iDreamPost

వ్యూహం ట్రైలర్.. నువ్వు మార్పు తేగలిగే ఆ పదవిని గెలవడమే నీ ముఖ్య టార్గెట్ అవ్వాలి

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం మూవీ కొత్త ట్రైలర్ ఆడియెన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ ప్రారంభంలో ఇంతకాలం మీరు పైకి రాకుండా తొక్కేసిన మనిషి పైకే పోయాడు ఇక మీరే.. అంటూ సాగే డైలాగ్ బాబు అసలు రంగును బయటపెడుతోంది.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం మూవీ కొత్త ట్రైలర్ ఆడియెన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ ప్రారంభంలో ఇంతకాలం మీరు పైకి రాకుండా తొక్కేసిన మనిషి పైకే పోయాడు ఇక మీరే.. అంటూ సాగే డైలాగ్ బాబు అసలు రంగును బయటపెడుతోంది.

వ్యూహం ట్రైలర్.. నువ్వు మార్పు తేగలిగే ఆ పదవిని గెలవడమే నీ ముఖ్య టార్గెట్ అవ్వాలి

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా మూవీ వ్యూహం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, దానికి దారితీసిన పరిస్థితులు ఏంటీ అన్న దానిపై మొదటి పార్ట్ రూపుదిద్దుకుంటోంది. అయితే తాజాగా వ్యూహం రెండో ట్రైలర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ట్రైలర్ ప్రారంభం నుంచి వచ్చే డైలాగులు ఆద్యాంతం ఆసక్తికరంగా ఉన్నాయి. వ్యూహం మూవీపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ట్రైలర్ లో.. ఇంతకాలం మీరు పైకి రాకుండా తొక్కేసిన మనిషి పైకే పోయాడు ఇక మీరే.. అంటూ చంద్ర బాబు అసలు రంగు బయట పెట్టే డైలాగుతో మొదలైంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ ఆర్జీవీ. జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? జగన్ ఏపీ సీఎం ఎలా అయ్యారు? ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిస్థితులు.. రాజకీయ నాయకులు వ్యవహరించిన తీరును వర్మ క్లియర్ గా చూపించారు. బాబు తన గెలుపు కోసం పన్నిన కుట్రలు.. దానికోసం పవన్ ను ఎరగా వేసి ప్యాకేజీ స్టార్ గా మార్చిన తీరును ఆర్జీవీ విప్పి చెప్పే ప్రయత్నం చేశారు.

ఓదార్పు యాత్రలో జనం వచ్చింది నాన్న మీద ప్రేమతో అంటూ వైస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేశారు. జనాలకు నేనున్నానంటూ జగన్ ఓదార్చిన తీరు ట్రైలర్ లో ఆకట్టుకుంటోంది. వైఎస్ విజయమ్మ భావోద్వేగాలను, నువ్వు మార్పు తేగలిగే ఆ పదవిని గెలవడమే నీ ముఖ్య టార్గెట్ అవ్వాలి.. అని భారతి జగన్ తో చెప్పిన తీరు మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ట్రైలర్ తో వైఎస్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకున్న వ్యూహంకు సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి