iDreamPost

లాటరీ టికెట్ కొనకుండానే రూ. 3.4 కోట్లు గెలిచాడు

అదృష్టం ఎప్పుడు, ఎవరినీ, ఎలా వరిస్తుందో చెప్పలేం. రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసేస్తుంది. కడు పేద వాడిని మిలినీయర్ గా మార్చేస్తుంది లక్. లాటరీ టికెట్లలో బంపర్ ఫ్రైజ్ కొట్టి కోటీశ్వరులైనవారున్నారు. కానీ టికెట్ కొనకుండా..

అదృష్టం ఎప్పుడు, ఎవరినీ, ఎలా వరిస్తుందో చెప్పలేం. రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసేస్తుంది. కడు పేద వాడిని మిలినీయర్ గా మార్చేస్తుంది లక్. లాటరీ టికెట్లలో బంపర్ ఫ్రైజ్ కొట్టి కోటీశ్వరులైనవారున్నారు. కానీ టికెట్ కొనకుండా..

లాటరీ టికెట్ కొనకుండానే రూ. 3.4 కోట్లు గెలిచాడు

అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది.. కానీ దరిద్రం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుందనేది సామెత. కొంత మందిని చూస్తుంటే నిజమని అనిపించకమానదు. లక్ ఉంటే కొంత మంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతుంటారు. లక్ష్మిదేవి.. వారి ఇంట్లోకి చొరబడి సిరులు కురిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు కడుపునిండా తినడానికి లేని వారు సైతం.. జాక్ పాట్ కొడితే.. నక్క తోక తొక్కినట్లే లెక్క. లక్షాధికారి, కరోడ్ పతి అయిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా లాటరీ టికెట్, బెట్టింగ్ యాప్స్, లక్కీ డ్రా ద్వారా ధనలక్ష్మీ కొంత మంది లక్కీ ఫెలోస్‌ ను వరిస్తుంది. మరి ఏ లాటరీ టికెట్ కొనకుండా ఓ వ్యక్తి కోటీశ్వరుడు అయిపోయారంటే నమ్ముతారా.. కానీ ఓ వ్యక్తి ఏకంగా రూ.3.4 కోట్లు బంపర్ ప్రైజ్ కొల్లగొట్టాడు.

ఎప్పుడు, ఎవరిని, ఎలా అదృష్టం వరిస్తుందో చెప్పలేం అనడానికి ఈ వ్యక్తే నిదర్శనం. 67 ఏళ్ల వయస్సులో అతడిని లక్ష్మీదేవి కటాక్షించింది. అమెరికాలోని మిచ్ గావ్ ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి ఏ లాటరీ టికెట్ కొనకుండానే జాక్ పాట్ కొట్టేశాడు. సుమారు 4 లక్షల డాలర్లు అనగా భారత కరెన్సీలో రూ. 3.4 కోట్లను గెలుచుకున్నాడు. ఎలా అంటారా.. ఆన్ లైన్ గేమ్స్ అతడిని కోటీశ్వరుడిని చేశాయి. ఆన్ లైన్ గేమ్స్ లో డబ్బులు పోగొట్టుకోవడమే తెలుసు కానీ.. ఇంతలా డబ్బులు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. పేరు చెప్పేందుకు నిరాకరించిన ఆ వ్యక్తి.. ఆన్ లైన్ గేమ్ ఆడుతూ తెలియకుండానే స్టేట్ సెకండ్ ఛాన్స్ ఎంట్రీలు పొందాడు. అక్టోబర్ 11న అనుకోకుండా డ్రాయింగ్ లో రూ. 3.46 కోట్లు గెలుచుకున్నాడు.

ఇలా గెలుచుకున్నట్లు మిచిగాన్ లాటరీ నుండి ఈ మెయిల్ కూడా వచ్చింది. అయితే తాను ఎటువంటి లాటరీ టికెట్ కూడా కొనలేదు కదా అన్న అనుమానం ఏర్పడింది. ఇదొక స్కామ్ అని భావించాడు. నాకు ఇంత డబ్బులు రావడం ఏంటన్న సందేహం వ్యక్తం చేశాడు. ఆ మెయిల్ డిలీట్ చేద్దామని కూడా ఫిక్స్ అయిపోయాడు. ఆ మెయిల్ ఏంటీ, ఎక్కడ నుండి వచ్చిందని తనిఖీ చేయగా.. చెకింగ్ లో అది ఫేక్ కాదని తేలింది. ఎప్పుడు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుకుంటూ బతికేస్తున్న ఇతగాడికి.. కొందరు సెకండ్ ఛాన్స్ డ్రా కోసం ఎంట్రీలు ఇచ్చారని తెలుసుకోలేకపోయారు. చివరకు లాటరీ టికెట్ కొనకుండానే జాక్ పాట్ కొట్టేసరికి.. ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నాడు. డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి లాటరీ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించాడు. ఆ మొత్తం కుటుంబానికి కొంత కేటాయించి, మిగిలినది సేవ్ చేసుకుంటున్నానని చెప్పాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి