iDreamPost

ఆర్జీవీ అనగానే ఎందుకు కంగారు?

ఆర్జీవీ అనగానే ఎందుకు కంగారు?

ఆర్జీవీ “దిశ” రేప్ గురించి సినిమా తీస్తున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించగానే ఒక వర్గం మీడియా కంగారు పడిపోతోంది. కొందరైతే ఆర్జీవీకి పైత్యం అని రాసేస్తూ ఆ టాపిక్కు మీద సినిమాలెందుకంటూ సూక్తులు వల్లిస్తున్నారు. అలా రాసేవాళ్లు వన్ సైడెడ్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి.

హింస, సెక్స్ వంటి అంశాలకి ఆర్జీవి కేరాఫ్ అడ్రస్ అని కొందరి అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని పెంచి పోషించడంలో ఆర్జీవీ పాత్ర లేదనలేం. తనకు తానుగా సెక్సిస్ట్ స్టేట్మెంట్లు ఇవ్వడం, సినిమాల్లో రక్తపాతం చూపించడం ఆర్జీవీ చేసిన పనుల్లో ముఖ్యమైనవి. అలాగని ఆయన అవే తీస్తాడని, తీయగలడని తేల్చిపారేయలేం. ఎందుకంటే “లక్ష్మీస్ ఎన్.టి.ఆర్” క్లీన్ యు సెర్టిఫికేట్ సినిమా. ఒక్క అశ్లీలమైన సన్నివేశం గాని, సంభాషణ గాని, చిన్న రక్తపు చుక్కగాని లేని సినిమా అది. రాజకీయాంశం తీసి పక్కనబెడితే చాలామంది అందులోని ఎమోషన్ కి కనెక్ట్ అయ్యారు కూడా.  

దానిని పట్టించుకోకుండా ఆర్జీవీ రేపిస్టుల మీద సినిమా అనగానే రేపుని గ్లోరిఫై చేస్తాడేమో అని కొందరి ముందస్తు కంగారు. అలా ఎందుకు చేస్తాడు? చేస్తే ఆయనకేం ఒరుగుతుంది? ఎవరు మెచ్చుకుంటారు? అలా చూపించడం వల్ల ఏ వర్గానికి ఉపయోగం ఉంటుంది? ఇలాంటివి ఏవీ ఆలోచించకుండా రాసేయడం కొందరి పని అన్నమాట.

ఇప్పుడు తాజాగా ఎంకౌంటర్లో పోయిన రేపిస్టు చెన్నకేశవులు భార్యని ఈ రోజు రాత్రి 9 గంటలకి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆర్జీవీ. ఈ సినిమా తీయడం వెనుక తన ఉద్దేశాలను వివరించబోతున్నారట. అది విన్నాక ఒక క్లారిటీకి రావొచ్చు. చూద్దాం ఏం చెప్పబోతున్నారో. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి