iDreamPost

బడా సంస్థలు – భారీ దెబ్బలు

కొన్నిసార్లు వీటి నుంచి ఫ్లాపులు వచ్చినా సరే నష్టాల బారిన పడకుండా కాపాడింది బ్రాండ్ ఇమేజే. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఆడియన్స్ మారిపోయారు. ఎవరు తీశారు ఎవరు ఉన్నారని పట్టించుకోవడం లేదు.

కొన్నిసార్లు వీటి నుంచి ఫ్లాపులు వచ్చినా సరే నష్టాల బారిన పడకుండా కాపాడింది బ్రాండ్ ఇమేజే. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఆడియన్స్ మారిపోయారు. ఎవరు తీశారు ఎవరు ఉన్నారని పట్టించుకోవడం లేదు.

బడా సంస్థలు – భారీ దెబ్బలు

ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్, వైజయంతి మూవీస్ అని పేరు మోసిన బ్యానర్లు ఉంటే చాలు హీరో ఎవరని చూడకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళేవాళ్ళు. విజయా లాంటి సంస్థలు చరిత్రలో నిలిచిపోవడానికి కారణమిదే. కొన్నిసార్లు వీటి నుంచి ఫ్లాపులు వచ్చినా సరే నష్టాల బారిన పడకుండా కాపాడింది బ్రాండ్ ఇమేజే. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఆడియన్స్ మారిపోయారు. ఎవరు తీశారు ఎవరు ఉన్నారని పట్టించుకోవడం లేదు. తమకు నచ్చినట్టు చూపిస్తే హిట్టు లేదంటే మొహం మీద కొట్టు అనే సూత్రంతో చాలా నిర్దాక్షిణ్యంగా తీర్పులు ఇస్తున్నారు. గత కొన్ని నెలల్లో గమనిస్తే చిరంజీవి, నాగచైతన్య, రామ్, గోపీచంద్ వీళ్ళందరికీ పరాభవం తప్పలేదు.
Big companies - heavy blows
ఈ పరిణామాల వల్ల కొన్ని బడా కంపెనీల వ్యవహారం భారీతనం ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా మారిపోయింది. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)కి వరసగా దెబ్బలు పడుతున్నాయి. సర్కారు వారి పాట ఎంత హిట్ అని చెప్పుకున్నా చివరికి పది కోట్ల దాకా పోయిందని ట్రేడ్ టాక్. అంటే సుందరానికి సైతం 9 కోట్ల దాకా నష్టం తప్పలేదు. ఇక హ్యాపీ బర్త్ డే సంగతి సరేసరి. ఎంత తక్కువకు అమ్మినా అందరికీ దెబ్బేసింది. బాలీవుడ్ లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. తమ 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్న టాప్ ప్రొడక్షన్ హౌస్ కు యష్ రాజ్ ఫిలింస్( Yash Raj Films)కు గత కొంత కాలంగా భారీ డిజాస్టర్లు వందల కోట్ల నష్టాన్ని మిగిల్చి విపరీతంగా భయపెట్టేశాయి.

ఇటీవలే వచ్చిన షంషేరాతో మొదలుపెడితే దీనికన్నా ముందు వచ్చిన సామ్రాట్ పృథ్విరాజ్, జయేష్ బాయ్ జోర్దార్, బంటీ ఆర్ బబ్లీ 2 ఒకదాన్ని మించి మరొకటి కనీసం బ్రేక్ ఈవెన్లో సగం కూడా రాబట్టలేక చతికిలపడ్డాయి. ఎంతలేదన్నా వీటి ద్వారా థియేట్రికల్ లాస్ 300 కోట్ల దాకా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్ల మాట. ఏ ఒక్కటీ కనీసం యావరేజ్ కాకపోవడం అసలు ట్రాజెడీ. సురేష్ సంస్థ సోలోగా సినిమాలు తీయడం ఆపేసినా, క్రియేటివ్ కమర్షియల్స్ కెఎస్ రామారావు ఆచితూచి అడుగులు వేస్తున్నా కారణాలు ఇవే. వీళ్ళు సైతం ఎంత క్యాలికులేటెడ్ గా ఉన్నా సరే వరల్డ్ ఫేమస్ లవర్, విరాట పర్వం లాంటి డిజాస్టర్లు తప్పలేదు. మారుతున్న ట్రెండ్ మహిమ అంతే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి