iDreamPost

మందుబాబులకి బ్యాడ్ న్యూస్.. రేపు మద్యం దుకాణాలు బంద్!

నేటికాలంలో మద్యానికి బానిసగా మారిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కొందరికి మద్యం తాగనిదే రోజు గడవదు. నిత్యం వైన్స్ షాపుల ముందే కనిపిస్తుంటారు. ఇలాంటి మందుబాబులకు ఓ బ్యాడ్ న్యూస్.

నేటికాలంలో మద్యానికి బానిసగా మారిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కొందరికి మద్యం తాగనిదే రోజు గడవదు. నిత్యం వైన్స్ షాపుల ముందే కనిపిస్తుంటారు. ఇలాంటి మందుబాబులకు ఓ బ్యాడ్ న్యూస్.

మందుబాబులకి బ్యాడ్ న్యూస్.. రేపు మద్యం దుకాణాలు బంద్!

చాలా మందికి మద్యం తాగే అలవాటు ఉంటుంది. రోజూ చుక్క మందు పడనిదే నిద్రపోనీ వారు ఎందరో ఉన్నారు. ఇక ఆదివారం, సెలవు దినాలు వచ్చాయంటే వారికి మాత్రం ముక్కా,చుక్కా ఉండాల్సిందే. సెలవుల టైమ్ లో చాలా మంది నాన్ వెజ్, మందుతో ఎంజాయ్ చేస్తారు. ఇలా రేపు కూడా అలానే ఎంజాయ్ చేద్దామనుకుంటున్నా మందు బాబులకు ఓ బ్యాడ్ న్యూస్. శుక్రవారం నాడు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు మూతపడనున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26న రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. అలాగే మాంసం దుకాణాలు  కూడా మూతపడనున్నాయి. తిరిగి శనివారం వైన్ షాపులు, మాంసం దుకాణాలు తెరుచుకోనున్నాయి. దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న డ్రైడేగా పరిగణిస్తారు. కాగా రేపు బంద్ ఉండటంతో ఇవాళ మద్యం దుకాణాల వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తూ ఎవరైనా మద్యం షాపులు తెరిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇలా జాతీయ పర్వదినాలైన జనవరి 26, ఆగష్టు 15, గాంధీ జయంతి సందర్భాల్లో దుకాణాలు మూసివేసే సంగతి తెలిసిందే. వీటితో పాటు మాంసం షాపులు సైతం క్లోజ్ లో ఉంటాయి. అలానే రేపు గణతంత్ర దినోత్సవం కావడంతో మద్యం షాపులు మూతపడనున్నాయి. దీంతో గురువారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాల వద్ద మందుబాబు బారులు బారులు తీరారు. పలు మద్యం షాపు వద్ద భారీ రద్దీ ఏర్పడింది. ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు అలంకరించబడ్డాయి. రేపు వివిధ ప్రభుత్వ ఆఫీసులు, పాఠశాలల్లో జాతీయ జెండ ఎగరవేయనున్నారు. అలానే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గణతంత్ర దినోత్సవ వేడుక కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. ఢిల్లీలో సైతం రిపబ్లిక్ డే వేడుకల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి