iDreamPost

మైఖేల్ జాక్సన్‌తో డ్యాన్స్ చేసిన ఈ మహిళ ఎవరు.. ఇప్పుడెలా ఉన్నారంటే..?

పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యేకమైన ఆట పాటతో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పాప్ సంగీతంతో, డ్యాన్సులతో ఓలలాడించాడు. 50 ఏళ్ల వయస్సులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. కానీ

పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యేకమైన ఆట పాటతో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పాప్ సంగీతంతో, డ్యాన్సులతో ఓలలాడించాడు. 50 ఏళ్ల వయస్సులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. కానీ

మైఖేల్ జాక్సన్‌తో డ్యాన్స్ చేసిన ఈ మహిళ ఎవరు.. ఇప్పుడెలా ఉన్నారంటే..?

అతడే ఓ ప్రభంజనం. మైక్ పట్టాడంటే.. స్టేజీ కూడా డ్యాన్స్ చేయాల్సిందే. ఇక అతడు కాలు కదిపితే.. ఊగిపోతుంటారు ఫ్యాన్స్. పాప్ సాంగ్స్ ప్రపంచానికి ఆద్యుడు, రారాజు. నాట్యానికి కొత్త నడకలు నేర్పిన డ్యాన్సర్. అతడే మైఖేల్ జాక్సన్. ఇతడి పేరు చెబితే.. తెలియని వారుండరు బహుశా. స్పింగులను తిన్నట్లుగా అతడు చేసే డ్యాన్సులు, స్టెప్పులకే కాదూ..అతడు పాడే పాటలకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు ఈ లోకంలో. పాప్ సంగీతం ప్రపంచంలో ఎన్నో దశాబ్దాల పాటు ఓలలాడించిన ఈ అమెరికన్ సింగర్.. 2009 జూన్ 25న కన్నుమూశాడు. ఇప్పుడు ఆయన బయోపిక్ రెడీ కాబోతుంది. మైఖేల్ పేరుతో రాబోతున్న ఈ బయోపిక్.. 2025లో విడుదల కానుంది. ఇందులో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటించబోతున్నాడు. ఇతడికి ఇదే మొదటి సినిమా.

పాశ్చాత్య సంగీతాన్ని ఇండియన్స్‌కు పరిచయం చేసిన అమెరికన్ సింగర్ మైఖేల్ జాక్సన్. ‘డేంజరస్’‘జస్ట్ బీట్ ఇట్‘ సాంగ్స్ ఎంతలా ఆకట్టుకున్నాయంటే.. భారత్ లో టేప్ రికార్డర్స్ అరిగిపోయేవి. ఆయన పాట వస్తుందంటే చాలు ఊగిపోయేవారు భారతీయులు. ఇక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడకు వస్తే చూడాలని ఆశపడేవారు. 1996లో ముంబయి వచ్చాడు జాక్సన్. అయితే అంతకు ముందే ఆయన  భారతీయ ఉట్టిపడేలా ఓ డ్యాన్స్ బీట్..తన ఆల్బమ్ లో పొందుపరిచాడు. ఓ వైపు ర్యాప్ డ్యాన్సుతో మైఖేల్.. మరో వైపు సాంప్రదాయ నృత్యంతో మహిళ కాలు కదిపారు. ఇది అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టార్. ఆ తర్వాత ఈ థీమ్‌ను చాలా సినిమాల్లో కూడా వినియోగించారు.

Who is this woman who danced with Michael Jackson

మైఖేల్ తన సాంగ్స్‌తో ఓ మెసేజ్ కూడా ఇచ్చేవాడు. అలా బ్లాక్స్ లైవ్ మేటర్ ఇష్యూను 1991లో తనదైన శైలిలో చెప్పాడు. బ్లాక్ ఆర్ వైట్ అనే ఆల్బమ్ రూపొందించాడు. ఈ పాటకు మిలియన్ల మంది అభిమానులున్నారు. ఇందులో అతడితో కలిసి కాలుకదిపిన మహిళ పేరు యమునా శంకర శివ. ప్రస్తుతం ఆమె నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు యమునను చూస్తే గుర్తు పట్టలేరు. మైఖేల్ జాక్సన్ పక్కన ఆడిపాడే ఛాన్స్ ఎలా వచ్చిందో గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారామే. ఆమె శ్రీలంక వాసి. పాశ్చాత్య శాస్త్రీయ పియానో, తమిళ కర్ణాటక సంగీతం, భరత నాట్యంలో శిక్షణ తీసుకుంది. అమెరికాలో యూనివర్శిటీలో చదువుతున్న సమయంలో ఆమెకు ఈ అరుదైన అవకాశం వచ్చింది.

బ్లాక్ అండ్ వైట్ ఆల్బమ్ కోసం ఆర్టిస్టు కావాలని ప్రచారం చేశాడు మైఖేల్. దీన్ని చూసి వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 3000 మందిని ఇంటర్వ్యూకు పిలిచారు. వారిలో యమునా కూడా ఒకరు. ఆమె చేసే శాస్త్రీయ నృత్యానికి ఫిదా అయిన జడ్జీలు యమునను ఫైనల్ చేశారు. ఇక ఆ ఆల్బమ్‌లో యమునా ఒడిస్సీ డ్యాన్స్ చేసింది. ఈ షూటింగ్ కోసం మైఖేల్ ఆమె కోసం కారు పంపేవాడట. అలాగే 20 నిమిషాల డ్యాన్స్‌ను 14 గంటల పాటు చిత్రీకరించారట. లాస్ ఏంజిల్స్ ఎక్స్ ప్రెస్ లైన్ ఆ 14 గంటల పాటు మూసివేశారట. ప్రస్తుతం యమున వయస్సు 55 ఏళ్లు. వయస్సు పైబడిన కారణంగా డ్యాన్స్ కు విరామం ఇచ్చారామె. ఈ పాట ఎంత మందికి తెలుసో.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి