iDreamPost

అనంత్ అంబానీ బరువు పెరగడం వెనుక కారణం? ఈ కష్టం ఎవరికీ రాకూడదు!

  • Published Mar 04, 2024 | 1:12 PMUpdated Mar 04, 2024 | 1:41 PM

Anant Ambani: మూడు రోజుల పాటు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీ వారసుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు కనీవినీ రీతిలో జరిగాయి. అయితే.. ఈ క్రమంలోనే అనంత్‌ శరీర బరువు గురించి కూడా చర్చ జరుగుతోంది.. అసలు అతను అంత బరువు ఎందుకు పెరిగాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Anant Ambani: మూడు రోజుల పాటు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీ వారసుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు కనీవినీ రీతిలో జరిగాయి. అయితే.. ఈ క్రమంలోనే అనంత్‌ శరీర బరువు గురించి కూడా చర్చ జరుగుతోంది.. అసలు అతను అంత బరువు ఎందుకు పెరిగాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 04, 2024 | 1:12 PMUpdated Mar 04, 2024 | 1:41 PM
అనంత్ అంబానీ బరువు పెరగడం వెనుక కారణం? ఈ కష్టం ఎవరికీ  రాకూడదు!

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు.. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అంబానీ ఇంట పెళ్లి వేడుకల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంత వరకు కనీవినీ ఎరుగని విధంగా.. ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిరథ మహారధుల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించింది అంబానీ కుటుంబం. వ్యాపార దిగ్గజాలు, క్రికెటర్లు, బాలీవుడ్‌ స్టార్ల రాకతో జామ్‌నగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. దీంతో.. మీడియాలో, సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ గురించే టాక్‌. ఈ క్రమంలోనే అనంత్‌ అంబానీ శరీర ఆకృతిపై కూడా చర్చ జరుగుతోంది.

వేల లక్షల కోట్లకు వారసుడైన అనంత్‌ అంబానీ ఎందుకు బరువు తగ్గడం లేదు? మంచి పోషక ఆహారం తినే అవకాశం ఉన్నా? ప్రపంచంలో ఏ ఆస్పత్రిలోనైనా సరే చికిత్స పొందే శక్తి ఉన్నా? ఇంత ఆస్తి ఉండి కూడా.. అనంత్‌ ఎందుకు ఇలా అధిక బరువుతో బాధపడుతున్నాడని చాలా మంది అనుకుంటున్నారు. అతను లావు అవ్వడం వెనుక ఉన్న కారణం తెలిస్తే.. అయ్యో పాపం అనకమానరు. అతని కష్టం పగోడికి కూడా రాకూడని అనుకుంటారు. అసలింతకీ అనంత్‌ ఎందుకు అలా బరువు పెరుగుతూ ఉంటాడు? కొన్నేళ్ల క్రితం పూర్తిగా బరువు తగ్గి స్లిమ్‌గా, సినిమా హీరోలా మారిన కుర్రాడు మళ్లీ ఇప్పుడిలా ఎందుకు లావు అ‍య్యాడో ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంలోనే అత్యంత సంపన్న కుటుంబంలో పుట్టి, ముఖేష్‌ అంబానీ-నీతా అంబానీ ముద్దుల బిడ్డగా పెరిగిన అనంత్‌ అంబానీకి ఆస్తమా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ ఆస్తమా సమస్య వల్ల అతని శ్వాసకోశ నాళాలు ఉబ్బతూ ఉంటాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు, ఉపశమనం పొందేందుకు అతను స్టెరాయిడ్స్‌ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆస్తమా ఇబ్బందులను రక్షణగా డాక్టర్ల సూచన మేరక స్టెరాయిడ్స్‌ వాడటం వల్ల.. అనంత్‌కు బాగా ఆకలు పెరిగింది. దాంతో పాటు బరువు కూడా విపరీతంగా పెరిగాడు. ఈ విషయాన్ని స్వయంగా అనంత్‌ తల్లి.. నీతా అంబానీనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే.. ప్రీ వెడ్డింగ్‌ సందర్భంగా తన అనారోగ్యం గురించి అనంత్‌ చెబుతుంటే.. ముఖేష్‌ అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్ని లక్షల కోట్లు ఉన్నా.. కన్న కొడుకు ఆరోగ్యం బాగాలేకుంటే.. కన్న పేగు తల్లడిల్లిపోతుంది కదా అంటూ నెటిజన్లు కూడా ఆ వీడియో చూసి జాలి చూపించారు. మరి అనంత్‌ బరువు పెరగడం వెనుక ఉన్న కారణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి