iDreamPost

Guntur Kaaram: గుంటూరు కారం సినిమా మీద ఎందుకింత వ్యతిరేకత?

సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసిన చిత్రం "గుంటూరు కారం". అయితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదట్లో కాస్త నెగెటివ్ టాక్ సంపాదించినా.. రోజులు గడిచే కొద్ది భారీ కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంటుంది.

సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసిన చిత్రం "గుంటూరు కారం". అయితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదట్లో కాస్త నెగెటివ్ టాక్ సంపాదించినా.. రోజులు గడిచే కొద్ది భారీ కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంటుంది.

Guntur Kaaram: గుంటూరు కారం సినిమా మీద ఎందుకింత వ్యతిరేకత?

ఓకే.. ఊహించినట్టుగా లేదని అభిమానులు నిరాశపడొచ్చు. కథలో దమ్ములేదని వ్యాఖ్యానాలు వెల్లువెత్తచ్చు. పాటలు చెత్తగా ఉన్నాయని మండి పడొచ్చు. ఏవో ఇలాంటి కారణాలు కొన్ని గుంటూరు కారం చిత్రం విడుదలకు ముందు నుంచే చుట్టూ విషవలయంలా కమ్ముకొచ్చాయి. దీనికి ప్రధాన కారణం ఆ బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్ సంస్ధకి ఉన్న రేంజ్ వల్ల, దాని నుంచి వస్తున్న సినిమా ఏదో ఆకాశాన్ని బద్దలు కొట్టెస్తుందన్న పిచ్చి ఊహాగానాలు.. చాలా వరకూ గుంటూరు కారం సినిమా విడుదల రోజున ఉవ్వెత్తున్న ఎగసిపడ్డాయి. ముఖ్యంగా ముందునుంచి కూడా ఎందుకో గుంటూరు కారం చిత్రం విపరీతమైన కాంట్రవర్సీలు సోషల్ మీడియాలో చెలరేగిపోయాయి. వాటన్నిటినీ దాటుకుని మొత్తానికి గుంటూరు కారం ఘాటు సెగల మధ్యన సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.

ముందు రోజు నుంచే ప్రీమియర్లు నడిచిన హనుమాన్ కి ప్రపంచవ్యాప్తంగా సాలిడ్ టాక్ రావడంతో.. రిలీజురోజున అంటే జనవరి 12 దానితో పాటుగా రిలీజైన గుంటూరు కారం కొంత వెలితిని అనుభవించిన మాట వాస్తవం. పైగా, గుంటూరు కారం చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. హనుమాన్ సినిమాకి ధియేటర్లు దొరక్కుండా చేసేశారనే వార్త దావానంలా వ్యాపించేసింది. దాంతో హనుమాన్ మీద హద్దుమాలిన సింపతీ ఒకటి ప్లస్ అయింది. ముందురోజు ప్రీమియర్ టాక్ తో 12న రిలీజైన హనుమాన్ కు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అలాగని గుంటూరు కారంకే తక్కువ జరగలేదు. మొదటిరోజు వసూళ్ళతో ఒక ప్రాంతీయ చిత్రానికి తొలిరోజు వసూళ్ళతో గుంటూరు కారం కొత్త రికార్డును తెచ్చి పెట్టింది.

ఇంక వివరాలలోకి వెళ్తే, ఇప్పటికే 80శాతం రికవరీతో గుంటూరు కారం నిన్నటివరకూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక్క క్రిష్ణా జిల్లాకే నిన్నటి లెక్కలు ప్రకారం 5కోట్ల 50లక్షలు వసూలే చేసిందంటే గుంటూరు కారం దమ్ము ఏంటో కొత్తగా ఎవరికీ చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో ఏ లావాదేవీలు లేని నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు కూడా గుంటూరు కారం స్టాటస్టిక్స్ గురించి అలవోకగా వల్లెవేసి, గుంటూరు కారం సినిమా గట్స్ ను తేటతెల్లం చేస్తున్నారు. కానీ కొందరు పనిగట్టుకుని గుంటూరు కారం చిత్రాన్ని అన్యాయంగా మోసెస్తున్నారు. రిలీజు రోజునే చిత్ర నిర్మాత నాగవంశీతో కలసి మీడియా ముందుకు వచ్చిన దిల్ రాజు చెప్పనే చెప్పారు. కొన్ని చోట్ల నెగెటివ్ టాక్ ఉందని, కాకపోతే ఇది పాజిటివ్ గా మారడానికి కొంత టైం పడుతుందని, తప్పకుండా గుంటూరు కారం సినిమా ట్రేడ్ అంచనాల పరంగా గట్టి పోటీనే ఇస్తుందని ఆయన వివరించారు. ఆయన చెప్పినట్టుగానే గుంటూరు కారం ఘాటు ఏమాత్రం తగ్గలేదు. సెగలు వాడిపోలేదు.

కాకపోతే, అంచనాలు ఎప్పుడూ ఏ సినిమాకైనా మైనస్సే. అదే జరిగింది గుంటూరు కారం సినిమాకి. ముఖ్యంగా తమన్ సంగీతం అందరి ప్రయత్నం మీద నీళ్లు పోసింది. ఏదో అల వైకుంఠపురం మేజిక్ రిపీట్ అవుతుందని దర్శకుడు త్రివిక్రమ్ అనుకుని ఉండొచ్చు గానీ, అదే కొంప ముంచింది చివరికి. పాటలు గానీ బాగుండి ఉంటే గుంటూరు కారం ఘాటు ఎవ్వరూ తట్టుకోలేకపోయేవారు. అయినప్పటికీ హీరోగా మహేష్ బాబు స్టామినా ఒక్కటే సినిమాకి తిరుగులేని హెల్స్ చేసింది. దానాదీనా గుంటూరు కారం సినిమాకి అందరూ విమర్శిస్తూన్నట్టుగా కాకుండా, ఏ ఢోకా లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి