iDreamPost

Rana Daggubati’s Virata Parvam విరాటపర్వం విముక్తికి ఫ్యాన్స్ డిమాండ్

Rana Daggubati’s Virata Parvam విరాటపర్వం విముక్తికి ఫ్యాన్స్ డిమాండ్

కరోనా రెండు వేవ్స్ వల్ల విపరీతంగా వాయిదాలు పడుతూ వచ్చిన సినిమాలు దాదాపుగా రిలీజైపోయాయి. ఆర్ఆర్ఆర్ ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. KGF2 బ్లాక్ బస్టర్ కొట్టేసింది. గని అడ్రెస్ లేకుండా పోయింది. అఖండ అదరగొట్టింది. నారప్ప, దృశ్యం 2లు ఓటిటిలో వచ్చేశాయి. ఇలా అన్నీ తమ తమ రేంజ్ కు తగ్గట్టు బిజినెస్ లు, వసూళ్లు రాబట్టుకున్నాయి. ఆచార్య(Acharya) కూడా వచ్చే వారం ఫలితం తెలిసిపోతుంది.ఇక నెక్స్ట్ మిగిలింది విరాట పర్వం ఒక్కటే. రానా సాయిపల్లవి కాంబినేషన్ లో వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామా గురించి అప్ డేట్ ఇచ్చి చాలా కాలం అయ్యింది. కనీసం ఓటిటి సూచనలు కనిపించడం లేదు.

ఏ ఒక్కరు దీని గురించి మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. షూటింగ్ అయిపోయిందన్నారు. చిన్న టీజర్ వదిలారు కానీ ట్రైలర్ ఊసు లేదు. రెండు మూడు పాటలు వదిలాక మొత్తం సైలెన్స్. సంగీత దర్శకుడు మారాడని ప్రచారం జరిగింది. అది నిజమా కాదా అనేది నిర్ధారణ కాలేదు . నక్సల్ బ్యాక్ డ్రాప్ లో వేణు దీన్ని తీయడం పట్ల కమర్షియల్ గా ఎంత మేరకు వర్కౌట్ అవుతుందనే అనుమానాలు అభిమానుల్లో లేకపోలేదు. పోనీ భీమ్లా నాయక్ తర్వాత అయినా వదులుతారేమో అనుకుంటే అదీ జరగలేదు. ఇంతకీ ఈ సినిమాను ల్యాబ్ లోనే మగ్గిపోయేలా చేస్తారా లేక బయటికి తీసుకొస్తారా అనేది సస్పెన్స్ గా నిలిచిపోయింది.

సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్దసంస్థ భాగస్వామ్యం ఉన్న విరాటపర్వంకు ఇలా జరగడం విచిత్రమే. స్వయానా ఆయన అబ్బాయి సినిమా గురించి సురేష్ బాబు నిర్లిప్తంగా ఉండటం చూస్తే తెరవెనుక ఏదో మతలబు అనిపించకమానదు. దీనికంటే చాలా ఆలస్యంగా మొదలైన ఎన్నో సినిమాలు శుభ్రంగా రిలీజ్ చేసుకుని డిజిటల్ శాటిలైట్ లో కూడా వచ్చేశాయి. కానీ మంచి క్యాస్టింగ్ (Sai Pallavi) ఉన్నప్పటికీ ఇలాంటి అనూహ్య పరిణామం తలెత్తడం ఫ్యాన్స్ కి ఇబ్బంది కలిగించేదే. 2022లో సగం ఏడాది గడిచిపోవొస్తోంది. మరి ఇప్పటికైనా మేల్కొని దగ్గుబాటి అభిమానులకు రిలీఫ్ ఇస్తారో లేక పుణ్యకాలం మొత్తం గడిపేస్తారో చూడాలి

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి