iDreamPost

Bangarraju : నాగ్ చైతూల కెరీర్ బెస్ట్ అవుతుందా

Bangarraju : నాగ్ చైతూల కెరీర్ బెస్ట్ అవుతుందా

పాన్ ఇండియా సినిమాల మధ్య రావడం అవసరమా అనే కామెంట్ నుంచి అబ్బా భలే టైమింగ్ లో వస్తున్నాడనే ప్రశంస దాకా నాగార్జున బంగార్రాజుకు సుడి బాగా కలిసి వస్తోంది. ఇవాళ రిలీజ్ డేట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించబోతున్నారు. జనవరి 14 దాదాపు కన్ఫర్మ్. ఒకవేళ అనూహ్యమైన చివరి నిమిషం మార్పు ఏదైనా ఉంటే ఓ రెండు మూడు రోజులు ముందు రావొచ్చు అంతే. రాధే శ్యామ్ ఇవాళ అధికారికంగా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవడంతో బంగార్రాజుకి చాలా ప్లస్ కానుంది. అజిత్ వలిమై రావడం డౌటే. తమిళనాడులో పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో ఆంక్షలు పెరుగుతున్నాయి.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు బంగార్రాజు సుమారు 40 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటున్నట్టు తెలిసింది. ముందు అనుకున్న రేట్ల కన్నా డిమాండ్ ని బట్టి జీ మరియు అన్నపూర్ణ సంస్థలు ఎక్కువ అడుగుతున్నారట. అయినా డిస్ట్రిబ్యూటర్లు వెనుకాడటం లేదు. ఎంతైనా సరే పర్లేదు అంటున్నారు. పండగ బరిలో అయిదారు మీడియం సినిమాలు ఉన్నప్పటికీ బజ్ ఉన్నది బంగార్రాజు ఒక్కదానికే. యావరేజ్ టాక్ వచ్చినా చాలు థియేటర్లు కిటకిటలాడతాయి. ఒకవేళ సోగ్గాడే చిన్ని నాయనా లాగా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే ఏకంగా వంద కోట్ల గ్రాస్ ని టార్గెట్ చేసినా ఆశ్చర్యం లేదు

ఇవన్నీ చూస్తూ అక్కినేని అభిమానుల ఆనందం మాములుగా లేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికైతే అంతా బాగానే ఉంది కానీ కేసులు పెరిగితే మాత్రం మళ్ళీ రిస్క్ ఉంటుంది. ప్రస్తుతానికి ఎలాంటి లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు, ఆంక్షలు లేవు కానీ పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడులో ఇవి వచ్చినప్పుడు మనదగ్గరికి రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఒకవేళ ఇక్కడ పరిస్థితి మాములుగానే ఉంటే బంగార్రాజు నాగార్జున నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయం. కాకపోతే అది థియేటర్లు నాలుగు షోలతో ఎలాంటి నిబంధనలు లేకుండా రన్ అయితేనే సాధ్యమవుతుంది. చూడాలి మరి

Also Read : Pushpa On Prime : తగ్గేదేలే అనేసిన అమెజాన్ ప్రైమ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి