iDreamPost

Gopala Gopala : శివుడి నెగటివ్ సెంటిమెంట్ ని దాటేయాలి

Gopala Gopala : శివుడి నెగటివ్ సెంటిమెంట్ ని దాటేయాలి

పవన్ కళ్యాణ్ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల గుర్తుందిగా. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఓ మై గాడ్ రీమేక్ గా రూపొందిన ఈ డిఫరెంట్ ఎంటర్టైనర్ ఒరిజినల్ వెర్షన్ స్థాయిలో విజయం సాధించలేదు కానీ డీసెంట్ మల్టీ స్టారర్ గా పేరు తెచ్చుకుంది. పవన్ వెంకీ సీన్స్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు హిందీలో ఓ మై గాడ్ 2 రూపొందుతోంది. నిన్నే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. మొదటి భాగంలో నాస్తికుడిగా నటించిన పరేష్ రావల్ ఇందులో చేయడం లేదు. తన స్థానంలో పంకజ్ త్రిపాఠిని తీసుకొచ్చారు. ఈసారి దేవుడు శివుడు. ఆ గెటప్ లో నిన్న అక్షయ్ కుమార్ ఫేస్ ని పోస్టర్ లో రివీల్ చేశారు. షూటింగ్ కూడా మొదలైపోయింది.

ఒకవేళ ఇప్పుడీ ఓ మై గాడ్ 2 కూడా హిట్ అయితే గోపాల గోపాల సీక్వెల్ ఇక్కడా తీస్తారా అనే చర్చ మొదలైంది. కానీ ఇప్పుడు గాడ్ మారిపోయాడు కాబట్టి టైటిల్ కూడా మార్చాల్సి ఉంటుంది. అయితే శివుడి పాత్రలకు సంబంధించి టాలీవుడ్ లో భయంతో కూడిన ఒక నెగటివ్ సెంటిమెంట్ ఉంది. అదేమంటే హీరోలు శివుడి వేషం వేయడం కానీ లేదా శివుడే కథలో కీలక పాత్ర కావడం కానీ చేస్తే ఆ సినిమాలు అంతగా విజయం సాధించవు. ఎన్టీఆర్ దక్షయజ్ఞం, చిరంజీవి శ్రీమంజునాథ అదే కోవలోకి వస్తాయి. నాగార్జున డమరుకంలో ప్రకాష్ రాజ్ ని శివుడిగా చూపించడం వర్కౌట్ కాలేదు. అంజిలోనూ శివుడి రిఫరెన్స్ పనిచేయలేదు

ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఓ మై గాడ్ హిట్ అయ్యాక ఇదంతా చర్చలోకి వస్తుంది కానీ అక్షయ్ కుమార్ విషయం లేనిదే ఓకే చెప్పే రకం కాదు కాబట్టి అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. మెగా బ్రదర్స్ చిరు పవన్ లు వరుసగా రీమేకులు చేస్తూ కామెంట్ల బారిన పడుతున్న తరుణంలో మరో సినిమాకు పవర్ స్టార్ ఒప్పుకుంటాడా అనేది వేచి చూడాలి. ఏ స్టార్ హీరో లేనంత బిజీగా ఉన్న అక్షయ్ కుమార్ మూడేళ్ళ వరకు తన డైరీని ఖాళీ లేకుండా పెట్టేసుకున్నారు. ఈ ఏడాది బెల్ బాటమ్ వచ్చేసింది. 2022లో కనీసం అయిదు సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అందులో ధనుష్ తో కలిసి నటించిన ఓటిటి రిలీజ్ కూడా ఉంది

Also Read : Meenakshi Chaudhary : స్టార్ హీరోలకు జోడిగా వరుస ఆఫర్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి