iDreamPost

ఒక పెద్ద ఆఫర్ ని అడవి శేషు ఎందుకు వదులుకున్నట్టు?

టాలీవుడ్ ప్రేక్షకులకి అడవి శేషు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓ సామాన్యుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన మార్కును చూపించాడు. కథలను ఎంచుకోవడంలో అడవి శేషుది ప్రత్యేక శైలి.

టాలీవుడ్ ప్రేక్షకులకి అడవి శేషు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓ సామాన్యుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన మార్కును చూపించాడు. కథలను ఎంచుకోవడంలో అడవి శేషుది ప్రత్యేక శైలి.

ఒక పెద్ద ఆఫర్ ని అడవి శేషు ఎందుకు వదులుకున్నట్టు?

అడవి శేషు పేరు ఓ సిగ్నేచర్, ఓ స్టాంప్, ఓ హాల్ మార్క్. ఎందరో హీరోలతో సినిమా ఇండస్ట్రీ సముద్రంలో పెద్ద పడవలా ఊగుతుంటే, ఓ సామాన్య, సగటు ప్రయాణికుడిలా ఆ పడవనెక్కి, అగ్రహీరోలందరితో పాటూ తనూ ధీటైన ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్న ప్రత్యేకత ఎవరికైనా దక్కుతుంటే అది అఢవి శేషుకే దక్కుతుందని చెప్పడానికి ఏ మాత్రం సందేహించనక్కర్లేదు. తనది ఎవరికీ సంబంధం లేని బ్రాండ్, చాలా విభిన్నమైన ట్రెండ్.

అడవి శేషు సినిమా అంటే ప్రేక్షకలోకంతో పాటు సినీ పరిశ్రమ, పరిశ్రమలో హీరోలతో కలిపి ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తారు. ఇటువంటి అరుదైన, పదునైన ఫాలోయింగ్ అడవి శేషు సొంతం. క్వాంటిటీ కన్నా క్వాలిటీకే అదిక ప్రాధాన్యతనిచ్చే శేషు నుంచి 2023లో ప్రేక్షకులకు ఏ సినిమా కూడా దక్కలేదు. పూర్తిగా కొత్త సినిమా….అదే గూఢచారి 2 సినిమా కథని రాసుకోవడంలోనే పూర్తిగా తలమునకలైన శేషు ప్రతీ సంవత్సరం తన సినిమా అన్నది ఒక్కటైనా రిలీజు కావాలనే ఆత్రం, ఆదుర్దా లేకుండా స్థిమితంగా కూర్చుని కథను తయారుచేసుకుని షూటింగ్ కి సిద్ధమవుతున్నాడు అడవి శేషు.

Adivi Sesh

ఎంత వరకూ వచ్చామని కాదు, ప్రయాణాన్ని మాత్రమే ఆస్వాదించాలనే ఫిలాసఫీనే ఎక్కువ నమ్మే అడవి శేషు వెనక్కి తిరిగి చూస్తే అద్భుతమైన హిట్ 2, మేజర్ లాటి చిత్రాలు కనిపిస్తాయి. అడవి శేషు మాటల్లో చెప్పాలంటే ప్రతీ హీరోకి ఓ నిర్దిష్టమైన వేగం ఉంటుంది, నెంబరాఫ్ ఫిల్మ్స్ అనే కాన్సెప్ట్ నుంచి ప్రేక్షకులకి ఎటువంటి విభిన్నమైన సినిమాని అందిస్తున్నామని చెప్తాడు. అతి తక్కువ బడ్జెట్‌ పరిమితి నుంచి పాన్‌ ఇండియా స్థాయికి ఎదగడం అనే అభివృద్ధికి సంబంధించింది.

అలానే అదంతా ప్రేక్షకులు చూపించిన ఆదరణకే అంకితం అని అడవి శేషు చెప్పడం తన సంస్కారమే. కానీ, అందులో మేజర్‌ లాటి సినిమాతో పాన్‌ ఇంఢియా స్థాయిని సాధించడంలో అడవి శేషు అంకితభావం, అహర్నిశల కృషి ఇమిడిఉంది అనేది కీలకమైన పాయింట్. మీ సినిమాలన్నీ హిందీలో రిలీజవుతాయా అన్న ప్రశ్నకి సమాధానంగా, గూఢచారి టు ఐదు దేశాలకు సెట్‌ చేసిన హెవీ ప్రాజెక్టు అని, శ్రుతి హాసన్‌ చేసిన వెర్షన్‌ మాత్రం హిందీ, తెలుగు భాషలలో విడుదలవుతుందని అడవి శేషు చెప్పాడు.

ఇటీవలి రోజులలో అడవి శేషు ఓ పెద్ద ఆఫర్‌ని వదులుకున్నాడు. దాని వెనుక ఉన్న కారణాలను తరచి చూస్తే అడవి శేషుకి తను చేసే కథల పట్ల, ప్రాజెక్టుల పట్ల ఎటువంటి కమిట్‌మెంట్‌ ఉందో తెలుస్తుంది. డబ్బు అనేదానికి కన్నా కూడా ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేయడమే ముఖ్యం అని చెప్పి, అటువంటి పెద్ద ఆఫర్‌ని ఎందుకు వదులుకున్నాడో చెప్పీచెప్పకుండా చెప్పాడు శేషు. ఉన్ని కృష్ణన్‌ ఫ్యామిలీతో ఇంకా అనుబంధం కొనసాగుతోందా అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ’’ మేజర్ సినిమా నుంచి ఆయన పేరెంట్స్ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. మొన్న 26. 11కి వాళ్ళదగ్గరికి ముంబై వెళ్ళి గడిపాను’’ అని  ఒక ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో శేషు చెప్పాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి