్ బ్యాటింగ్​తో దూసుకెళ్తున్నాడు టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. తాజాగా కివీస్​పై గెలుపులో అతడు కీలక పాత్ర పోషించాడు. వండర్​ఫుల్​ నాక్​తో మ్యాచ్​ను గెలిపించాడు. అలాంటి కోహ్లీకి అతడి భార్య అనుష్క శర్మ క్రేజీ నిక్ నేమ్ పెట్టింది. అదేంటంటే..!

వరల్డ్ కప్​లో సెన్సేషనల్ బ్యాటింగ్​తో దూసుకెళ్తున్నాడు టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. తాజాగా కివీస్​పై గెలుపులో అతడు కీలక పాత్ర పోషించాడు. వండర్​ఫుల్​ నాక్​తో మ్యాచ్​ను గెలిపించాడు. అలాంటి కోహ్లీకి అతడి భార్య అనుష్క శర్మ క్రేజీ నిక్ నేమ్ పెట్టింది. అదేంటంటే..!

  • Author singhj Published - 09:05 PM, Mon - 23 October 23
కోహ్లీకి కొత్త పేరు పెట్టిన అనుష్క శర్మ.. ఇకపై ఆ పేరుతోనే..!

వన్డే వరల్డ్ కప్​-2023లో టీమిండియా స్టార్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ తన తడాఖా ఏంటో చూపిస్తున్నాడు. వరుసగా అద్భుతమైన ఇన్నింగ్స్​లు ఆడుతూ కేక పుట్టిస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్​ నుంచి ఆదివారం న్యూజిలాండ్​తో మ్యాచ్ వరకు అదిరిపోయే ఇన్నింగ్స్​లు ఆడుతూ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఫస్ట్ మ్యాచ్​లో రెండు పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టైమ్​లో క్రీజులోకి వచ్చాడు కోహ్లీ. కేఎల్ రాహుల్ (97 నాటౌట్)తో కలసి విరాట్ (85) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత కింగ్ ఔటైనా హార్దిక్ పాండ్యా (11)తో కలసి మ్యాచ్​ను ఫినిష్ చేశాడు రాహుల్.

ఆఫ్ఘానిస్థాన్​తో మ్యాచ్​లో హాఫ్​ సెంచరీ బాదిన కోహ్లీ.. పాకిస్థాన్​ఫై మ్యాచ్​లో మాత్రం అనవసర షాట్ కొట్టి పెవిలియన్ చేరాడు. అయితే బంగ్లాదేశ్​తో జరిగిన తదుపరి మ్యాచ్​లో (103 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. న్యూజిలాండ్​తో మ్యాచ్​లోనూ అదే ఊపును కంటిన్యూ చేశాడు. ఈసారి సెంచరీ మార్క్​కు చేరుకోకపోయినా 95 రన్స్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తనను ఎందుకు ఛేజ్ మాస్టర్ అని అంటారో మరోమారు ప్రూవ్ చేసుకున్నాడు కింగ్ కోహ్లీ. ఈ మ్యాచ్​లో రవీంద్ర జడేజా (39 నాటౌట్)తో కలసి విరాట్ ఆడిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

భారత్​ను గెలిపించిన కోహ్లీ సెంచరీ మిస్ చేసుకోవడం కాస్త బాధాకరమనే చెప్పాలి. ఒకవేళ శతకం మార్క్​ను అందుకొని ఉంటే టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును సమం చేసేవాడు. ఫ్యాన్స్ కూడా కింగ్ ఈ ఫీట్ నమోదు చేస్తాడని అనుకున్నారు. కానీ వాళ్లకు నిరాశే ఎదురైంది. అభిమానులు బాధపడ్డా కోహ్లీ భార్య అనుష్క శర్మ మాత్రం భర్తను ప్రశంసల్లో ముంచెత్తింది. కివీస్​పై గెలిపించిన విరాట్​కు ఒక నిక్ నేమ్ కూడా పెట్టేసింది. ‘స్మార్ట్ ఛేజర్’ అని అనుష్క శర్మ తన ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​లో ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్​కు కోహ్లీ ఫొటోను యాడ్ చేసింది. నెట్టింట అనుష్క పోస్ట్ వైరల్ అవుతోంది. అనుష్క పెట్టిన పేరు బాగుందని.. ఇకపై విరాట్​ను ‘స్మార్ట్ ఛేజర్​’గా పిలుస్తామని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కోహ్లీకి అనుష్క పెట్టిన కొత్త పేరు మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: అనవసరంగా బుమ్రాను అంటున్నారు.. తప్పు అతడిది కాదు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి