iDreamPost

Rohit-Dale Steyn: కేప్ టౌన్ పిచ్.. రోహిత్ విమర్శలపై స్పందించిన డేల్ స్టెయిన్!

కేప్ టౌన్ పిచ్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యాడు సఫారీ దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్.

కేప్ టౌన్ పిచ్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యాడు సఫారీ దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్.

Rohit-Dale Steyn: కేప్ టౌన్ పిచ్.. రోహిత్ విమర్శలపై స్పందించిన డేల్ స్టెయిన్!

టీమిండియా-సౌతాఫ్రికా మధ్య కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ కేవలం ఒకటిన్నర రోజులోనే ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పిచ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడా దిగ్గజాలు సర్వత్రా విమర్శలు గుప్పించారు. వారితోపాటుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం పిచ్ కండిషన్స్ ను ప్రస్తావిస్తూ.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. టీమిండియా పిచ్ లపై విమర్శలు చేయనంత కాలం, ఇలాంటి పిచ్ లపై ఆడటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కౌంటర్ ఇచ్చాడు. పేస్ పిచ్ లపై ఆడిన విధంగానే స్పిన్ పిచ్ లపై కూడా ఆడాలని, పిచ్ పై వచ్చిన పగుళ్లను చూసి భయపడొద్దని ప్రత్యర్థులకు సూచించాడు. అయితే తాజాగా రోహిత్ వ్యాఖ్యలపై స్పందించాడు సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్. కేప్ టౌన్ పిచ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, రోహిత్ వ్యాఖ్యలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

కేప్ టౌన్ పిచ్ పై విమర్శల వేడి ఇంకా తగ్గడం లేదు. భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ కేవలం ఒకటిన్నర రోజులోనే ముగిసిన సంగతి తెసిందే. పిచ్ నుంచి వచ్చిన అనూహ్యమైన బౌన్స్ కారణంగా బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. ఒక్కరిద్దరు తప్పితే మిగతా బ్యాటర్లంతా బౌలర్లకు దాసోహం అయ్యారు. దీంతో ఈ పిచ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం కేప్ టౌన్ పిచ్ పై తనదైన శైల్లో కామెంట్స్ చేశాడు. భారత స్పిన్ పిచ్ లను విమర్శించనంత కాలం.. ఇలాంటి పిచ్ లపై ఆడటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఇండియాలో తొలిరోజే పిచ్ పై ఉన్న పగుళ్లను చూసి ప్రత్యర్థులు భయపడొద్దని వారికి రోహిత్ స్వీట్ కౌంటర్ సైతం ఇచ్చాడు.

ఇక హిట్ మ్యాన్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించాడు సఫారీ దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్. సోషల్ మీడియా వేదికగా స్టెయిన్ మాట్లాడుతూ..”స్పిన్ పిచ్ లపై ఆడేందుకు తమకు ఎలాంటి భయమూ లేదు. పిచ్ పై పగుళ్లు వస్తే.. మాకెందుకు భయం. అయితే సిడ్నీ, పెర్త్ పిచ్ లపై కూడా పగుళ్లు వస్తాయి.. ఇంకా చెప్పాలంటే అందులో కార్లు కూడా పార్క్ చేసుకోవచ్చు. అయినా ఆ పిచ్ లపై టెస్ట్ లు నాలుగు, ఐదు రోజుల వరకు వెళ్తాయి. టైమ్ గడుస్తున్న కొద్ది పిచ్ లో మార్పులు వస్తూ ఉండాలి. కనీసం ఒక్క పగులు లేకుండా మ్యాచ్ లు ముగిస్తే ఎవరికి లాభం? అదీకాక రెండు రోజుల్లో ముగిసిన మ్యాచ్ లను టెస్టులని ఎలా అంటారు?” అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు స్టెయిన్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి