iDreamPost

టీజీ వెంకటేష్ కు ఏమి కావాలి?

టీజీ వెంకటేష్ కు ఏమి కావాలి?

అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌తో సాగిపోవాల్సిన చోట ఎందుకీ ఉద్య‌మాలు.. అభివృద్ధి చేసే నాయ‌కుడొచ్చాక ఎందుకీ రెచ్చ‌గొట్టే పోరాటాలు.. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు క‌ళ్లుగా సాగ‌బోతున్న త‌రుణంలో నేత‌లు మాట‌లు కోట‌లు దాట‌డమెందుకోసం..

విభ‌జ‌న అనంత‌రం ఏర్ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అభివృద్ధి చేయాల్సిన బాధ్య‌త పాల‌కుల‌పై ఉంది. 2014లో ఇందుకోస‌మే సీనియ‌ర్ అయిన చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టి ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. దీని ప్ర‌తిఫ‌లంగా ఐదేళ్ల కాలంలో చంద్ర‌బాబు పాల‌న ఎలాంటిదో ప్ర‌జ‌ల‌కు రుచి చూపించారు. ప్ర‌ధానంగా కరువు ప్రాంత‌మైన రాయ‌ల‌సీమ‌పై ఎంత శ్ర‌ద్ధ తీసుకున్నారో సీమ వాసుల‌ని క‌దిలిస్తే క‌థ‌లుగా చెబుతారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉండి అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేయాల్సింది పోయి ప‌క్ష‌పాత ధోర‌ణితో కేవ‌లం త‌న‌కు కావాల్సిన చోట్ల కోట్లాది రూపాయ‌లు దోచుకునేందుకు అమ‌రావ‌తి పేరుతో బాబు చేసిన బండారం మొత్తం ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది.

Read Also: ఎవరి కోసం ఈ ముట్టడి?

ఇలాంటి స‌మ‌యంలో అభివృద్ధి చేసేందుకు భారీ మెజార్టీతో స‌రైన నాయ‌కుడిని ఎన్నుకున్నారు ప్ర‌జ‌లు. నాయ‌కుడెవ‌రైనా ప్రాంతమేదైనా ప్ర‌జ‌ల‌కు కావాల్సిందంతా అభివృద్ధి ఒక్క‌టే. ఇందుకోసం ప్రాంతాల వారీగా నాయ‌కులు విడిపోవాల్సిన ప‌నిలేదు. అభివృద్ధి కోసం ప్ర‌భుత్వంతో పోరాటం చేయాలి త‌ప్ప అడ్డంకులు సృష్టించ‌కూడ‌దు. ఇదంతా ఎందుకంటే స‌రిగ్గా ఇప్పుడు ఇదే జ‌రుగుతోంది రాష్ట్రంలో. అన్ని జిల్లాల‌ను అభివృద్ధి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ చెబుతుంటే కేవ‌లం అమ‌రావ‌తిలోనే అభివృద్ధి చేయాలంటూ చంద్ర‌బాబు చేస్తున్న పోరాటాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో రాయ‌ల‌సీమ నేత‌లు సైతం త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నారు. ముందే వెనుక‌బ‌డిన ప్రాంతం కావ‌డంతో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌తో ముందుకు పోతామంటున్న అధికార పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వాల్సింది పోయి మ‌రో ఉద్య‌మానికి తెర‌లేపుతామంటున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల‌ను క‌లుపుకొని గ్రేట‌ర్ రాయ‌లసీమ ఉద్య‌మం పుట్టుకొస్తుందంటు సీమ నేత‌, ఎంపి టి.జి వెంక‌టేష్ వ్యాఖ్యానించ‌డం విడ్డూరంగా ఉంది.

Read Also: అనుకున్న‌దొక‌టి..అయ్యిందొక‌టి

1999 రాజకీయ రంగప్రవేశం నాటి నుంచి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉన్న టీజీ వెంకటేష్ 2014లో రాయలసీమ,ఉత్తరాంధ్ర పోరాట సమితి అని ఒక సంఘాన్ని లక్షల పెట్టి కరపత్రాలు పంచాడు. ఆయనకు వెనకబడినప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నారని ప్రజలు అనుకునేలా ప్రచారం చేసాడు.

చంద్రబాబు అన్యాయం చేసాడని,జగన్ న్యాయం చేస్తాడని ప్రజలు విశ్వసించటం వలెనే వైసీపీ కి మొన్న ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చారు. రాయ‌ల‌సీమ‌లో 52 స్థానాలకు గాను కేవలం మూడు,ఉత్తరాంధ్రలో 34 స్థానాలకు గాను ఆరు స్థానాలే టీడీపీకి దక్కాయి.

వైసీపీ ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ‌కు ఏం కావాలో ఒక క్లారిటీతో ఉంది. ప్ర‌ధానంగా సీమలో అభివృద్ధి జ‌ర‌గాలంటే రైత‌న్న‌లు బాగుండాలి. అందుకోస‌మే ఇప్పుడున్న సాగునీటి ప్రాజెక్టుల‌తో పాటు ఏం చేస్తే రైతాంగం న‌ష్ట‌పోకుండా ఉంటుందో అది చేసే ప‌నిలోనే సీఎం వై.ఎస్ జ‌గ‌న్ ముందుకెళుతున్నారు. ఇందులో భాగంగానే ద‌శాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఆర్‌.డి.ఎస్ (రాజోలి బండ డైవ‌ర్ష‌న్ స్కీం) కుడి కాలువ ప‌నులు రూ. 1985.42 కోట్ల‌తో చేప‌ట్టేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. ఇక గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో పూర్త‌వుతుంద‌ని అనుకున్నా పూర్త‌వ్వ‌ని వేద‌వ‌తి న‌దిపై ఎత్తిపోత‌లను నిర్మించేందుకు రూ. 1942.80 కోట్ల‌తో సిద్ధ‌మైంది.

Read Also: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం

గ‌త ప్ర‌భుత్వాలు చేయ‌ని ప‌నిని వై.ఎస్ జ‌గ‌న్ వ‌చ్చిన ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలోనే చేస్తున్న‌ప్ప‌టికీ టి.జి వెంక‌టేష్ కు అసంతృప్తి ఎందుకు?ఏమి కోరి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా మాట్లాడుతున్నాడు? త‌మ రాజ‌కీయాల కోసం ప్ర‌జ‌లను గంద‌ర‌గోళానికి గురి చేయ‌డం మంచిది కాదు. ఐదేళ్ల కాలంలో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌ర్నూలు జిల్లాకు ఏం చేశారంటే ఓర్వ‌క‌ల్లులో విమానాశ్ర‌యం తెచ్చి, ఓ సోలార్ ప్లాంట్ తీసుకొచ్చారు. వేలాదిగా ప్రభుత్వ భూములు ఉన్నా ప‌రిశ్ర‌మ‌లు తీసుకురావ‌డంలో విఫ‌లం అయ్యారు. జిల్లా రైతాంగం అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటే చాక‌చ‌క్యంగా ప్రాజెక్ట‌లుపై దృష్టి పెట్ట‌లేదని జిల్లా ప్ర‌జలు గ‌ట్టిగా చెబుతారు. ఈ నేప‌థ్యంలో వై.ఎస్ జ‌గ‌న్ చేస్తున్న అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారు . ఐదేళ్ల స‌మ‌యం ఇస్తే రాష్ట్రంతో పాటు రాయ‌ల‌సీమ‌లో ఏ విధంగా అభివృద్ధి జ‌రుగుతుందో వేచి చూడాలి. అంతేత‌ప్ప ఇలాంటి స్వార్థ రాజ‌కీయాలు చేయాల‌నుకోవ‌డం మంచిది కాదు.నిత్యం అసంతృప్తిని వెళుబుచ్చుతున్న ఈ టీజీ వెంకటేష్ ఐదేళ్ల తరువాత ఏ పార్టీలో ఉంటాడో చెప్పలేము,కచ్చితంగా ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళతాడు…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి