iDreamPost

కోహ్లీ, రాహుల్ భార్యలపై హర్భజన్ షాకింగ్ కామెంట్స్.. సారీ చెప్పాలంటున్న ఫ్యాన్స్!

  • Author singhj Updated - 03:35 PM, Mon - 20 November 23

భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్​ భార్యలపై వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో అతడు సారీ చెప్పాలని విరాట్, రాహుల్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్​ భార్యలపై వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో అతడు సారీ చెప్పాలని విరాట్, రాహుల్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

  • Author singhj Updated - 03:35 PM, Mon - 20 November 23
కోహ్లీ, రాహుల్ భార్యలపై హర్భజన్ షాకింగ్ కామెంట్స్.. సారీ చెప్పాలంటున్న ఫ్యాన్స్!

లీగ్ స్టేజ్ నుంచి ఫైనల్ వరకు వరుస విజయాలతో వరల్డ్ కప్​పై ఎన్నో ఆశలు రేపింది టీమిండియా. అసలు భారత్​తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులు వణికిపోయే రేంజ్​లో ఆడింది. అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణిస్తూ ఎదురొచ్చిన ప్రతి అపోజిషన్ టీమ్​ను చిత్తు కింద ఓడిస్తూ కప్పు మనదేననే భరోసాను ఇచ్చింది. ఫైనల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే కొంత టెన్షన్​ నెలకొన్నా మనోళ్లు ఉన్న ఫామ్​లో వారిని ఓడించడం పెద్ద మ్యాటర్ కాదనిపించింది. అందుకే అభిమానులు ఈ సాలా కప్ నమ్దే అని చెబుతూ ఎంతో నమ్మకంగా కనిపించారు. కంగారూలను కంగారెత్తించి కప్పు కొట్టడం ఫిక్స్ అనుకున్నారు. మ్యాచ్ గెలుపు తర్వాత సెలబ్రేషన్స్ కోసం ముందు టపాసులు కూడా రెడీ చేసుకున్నారు. ఒక ప్రముఖ కంపెనీ సీఈవో అయితే టీమిండియా కప్పు గెలిస్తే తమ కస్టమర్లకు రూ.100 కోట్లు ఇస్తానని కూడా ప్రకటించారు. దీన్ని బట్టే కప్పుపై ఆశలు ఏ లెవల్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

కోట్లాది అభిమానుల ఆశలు, కప్పు గెలవడం పక్కా అనే పాజిటివ్ బజ్ మధ్య గ్రౌండ్​లోకి దిగిన టీమిండియా సరిగ్గా ఆడలేకపోయింది. మెగా టోర్నీ మొత్తం ఆడిన తీరుగానే ఆడితే కప్పు మన చేతికొచ్చేది. కానీ ఆ ఫామ్​ను కంటిన్యూ చేయడంలో ఫెయిలైంది. ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్​తో మ్యాచుల్లో ఒక దశలో వెనుకబడినా మన బౌలర్ల పెర్ఫార్మెన్స్ వల్ల అద్భుతంగా పుంజుకొని విజయం సాధించింది. కానీ ఈసారి బౌలర్లు అదే మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయారు. బ్యాటింగ్​లో సెంచరీల మీద సెంచరీలు, హాఫ్ సెంచరీలు కొడుతూ టోర్నమెంట్ మొత్తం హవా చూపించిన భారత స్టార్లు.. ఫైనల్లో మాత్రం చేతులెత్తేశారు. సెంచరీల సంగతి పక్కనబెడితే.. టీమిండియా ఇన్నింగ్స్​ 11 నుంచి 50 ఓవర్ల మధ్య కేవలం 4 ఫోర్లే వచ్చాయి. ఒక దశలో 70 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా నమోదవ్వలేదు.

పిచ్ కాస్త ట్రికీగా ఉన్నా పరుగులు ఈజీగా చేయొచ్చని రోహిత్ శర్మ, ట్రావిస్ హెడ్ నిరూపించారు. ఏ ఒక్క భారత స్టార్ బ్యాటర్ ఆఖరి వరకు ఆడినా స్కోరు 300 దాటేది. కానీ ఆ విషయంలో ఫెయిల్ అవ్వడం, బౌలర్లు మ్యాజిక్ రిపీట్ చేయలేకపోవడం, ఫీల్డింగ్ ప్లేస్​మెంట్స్ సరిగ్గా లేకపోవడం టీమిండియాను దెబ్బతీసింది. దీంతో భారత ఆటగాళ్లు, కోచ్ ద్రవిడ్ వ్యూహాలపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్​ల భార్యలు అనుష్క శర్మ, అతియా శెట్టిలపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఫైనల్ మ్యాచ్​ చూసేందుకు గ్రౌండ్​కు వచ్చారు అనుష్క, అతియా.

స్టాండ్స్​లో పక్కపక్కనే కూర్చున్న అనుష్క, అతియా వైపు పలుమార్లు కెమెరాలు ఫోకస్ చేశాయి. ఆ టైమ్​లో వీళ్లిద్దరూ ఏదో సీరియస్​గా మాట్లాడుతున్నట్లు కనిపించింది. అప్పుడు హిందీ కామెంట్రీ చేస్తున్న భజ్జీ వీళ్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. ‘క్రికెట్ గురించి కాదు.. సినిమాలు లేదా యాడ్స్ గురించే వీళ్లు మాట్లాడుతున్నారని అనుకుంటా. ఎందుకంటే వీళ్లకు క్రికెట్ గురించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు’ అని హర్భజన్ చెప్పాడు. దీంతో భజ్జీపై కోహ్లీ, రాహుల్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇవి మేల్ డామినేషన్ కామెంట్స్ అని అంటున్నారు. అనుష్క, అతియాకు అతడు సారీ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరి.. కోహ్లీ, రాహుల్ భార్యలను ఉద్దేశించి భజ్జీ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్ కప్ ఓడినా టీమిండియాకి భారీ మద్దతు! 48 ఏళ్లలో ఇదే తొలిసారి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి