iDreamPost

వరుసగా ఫెయిలవ్వడంపై స్పందించిన గిల్.. ఆ బాధతోనే అంటూ..!

  • Author singhj Published - 10:02 PM, Mon - 30 October 23

భారత స్టార్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ వరల్డ్ కప్​లో అంతగా రాణించడం లేదు. తన మీద ఫ్యాన్స్​ పెట్టుకున్న ఎక్స్​పెక్టేషన్స్​కు తగ్గట్లు అతడి బ్యాటింగ్ లేదు.

భారత స్టార్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ వరల్డ్ కప్​లో అంతగా రాణించడం లేదు. తన మీద ఫ్యాన్స్​ పెట్టుకున్న ఎక్స్​పెక్టేషన్స్​కు తగ్గట్లు అతడి బ్యాటింగ్ లేదు.

  • Author singhj Published - 10:02 PM, Mon - 30 October 23
వరుసగా ఫెయిలవ్వడంపై స్పందించిన గిల్.. ఆ బాధతోనే అంటూ..!

భారత క్రికెట్ టీమ్ వన్డే వరల్డ్ కప్​లో అదరగొడుతోంది. వరుస విజయాలతో సెమీస్ బెర్త్​ను ఖాయం చేసుకుంది రోహిత్ సేన. ఆడిన ఆరు మ్యాచుల్లోనూ నెగ్గి జైత్రయాత్రను కొనసాగిస్తోంది టీమిండియా. నెక్స్ట్ ఆడబోయే మూడు మ్యాచులు ఒకరకంగా భారత టీమ్​కు ప్రయోగాలు చేసేందుకు ఛాన్స్ అనే చెప్పాలి. ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిచేసుకొని సెమీఫైనల్ కల్లా రెడీగా ఉండాలి. అందుకోసం అవసరమైతే ఈ మ్యాచుల్లో కొందరికి రెస్ట్ ఇచ్చి.. బెంచ్ మీద ఉన్న ప్లేయర్లను పరీక్షించొచ్చు. వరుసగా విఫలమవుతున్న శ్రేయస్ అయ్యర్, శుబ్​మన్ గిల్​ను పక్కనపెట్టి ఇషాన్ కిషన్​కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఓపెనర్ శుబ్​మన్​ గిల్​ను టీమ్​లో నుంచి తీసేయాలని కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం అతడు ఫెయిల్ అవుతుండటమే. ఇప్పుడిప్పుడే టీమ్​లో సెటిల్ అవుతున్న గిల్​కు ఇదే ఫస్ట్ వరల్డ్ కప్​. ఎన్నో ఎక్స్​పెక్టేషన్స్​తో మెగా టోర్నీలోకి అడుగుపెట్టాడు గిల్. కానీ డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచుల్లో అతడు ఆడలేదు. ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో ఆడినా.. కేవలం బంగ్లాదేశ్​పై 53 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్​పై 16 పరుగులు, న్యూజిలాండ్ మీద 26 పరుగులు, ఇంగ్లండ్​పై 9 రన్స్ మాత్రమే చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ చెలరేగిపోతుంటే.. గిల్ కనీసం అతడికి తోడుగా నిలబడలేకపోతున్నాడు. అతడు ఇలాగే ఆడితే సెమీస్​లో భారత్​కు కష్టాలు తప్పవని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు.

డెంగ్యూ వల్లే గిల్ పెర్ఫార్మెన్స్ తగ్గిందని కొందరు అనలిస్టులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకు డెంగ్యూ ఎప్పుడు సోకిందో తెలియలేదన్నాడు. త్రివేండ్రంలో ప్రాక్టీస్ సందర్భంగా డెంగ్యూకు సంబంధించిన కొన్ని సింప్టమ్స్ బయటపడ్డాయని తెలిపాడు. తనకేమీ అర్థం కాలేదని.. డెంగ్యూ కారణంగా టీమ్​కు దూరమవ్వాల్సి వచ్చిందన్నాడు గిల్. ఇది తనను బాధించిందని.. డెంగ్యూ వల్ల సన్నబడ్డానని యంగ్ బ్యాటర్ పేర్కొన్నాడు. దాదాపు 6 కిలోల బరువు తగ్గానన్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమని గిల్ చెప్పుకొచ్చాడు. కన్​సిస్టెంట్​గా రాణిస్తేనే ఛాన్సులు వస్తాయని.. ఇది పెద్ద ఛాలెంజ్ అని వివరించాడు. మరి.. గిల్ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup 2023: పాక్ చెత్త పెర్ఫార్మెన్స్.. ఇంజమామ్ సంచలన నిర్ణయం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి