iDreamPost
android-app
ios-app

Sai Pallavi: రామాయణ.. సాయి పల్లవికి రికార్డ్ స్థాయి రెమ్యూనరేషన్.. అన్ని కోట్లా?

  • Published Apr 13, 2024 | 8:04 AM Updated Updated Apr 13, 2024 | 8:04 AM

సాయి పల్లవి బాలీవుడ్ రామాయణ సినిమాలో సీత పాత్రలో యాక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిదే. ఈ పాత్ర కోసం ఈ బ్యూటీ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఆ వివరాలు..

సాయి పల్లవి బాలీవుడ్ రామాయణ సినిమాలో సీత పాత్రలో యాక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిదే. ఈ పాత్ర కోసం ఈ బ్యూటీ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఆ వివరాలు..

  • Published Apr 13, 2024 | 8:04 AMUpdated Apr 13, 2024 | 8:04 AM
Sai Pallavi: రామాయణ.. సాయి పల్లవికి రికార్డ్ స్థాయి రెమ్యూనరేషన్.. అన్ని కోట్లా?

సినిమా ఇండస్ట్రీలో ఆడవారిని కాస్త తక్కువ చేసి చూస్తారనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉందో. కేవలం వారిని ఓ బొమ్మలా ట్రీట్ చేస్తారని.. కలర్ బాగుండి.. స్లిమ్ గా ఉంటే చాలని భావిస్తారు. ఇక పరిశ్రమలో రాణించాలంటే కొన్ని అంశాల్లో తప్పనిసరిగా వారు చెప్పినట్లే వినాలి. దానిలో ముఖ్యమైనది ముఖానికి కిలోల కొద్ది మేకప్ దట్టించుకోవాలి. కానీ కొందరు హీరోయిన్ ల విషయంలో ఇలాంటి నిబంధనలు ఏవి పని చేయవు. వారికి కథ నచ్చితేనే సినిమా చేస్తారు.. లేదంటే కామ్ గా ఉంటారు తప్పితే.. హీరోయిన్ అవకాశాల కోసం అడ్డమైన రూల్స్ పాటించారు.

ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది హీరోయిన్ సాయి పల్లవి. కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంది అంటేనే సినిమా యాక్సెప్ట్ చేస్తుంది. మేకప్ లేకుండా నటిస్తుంది. ఇక డ్యాన్స్ విషయంలో సాయి పల్లవి.. నెమలితో పోటీ పడుతుంది అంటే అతిశయోక్తి కాదు. అందం, డ్యాన్స్, అభినయం అన్ని ఉన్నాయి. ఇండస్ట్రీలో ఆమెది సెపరేట్ దారి. పాత్ర నచ్చితే రెమ్యూనరేషన్ గురించి కూడా పట్టించుకోదు. తనకు మంచి పాత్రలు కావాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Sai Pallavi

తండేల్ తో పాటు.. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ సినిమాలో కూడా సాయి పల్లవి నటిస్తోంది. సీత పాత్రలో కనిపించనుంది. ఈ క్రమంలో రామాయణ సినిమాకు సంబంధించి సాయి పల్లవి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా కోసం ఈ బ్యూటీ బాగానే డిమాండ్ చేసిందట. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సాయిపల్లవి రామాయణ కోసం ఏకంగా 15 కోట్లు తీసుకుంటుంది అని టాక్.

రామాయణ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తుండటంతో.. సాయిపల్లవి.. 3 పార్ట్స్ కి కలిపి రూ.10-15 కోట్ల వరకు తీసుకుంటుందని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం పారితోషికం విషయంలో సాయి పల్లవి.. నయనతారని దాటేసి రికార్డ్ సృష్టించినట్లే. సీత పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్టానే తన పారితోషికాన్ని సాయిపల్లవి అమాంతం పెంచేసిందని అంటున్నారు. బాలీవుడ్ రామాయణ సినిమాలో రణ్ బీర్, యష్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.

Sai Pallavi

‘ప్రేమమ్’ అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి.. ఆ తర్వాత ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తూ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. చివరగా ‘విరాటపర్వం’లో కనిపించింది. ఇది వచ్చి నాలుగేళ్లుపైనే అయిపోయింది. అయితే గత రెండేళ్లుగా నటనకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యే మళ్లీ బిజీగా మారుతోంది. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తున్న సాయిపల్లవి.. హిందీలో ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న సినిమా చేస్తోంది.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet GirişJojobet GirişJojobet Güncel GirişMarsbahisJojobet