iDreamPost

ఆంధ్రప్రదేశ్‌ కోసం బ్యాట్‌ పట్టిన మాజీ ప్రధాని నెహ్రూ.. ఎప్పుడంటే

  • Published Nov 19, 2023 | 5:58 PMUpdated Nov 19, 2023 | 6:45 PM

ఇండియాలో క్రికెట్‌ మతంతో సమానం. ఇక బీసీసీఐ నేడు అ‍త్యంత ధనిక బోర్డుగా నిలిచింది. అయితే నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తీసుకున్న నిర్ణయం వల్లే నేడు ఇండియలో క్రికెట్‌ ఇంతలా అభివృద్ధి చెందింది అంటున్నారు. ఆ వివరాలు..

ఇండియాలో క్రికెట్‌ మతంతో సమానం. ఇక బీసీసీఐ నేడు అ‍త్యంత ధనిక బోర్డుగా నిలిచింది. అయితే నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తీసుకున్న నిర్ణయం వల్లే నేడు ఇండియలో క్రికెట్‌ ఇంతలా అభివృద్ధి చెందింది అంటున్నారు. ఆ వివరాలు..

  • Published Nov 19, 2023 | 5:58 PMUpdated Nov 19, 2023 | 6:45 PM
ఆంధ్రప్రదేశ్‌ కోసం బ్యాట్‌ పట్టిన మాజీ ప్రధాని నెహ్రూ.. ఎప్పుడంటే

నవంబర్‌ 19, ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. తుది పోరులో ఆస్ట్రేలియా, ఇండియా తలపడ్డాయి. టాస్‌ ఓడిన ఇండియా బ్యాటింగ్‌కు దిగింది. ఇక వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నేపథ్యంలో గతంలో చోటు చేసుకున్న అద్బుతమైన సంఘటనలు, నాటి రికార్డులను మరోసారి తెర మీదకు తెస్తున్నారు. అలానే బీసీసీఐ చరిత్రకు సంబంధించిన వార్తలు కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడంటే.. బీసీసీఐ ప్రపంచ క్రికెట్‌ బోర్డుల్లో అత్యంత ధనిక బోర్డుగా పేరు తెచ్చుకుంది. కానీ అది ఈ స్థాయికి చేరడానికి ఎన్నో సమస్యలని అధిగమించింది అంటూ గుర్తు చేసుకుంటున్నారు ఆనాటి క్రికెట్‌ అభిమానులు.

అంచెలంచెలుగా ఎదిగిన బీసీసీఐ.. నేడు ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ)ను శాసించగలిగే స్థాయిలో ఉంది. అయితే బీసీసీఐ ఇంత శక్తివంతంగా ఎదగడం వెనక.. భారత మొట్ట మొదటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ కృషి ఎంతో ఉందంటారు. ఆయన లేకపోయి ఉంటే బీసీసీఐకి అసలు ఐసీసీలో సభ్యత్వం ఉండేది కాదంట. అసలు ఇంతకు ఏం జరిగింది అంటే..

1947లో ఇండియాకు స్వతంత్రం వచ్చింది. కానీ రాజ్యంగం అమల్లోకి రాకపోవడం వల్ల గణతంత్ర దేశంగా మారలేదు. రాజ్యంగం అమల్లోకి వచ్చే వరకు బ్రిటీష్ చక్రవర్తిని రాజుగా అంగీకరించింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారాలని, బ్రిటిష్ రాచరికంతో అన్ని సంబంధాలను తెంచుకోవాలని భావించింది. ఇదే సమయంలో అప్పటి బ్రిటీష్‌ ప్రధాని క్లెమెంట్‌ అట్లీ.. ఇండియాను కామన్‌వెల్త్‌లో చేరాలని ప్రతిపాదించారు. అయితే కాంగ్రెస్‌ దీనికి అంగీకరించలేదు. కానీ నెహ్రూ మాత్రం భారతదేశాన్ని కామన్‌వెల్త్‌లో కొనసాగించడానికి అంగీకరించారు.

ఇండియన్‌ క్రికెట్‌ను కాపాడిన నెహ్రూ నిర్ణయం..

1948 జూలై 19న లార్డ్స్‌లో ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ (ప్రస్తుతం ఐసీసీ) సమావేశమైంది. ఆ సమయంలోనే భారతదేశం ఐసీసీలో సభ్యదేశంగా ఉండేందుకు ఆమోదం తెలిపింది. అయితే ఈ సభ్యత్వం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఐసీసీ భారత్ సభ్యత్వంపై పునారాలోచిస్తుంది. అలాగే బ్రిటీష్ కామన్వెల్త్‌లో లేని దేశాల సభ్యత్వం ముగుస్తుందని ఐసీసీ రూల్ 5లో పేర్కొంది. అప్పటికే ఇండియా కామన్‌వెల్త్‌లో చేరడంతో.. ఐసీసీలో భారత్‌కు సభ్యదేశంగా అవకాశం లభించింది.

ఆ తర్వాత 1950 జూన్‌లో ఐసీసీ సమావేశం అయ్యేనాటికి భారతదేశం రాజ్యాంగానికి ఆమోదం తెలిపింది. దాంతో బ్రిటిష్ రాచరికం ప్రభుత్వం ఇండియాపై ఎటువంటి అధికారాన్ని కలిగి ఉండకుండా.. కేవలం కామన్వెల్త్‌లో మాత్రమే ఇండియా సభ్య దేశంగా కొనసాగేలా చేయడంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. ఫలితంగా ఐసీసీ భారతదేశాన్ని శాశ్వత సభ్య దేశంగా చేసింది. నాడు నెహ్రూ ముందు చూపుతో తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా.. ప్రస్తుతం బీసీసీఐ ప్రపంచ క్రికెట్ బోర్డుల్లో అత్యంత ధనిక బోర్డుగా ప్రసిద్ధికెక్కడమే కాక.. ఐసీసీని శాసించే స్థాయికి ఎదిగింది.

ఏపీ కోసం బ్యాట్‌ పట్టిన నెహ్రూ..

సెప్టెంబర్ 1953లో నెహ్రూ ఏపీ కోసం బ్యాట్‌ పట్టారు. కెప్టెన్‌గా బరిలోకి దిగడమ మాత్రమే కాక కామెంట్రీ కూడా చెప్పారు. ఎందుకంటే.. ఈ ఏడాది సంభవించిన వరదల వల్ల బిహార్‌, ఏపీ, యూపీ తీవ్రంగా నష్టపోయాయి. వరదబాధితులను ఆదుకోవండ కోసం క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో నాడు జవహర్‌లాల్ నెహ్రూ ప్రైమ్‌ మినిస్టర్స్ ఎలెవన్‌కు కెప్టెన్‌గా ఉన్నారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ, నెహ్రూ ప్రొఫెషనల్ ప్లేయర్‌లా ఆడినట్లు బీబీసీ నివేదిక పేర్కొంది. 1905 నుంచి 1907 వరకు జవహర్‌లాల్ నెహ్రూ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హారోస్ పాఠశాలకు వెళ్లారు. ఆ సమయంలో క్రికెట్‌పై ఆసక్తి ఏర్పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి