iDreamPost

Burj Khalifa: వేల కోట్లతో కట్టిన బుర్జ్ ఖలీఫాకి ఇదేమి కర్మ! రోజూ ఇంత చెండాలమా?

ఏంటి వేల కోట్లతో కట్టిన బుర్జ్ ఖలీఫాకి డ్రైనేజ్ వ్యవస్థ లేదా? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే బుర్జ్ ఖలీఫాకి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. టాయిలెట్స్, మరుగుదొడ్డి వంటి వ్యర్థాలు పోవడానికి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. దీనికే కాదు.. దుబాయ్ లో పెద్ద పెద్ద బిల్డింగులకి డ్రైనేజ్ వ్యవస్థ లేదు.

ఏంటి వేల కోట్లతో కట్టిన బుర్జ్ ఖలీఫాకి డ్రైనేజ్ వ్యవస్థ లేదా? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే బుర్జ్ ఖలీఫాకి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. టాయిలెట్స్, మరుగుదొడ్డి వంటి వ్యర్థాలు పోవడానికి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. దీనికే కాదు.. దుబాయ్ లో పెద్ద పెద్ద బిల్డింగులకి డ్రైనేజ్ వ్యవస్థ లేదు.

Burj Khalifa: వేల కోట్లతో కట్టిన బుర్జ్ ఖలీఫాకి ఇదేమి కర్మ! రోజూ ఇంత చెండాలమా?

ఇంట్లో బాత్రూంకెళ్తే ఆ వ్యర్థాలు డ్రైనేజ్ ద్వారా బయటకు పోవడం లేదా ఇంట్లోనే తవ్వుకున్న సెప్టిక్ ట్యాంక్ లోకి పోవడమో జరగాలి. ఒకవేళ సెప్టిక్ ట్యాంక్ నిండిపోతే ఒక ట్రక్ వచ్చి ఖాళీ చేసి పోతుంది. అయితే ఒకసారి సెప్టిక్ ట్యాంక్ ట్రక్ వస్తేనే అసహ్యించుకుంటాం. అలాంటిది బుర్జ్ ఖలీఫా నుంచి సిటీ అవుట్ కట్స్ కి రోజూ పదుల సంఖ్యలో ట్రక్కులు తిరుగుతుంటాయి. వినడానికి కంపరంగా ఉన్నా ఇదే అక్కడ జరుగుతుంది. సుమారు 12 వేల కోట్లు ఖర్చు చేసి అంత పెద్ద భవనాన్ని కట్టినోళ్లు.. బాత్రూంకెళ్తే నేరుగా డ్రైనేజ్ లో కలిసేలా ఎందుకు చేయలేకపోయారో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.     

బుర్జ్ ఖలీఫా గురించి వినే ఉంటారు. దుబాయ్ లో ఉన్న ఈ బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అతి పెద్ద బిల్డింగ్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇదొక్కటేనే కాదు.. బుర్జ్ ఖలీఫా పేరు మీద చాలా రికార్డులు ఉన్నాయి. మురుగునీటి వ్యవస్థ లేని అతి పెద్ద టవర్ గా కూడా దీని మీద ఇంకో రికార్డు అయితే ఉంది. మురుగునీటి వ్యవస్థ లేకపోతే ఎంత అవస్థలు పడాల్సి ఉంటుందో మీకో అవడియా ఉండే ఉంటుంది. టాయిలెట్స్ కి వెళ్లినా, బాత్రూంకి పోయినా, హ్యాండ్ వాష్ లు చేసుకున్నా, స్నానాలు గట్రా చేసినా.. దీన్నుంచి వచ్చే వ్యర్థాలు, మురుగు నీరు ఎప్పటికప్పుడు డ్రైనేజ్ లో కలిసిపోవాలి. లేదా అండర్ గ్రౌండ్ లో సెప్టిక్ ట్యాంక్ లు తవ్వితే అందులోకి తరలించాలి. అంత భారీ బిల్డింగ్ కాబట్టి సెప్టిక్ ట్యాంక్ సరిపోదు. కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ ఉంటే ఎప్పటికప్పుడు వ్యర్థాలు పోవడానికి వీలుంటుంది.

కానీ బుర్జ్ ఖలీఫాలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు. దీనికి బదులుగా ఈ మురుగునీటి వ్యర్థాలను పెద్ద పెద్ద ట్యాంకర్లలో తరలిస్తారు. భారీ ట్రక్స్ లో సిటీ అవతల ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రానికి తరలిస్తారు. ఒకరోజుకు బుర్జ్ ఖలీఫా నుంచి 7 టన్నుల వ్యర్థాలు, దీనికి రెండు రెట్లు వ్యర్థ జలాలు వస్తాయి. దీని కోసం ప్రతిరోజూ ఒక యావరేజ్ వేక్యూమ్ ట్రక్ కావాలి. లేదా అంతకంటే పెద్దది కావాలి. ఇదొక్కటేనే కాదు.. దుబాయ్ లో ఉన్న చాలా పొడవైన బిల్డింగులకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అయితే కొంతమంది ఈ మురుగునీటిని పారవేసేందుకు పురాతన వ్యవస్థ ఉందని అంటారు. మరికొందరు అయితే వాటర్ మేనేజ్మెంట్, ఎనర్జీ కన్వర్షన్, వేస్ట్ మేనేజ్మెంట్ కోసం బుర్జ్ ఖలీఫా అధునాతన వ్యవస్థను కలిగి ఉందని అంటారు.

Poo pump out in bhurj khlifa

వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన భవనంలో బాత్రూంకెళ్తే పోవడానికి దారి లేదా? ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు అని సెటైర్లు వేసేవాళ్ళు లేకపోలేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఉంటే ఈ దరిద్రం అంతా అక్కడ నుంచే  డ్రైనేజ్ లో డైరెక్ట్ గా కలిసిపోతుంది కదా.. దీని కోసం ట్రక్కులు, డ్రైవర్లు ఈ పంచాయితీ అవసరమా అని అనిపిస్తుంది కదూ. అయితే అక్కడి ప్రభుత్వం తెలివితక్కువదేమీ కాదు. అక్కడ ఈ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడానికి బలమైన కారణం ఉంది. బుర్జ్ ఖలీఫా పూర్తయ్యే నాటికి దుబాయ్ 2008 క్రెడిట్ క్రంచ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతుంది. అంటే బ్యాంకుల నుంచి రావాల్సిన లోన్లు రాలేదు. దీని వల్ల సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల డబ్బులు వృధా అవుతాయని భావించారు.

అంతేకాదు డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తే అయ్యే ఖర్చు కంటే రోజూ వ్యర్థాలను ట్రక్కులతో తొలగించడం ద్వారా అయ్యే ఖర్చే తక్కువని అప్పట్లో అధికారులు భావించారు. అయితే 35 వేల మంది ఉండే ఈ బుర్జ్ ఖలీఫా నుంచి ఒక రోజుకు 15 టన్నుల వ్యర్థాలు బయటకు వస్తాయి. అయితే ఇలా ట్రక్కుల్లో ఈ దరిద్రాన్ని తరలించే బాధలు పడలేక డ్రైనేజీ వ్యవస్థను మరలా డెవలప్ చేయడానికి దుబాయ్ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది. అయితే అది ఇప్పట్లో అయ్యేది కాదని నిపుణుల మాట. ఒకవేళ మీరు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాని చూడడానికి వెళ్తే కనుక.. అక్కడ ఆరెంజ్ రంగులో ఉండే ట్రక్కులకు దూరంగా ఉండండి. కారులో తిరిగితే కారు అద్దాలు మూసేసుకుంటే మంచిది. పొరపాటున లీకైతే వీకైపోతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి